
8
దయా రహిత ఆకాశం
ఇంకా చలికాలం వదలనందువల్ల తొందరగా చీకటి పడిపోయేది. దుకాణాలన్నీ ఆరుగంటలకు మూసేసేవారు. నగరకేంద్రమైన పిక్కడిల్లీలో కూడా రాత్రి ఏడుకాగానే జనం పలచబడిపోయేవారు. భోజనశాలలు, మద్యశాలలు, నాటకశాలలు తప్ప నగరమంతా దాదాపుగా నిర్మానుష్యమైపోయేది.
ఆ చలి సాయంకాలాల్లో నగర వీథుల్లో తిరుగుతున్నపుడు ‘జెంటిల్‌మేన్, వుడ్ యూ మైండ్ స్పేరింగ్ ఎ పెన్నీ’ అంటో ఎదురపడే బెగ్గర్స్ నన్నెంతో చకితుణ్ణి చేశారు. భారతదేశంలో బిచ్చమెత్తడానికీ, ఇంగ్లాండ్‌లో బెగ్గింగ్కీ మధ్య ఎంతో వ్యత్యాసముంది. ఎముకలు కొంకర్లు పోయే ఆ చలిలో, ఆ ప్రైవేటుదేశంలో మనిషి యాచకుడు కావడమంటే దయారహిత ఆకాశంకింద ప్రాయోపవేశానికి పూనుకోవడమే.
మొదటిసారిగా బెగ్గర్లను వీథిలో చూసినపుడు ఆ రాత్రంతా నిద్రలో వాళ్ళు నన్ను వెంటాడుతూనేవున్నారు. ప్రపంచానికి అభివృద్ధిక్రమంలో మోడల్ని ఇచ్చిన ఇంగ్లాండ్‌లో ఈ శతాబ్దాంతంలో అందరు నిరాశ్రయులు కన్పించడం నన్నెంతో కలవరపర్చింది. ఈమాటే మా ప్రొఫెసర్‌తో అంటే ఆయన విచారంగా, పరిస్థితి ఈ పదేళ్ళలోనే ఈ స్థితికి చేరుకుందనీ, ప్రభుత్వ విధానాలే ఇందుకు కారణమనీ అన్నాడు.
ఇది కేవలం థాచర్ని నిందించడంతో సరిపోయే విషయం కాదు. గత మూడువందల యేళ్ళుగా ఇంగ్లాండ్ ఎంతో కాన్షస్‌గా, గర్వంగా ఎంచుకున్న పారిశ్రామిక ఆర్థికవ్యవస్థ మోడల్లోనే ఈ విషాదం వుంది. ఈ రోజు థాచర్ నమ్మకాలు థాచర్కున్నాయి. శ్రేయోరాజ్యంకూడా డబ్బులేకపోతే నడవలేదని థాచర్ సరిగానే గ్రహించింది. ‘గుడ్ సామరిటన్కి డబ్బులేకుండా కేవలం పరోపకారితనమే వుండివుంటే మనం ఆయన్ని గుర్తు పెట్టుకునే వాళ్ళమే కాదని’ థాచర్ అన్నదట.
గోర్బచేవ్, థాచర్‌ల వంటి వాళ్ళు తమ వ్యవస్థల అసలు ముఖాల్ని నిస్సిగ్గుగా బహిరంగపరిచినవారు. వాళ్ళని నిందించేవాళ్ళు, ఆ వ్యవస్థల బోలుతనాన్ని నిందించి తీరాలి ముందు.
పారిశ్రామికీకరణలో తన యవ్వనదినాల్లో ఉన్నపుడు మాంచెస్టర్ని ‘ఆధునిక ఏథెన్స్’గా అభివర్ణించాడు బెంజమిన్ డిస్రేలి. ఆయన తన ‘కోనింగ్స్ బై’ నవలలో ఇంకా ఇలా రాసాడు: ‘ప్రకృతి తమకు నిర్దేశించిన రంగస్థలంలో పెట్టుబడీ, శాస్త్రీయ విజ్ఞానమూ పరస్పరం సాధించిన అపూర్వభాగస్వామ్యం ఈ నగరం’.
కాని మాంచెస్టర్ని చూసినవారంతా అటువంటి పారవశ్యానికి లోనుకాలేక పోయారు. 1842లో లంకాషైర్ పారిశ్రామిక వాడల్ని సందర్శిన ఒక ఇంగ్లీషు యాత్రీకుడు ఇలా రాసేడు: ‘నేను మొదటిసారి మాంచెస్టర్ని చూసినప్పుడు ఆ నగరం నాపైన చూపించిన ప్రభావం నాకింకా గుర్తింది. లివర్‌పూల్ రైల్వే టెర్మినస్ ఎదుట నిల్చొని మొదటిసారి ఆ నగరాన్ని చూసినప్పుడు ఒక పొగగొట్టాల అడవినీ, ఆ గొట్టాలనుండి అంతులేకుండా ఉబికివస్తున్న ఆవిరినీ, పొగనీ, ఆ పొగ ఒక ఇంకుగొడుగులా ఆకాశమంతటా వ్యాపించి నగరాన్ని ఆవరించడాన్నీ చూశాను’.
ఇంతకన్నా తీవ్రమయిన విమర్శ డికెన్స్ లో కన్పిస్తుంది. ఆయన ‘హార్డ్ టైమ్స్’ (1854) నవలలో కోక్టౌన్ పారిశ్రామిక నగరాల ప్రాతినిధ్యనగరం. ఆ నగరం గురించి ఆయన ఇలా వర్ణిస్తాడు: ‘అది ఎర్రనిఇటుకల నగరం, పొగా, బూడిదా ఆ ఎర్రదనాన్ని మిగిల్చితే దాంతో పొరలు పొరలుగా పేరుకునివుండే భవనాలు, రోజస్తమానం రణగొణధ్వని, బాగా మదించిన ఏనుగొకటి తన తొండాన్ని బాదుకుంటున్నట్టుగా మొనాటనస్‌గా చప్పుడుచేసే ఆవిరియంత్రపు పిస్టన్, ఆ నగరంలో అందరూ ఒక్కలాగానే ఉండే మనుషులు, పోవడానికీ, రావడానికి అందరికీ ఒకే పనివేళలు, పేవ్మెంట్లు పైన ఒకటే పదధ్వని, చెయ్యవలసినది ఒకటేపని. వాళ్ళకి ప్రతిరోజూ నిన్నలాగానే, రేపటిలాగానే. ప్రతిసంవత్సరం నిరుటిలాగానే, రేపటిలాగానే’.
9
నిరాశ్రయుల నగరం
కొద్దిమందిని సంపన్నులనీ, అత్యధికుల్ని దరిద్రులనీ చేస్తున్న పారిశ్రామిక సమాజంలో సోషలిస్టు, కమ్యూనిస్టు భావజాలం బీజాలు పడటంలో ఆశ్చర్యంలేదు. యుటోపియన్ సోషలిస్టుగా ప్రసిద్ధిచెందిన రాబర్ట్ ఓవెన్ (1771-1858) కొంతకాలం మాంచెస్టర్‌లో పరిశ్రమలు నడిపాడు. పీటర్ డ్రింక్వాటర్ అనే పారిశ్రామిక వేత్త ప్రోత్సాహంతో మాంచెస్టర్‌లో ఒక ఆదర్శ పారిశ్రామిక సమాజాన్ని స్థాపించాడు. సంస్కరణలోనూ, ఉదారంగా వ్యవహరించడంద్వారా, కార్మికుల శ్రేయస్సుని కోరుకోవడం ద్వారా ఫ్యాక్టరీని ఒక ఆదర్శ రాజ్యంగా మార్చగలననుకున్నాడు. ఇంగ్లీషు ప్రజాస్వామ్యాన్ని గణనీయంగా ప్రభావంచేసిన ఛార్టిస్టు ఉద్యమం కూడా ఆ కాలంలోనే వికసించింది. 1838లో మాంచెస్టర్‌లో జరిగిన చార్టిస్టు ప్రదర్శనలో సుమారు మూడులక్షలమంది కార్మికులు పాల్గొన్నారని అంచనా!
ఆనాడు ఛార్టిస్టులు ప్రకటించిన ఆరు డిమాండ్లలో మొదటి అయిదు డిమాండ్లు: సార్వత్రిక ఓటుహక్కు, రహస్యబాలెట్, ఎన్నికకావడానికి ఆస్తి ఒక అర్హత కాకపోవడం, ప్రజాప్రతినిధులకు వేతనాలు, సమాన ప్రాదేశిక నియోజకవర్గాలు అన్నవి సాధ్యం కావడానికి ఇంగ్లాండ్‌కే ఎనభయ్యేళ్ళు పట్టింది.
కాగా పారిశ్రామిక సమాజంలోని వైరుధ్యాల్ని శక్తిమంతంగా బయట పెట్టినవారు మార్క్స్, ఎంగెల్స్. ఇందుకు అవసరమయిన ఎంతో సమాచారాన్ని ఎంగెల్స్ మాంచెస్టర్ నుండే సేకరించుకున్నాడు. 1842లో వ్యాపార నిమిత్తం మాంచెస్టర్ వచ్చిన ఎంగెల్స్ తను చూసిన దాన్నిబట్టి ‘ఇంగ్లాండ్‌లోని శ్రామికవర్గ పరిస్థితి’ (1845) అన్న వ్యాసం రాశాడు. ఈ వ్యాసమే మార్క్స్ ఎంగెల్స్కి సన్నిహితుణ్ణి చేసింది.
ఈ అంశం గురించి లెనిన్ (1895) ఇలా రాశాడు: ‘ఎంగెల్స్ ఇంగ్లీషు పరిశ్రమకి కేంద్రమైన మాంచెస్టర్‌లో 1842లో స్థిరపడి ఇంగ్లాండ్‌లోని కార్మికవర్గం గురించి తెలుసుకోగలిగాడు. ఇక్కడ ఎంగెల్స్ ఫ్యాక్టరీ ఆఫీసులో కూచోడంతో సరిపెట్టుకోక కార్మికులు నివసిస్తున్న వాడలన్నిటినీ తిరిగి వారి దారిద్ర్యాన్ని, దౌర్భాగ్యాన్నీ తన కళ్ళారా చూశాడు. కాని కేవలం తన వ్యక్తిగత పరిశీలనకే కట్టుబడిపోలేదు. బ్రిటిష్ కార్మికవర్గం గురించి తనముందు ఆవిష్కృతమయిన దాన్నంతా ఆయన చదివాడు. తాను పొందగలిగిన ప్రభుత్వపత్రాలన్నింటినీ శ్రద్ధగా అధ్యయనం చేశాడు. ఈ అధ్యయనాల, పరిశీలనల ఫలితంగా 1845లో వచ్చిన పుస్తకమే ‘ఇంగ్లాండ్‌లోని కార్మికవర్గ పరిస్థితి’. ఎంగెల్స్ కు పూర్వంకూడా ఎందరో కార్మికవర్గ బాధల్ని చిత్రించి, కార్మికులకు సహాయం చేయాల్సిన ఆవశ్యకతను వివరించి వున్నారు. అయితే కార్మికవర్గం కేవలం బాధితవర్గం మాత్రమే కాదని మొదటగా చెప్పినవాడు ఎంగెల్సే. యథార్థానికి కార్మికవర్గ దయనీయ ఆర్థికపరిస్థితి దాన్ని అనివార్యంగా ముందుకు నడిపిస్తుందనీ, తన అంతిమ విమోచన గురించి పోరాడేటందుకు పురిగొల్పుతుందనీ ప్రకటించినవాడు అతడే’.
నిజానికి 1845కు పూర్వంగాని తరువాతగాని కార్మికవర్గ దైన్యం గురించిన అంత శక్తిమంతమైన, సత్యవంతమైన చిత్రణ మరేదీ వచ్చిఉండలేదు. కొంతకాలం విరామం తర్వాత ఎంగెల్స్ తిరిగి మాంచెస్టర్‌కి వచ్చి 1870దాకా, అంటే తిరిగి లండన్ వెళ్ళేదాకా పారిశ్రామిక జీవితం గడుపుతుండిపోయాడు.
ఈ కాలంలో ఆయన రెండు జీవితాలు జీవించాడని చెప్తారు. పగలంతా ఒక వ్యాపారస్తుడి జీవితం, రాత్రి భావుకుడి జీవితం. ఈ వ్యాపారంలో తను ఆర్జించింది మార్క్స్ చేత ‘దాస్ కాపిటల్’ గ్రంథం రాయించడం కోసం ఖర్చుపెట్టాడు. ఆవిధంగా మాంచెస్టర్ ఏ పారిశ్రామిక జీవితానికి సర్వోత్కృష్ట కేంద్రంగా వికసించిందో, ఆ సమాజంపైన నిశితమయిన అస్త్రాన్ని ప్రయోగించే ఉద్యమానికి కూడా కేంద్రస్థానమయింది.
నూటయాభయి ఏళ్ళ తర్వాత ఆ నగరాన్ని చూడబోయిన నాకు ఆ నగరం తన ప్రసిద్ధ వైరుధ్యంతో ఎదటపడటంలో ఆశ్చర్యమేముంది. పారిశ్రామిక సమాజ ఆదర్శాలలోని ఈ వైరుధ్యాల్ని ఆ నగరంలోని భావుకులు ఎప్పుడూ బయటపెడుతూనే ఉన్నారు.
‘ది కన్ఫెషన్స్ ఆఫ్ ది ఇంగ్లీష్ ఓపియమ్ ఈటర్’ రాసిన డీక్విన్సీ (1785-1859) 1791-96 దాకా మాంచెస్టర్‌లో ఉన్నాడు. తన సమకాలీనులయిన రొమాంటిసిస్టు కవుల లాగా జీవిత వాస్తవాలనుండి దూరంగా పారిపోలేని నిజాయితీ, ఆత్మవంచన చేసుకోలేని నిర్భీతీ ఆయన రచనల్లో కన్పిస్తాయి.
ఆయన తన ‘కన్ ఫెషన్స్’ ముందుమాటలో తనొకనాడు మాంచెస్టర్ వీథుల్లో పోతున్నప్పుడు కొందరు మిల్లు యజమానులు తమ కార్మికులు నల్లమందుకి అలవాటు పడిపోతున్నారని చెప్పినట్టుగా పేర్కొన్నాడు. అంతేకాదు, వాళ్ళు తక్కిన వ్యసనాలకు కాకుండా నల్లమందుకే బానిసలు కావడానికి వాళ్ళ వేతనాలు తక్కువ కావడమే కారణమని కూడా అన్నాడు.
అత్యధిక సంఖ్యాకులయిన మానవులకి నిజంగా హితం కలిగించే ఏ జీవన విధానాన్నీ పారిశ్రామిక సమాజం ఇంతవరకూ చూపించలేకపోయింది. దాని గర్వం, దాని డంబం దానిలోని యథార్థమయిన డొల్లతనాన్ని ఎల్లకాలం దాచలేవని అనడానికి మాంచెస్టరు వీథుల్లో నేడు తారసపడుతున్న నిరాశ్రయులే తార్కాణం.
ఇంతాచేసి వాళ్ళని చూసి పారిశ్రామిక నాయకత్వం ఏముంటుంది? అది నిరాశ్రయుల్ని పట్టించుకోవాల్సిన వర్గంగా భావించదు సరిగదా, ‘గార్డియన్’ పత్రిక రాసినట్టుగా ‘ఇళ్ళులేని వాళ్ళని ఇళ్ళులేనందుకూ, పనికి నోచుకోని వాళ్ళని పనికి నోచుకోనందుకూ’ నిందిస్తుంది.
10
సంగీతం ఒక భాగం
‘సౌండింగ్ ది సెంచరీ’ పేర బి.బి.సి. రేడియో-3 ఫిబ్రవరి నుండీ ఇరవయ్యో శతాబ్దపు సంగీతం ఒక జాతీయస్థాయి ప్రసారోత్సవం నిర్వహిస్తూవుంది. ఇరవయ్యో శతాబ్దంలో సంగీతం పునరావిష్కృత మయిందనీ, సాంప్రదాయసంగీతంనుండి విడివడి కొత్తకొత్త ప్రయోగాత్మక వైయక్తిక రీతులెన్నింటినో పైకి తెచ్చిందని, ఈ ప్రయోగాత్మకత కంప్యూటర్లు, ఎలక్ట్రానిక్స్ ప్రవేశంతో మరింత వేగవంతమయిందనీ, ఈ ధోరణులన్నిటినీ పర్యావలోకించుకున్నట్లుగా ఉత్సవాన్ని నిర్వహిస్తామనీ బి.బి.సి. వివరించింది. లండన్‌లోని రాయల్ ఫెస్టివల్హాల్లో జరిగే ఉత్సవాల్లో వివిధ సంగీతబృందాలతో ఆర్కెస్ట్రాలు నిర్వహించడం, ఆ కార్యక్రమాల్ని రేడియో ద్వారా లైవ్ బ్రాడ్కాస్ట్ చెయ్యడం ముఖ్య కార్యక్రమాలు.
అటువంటి లైవ్ బ్రాడ్‌కాస్ట్‌లో బి.బి.సి సింఫనీ ఆర్కెస్ట్రా వారి కార్యక్రమం ఒకరోజు విన్నాను. ఆరోజు ఇరవయ్యో శతాబ్దంలోని ప్రముఖ కంపోజర్లలో ఒకడైన ఇగోర్ స్ట్రావిన్స్కీ కృతులు ‘పెర్సిఫోన్’, ‘ఈడిపస్ రెక్స్’ ని వినిపించారు. ఆండ్రూడేవిస్ నిర్వహణలో జరిగిన ఈ ఆర్కెస్ట్రాలో ‘ఈడిపస్ రెక్స్’ నన్ను బాగా ఆకట్టుకుంది.
స్ట్రావిన్స్కీ తన కృతి ఒక గంభీరమయిన క్లాసికల్‌గా రూపొందాలని కోరుకున్నట్టుగా అన్పిస్తుంది. అతడు సోఫోక్లిజ్ రాసిన సర్వశ్రేష్ట గ్రీకు విషాదాంతనాటకం ‘ఈడిపస్ రెక్స్’ ని ఎంచుకోవడంలో ఒక మెలకువ ఉంది. అజరామరమైన కొన్ని సాహిత్యకృతుల్లో అదొకటి. అంతేకాక ఆధునిక పాశ్చాత్య మనఃస్థితిని మొదటినుంచీ ఈడిపిస్ గాథ రహస్యంగానూ, బహిరంగంగానూ కూడా ప్రభావితం చేస్తూఉంది. బలమయిన ఎన్నో మానసిక సంవేదనల్ని జాగృతపరిచే శక్తి ఆ కథలో ఉంది. మనిషిచేతుల్లో ఉన్నదీ, చేతుల్లో లేనిదీ అతని జీవితాన్నీ, భవితవ్యాన్నీ నిర్ణయించడం. మొదట ఆశ్చర్యం, ఆ తరువాత ఆశ్చర్యంనుండి భయం, అప్పుడు భయంనుండి బీభత్సం వైపుగా సాగే కథని తీసుకోవడం ద్వారా అందులో గుప్తంగా ఉన్న స్వరప్రస్తారాన్ని వెలికి తీసినట్లయింది.
కృతి ఆద్యంతం నాటకం వాచకాన్ని లాటిన్లో విన్పిస్తుంటారు. రూపకపాఠాన్ని విన్పించడానికి లాటిన్ని ఎంచుకోవడంలోకూడా ఒకక ప్రత్యేకత ఉంది. ఆ భాషలోని క్లాసికల్ టోన్ గాంభీర్యం, పౌరాతన్యం, ఆధునిక పాశ్చాత్య జీవితంలో అంతర్లీనంగా ప్రవహిస్తున్న దాని ప్రభావం కృతికి ఉదాత్తతని చేకూర్చాయి. పాఠానికీ, పాఠానికీ మధ్యలో భావగమనాన్ని సంకేతపరుస్తూ సంగీత స్వరప్రస్తారం ఉంటుంది. ఇది ఎంత సహజంగా ఉంటుందంటే మనం ఆ సంగీత ప్రస్తారపు ఆరోహణావరోహణలలో పూర్తిగా తాదాత్మ్యం చెందిపోతాం. అంటే మన మానసిక ప్రస్తారాన్ని మనం బయటకు వింటున్నట్టుంటుంది.
ఇటువంటి కృతిని ఆధునిక కర్ణాటకసంగీతంలో ఎవరూ కంపోజ్ చేసినట్టు నాకు గుర్తులేదు. త్యాగరాజస్వామివారి ‘నౌకాచరిత్రాన్ని’ కొంతవరకు దీనితో పోల్చవచ్చు. మనదేశంలో ఫిల్మ్ సంగీతం, ప్రజాసంగీతం తప్ప క్లాసికల్ సంగీతం ఆధునిక రచయితల్నీ, కవుల్నీ ఎక్కువ ప్రభావితుల్ని చేసినట్టు కన్పించదు. క్లాసికల్ సంగీతాన్ని ఇష్టపడటం వేరు, తమ సత్యాన్వేషణలో దాన్ని చేరదీసుకోవడం వేరు. ముఖ్యంగా మన కవులు. ప్రసిద్ధులయిన మన కవులెవ్వరిపైనా శాస్త్రీయసంగీతపు బలమయిన ప్రభావాలేవీ కన్పించవు. కాని పాశ్చాత్య ప్రపంచంలో సంగీతానికి, ఆలోచనాపరులకీ ఉన్న సంబంధం ఘనతరమైంది. నీషే వాగ్నర్ గురించి రాసింది చదువుతుంటే సంగీతానికీ, సంగీతావిష్కరణలకీ వారు ఎటువంటి తాత్త్వికభూమికని ఏర్పరచగలిగారో చూసి ఆశ్చర్యమేస్తుంది.
ఇంగ్లీషు జీవితమంతటా సంగీతానికి విడదీయలేని స్థానముండటం నేను గమనించాను. పూలు పూసినట్టు వికసించే సంగీత కచేరీల్లోనేకాదు, పబ్లిక్ స్థలాల్లో, ట్రాన్స్ పోర్ట్ లో, రెస్టారెంట్లలో కూడా శాస్త్రీయసంగీతం విన్పిస్తుండటం నన్ను ఆశ్చర్యపరిచింది.
8
A Pitiless Sky
Because winter had not yet surrendered its hold, darkness fell early. Shops pulled their shutters by six in the evening. Even in Piccadilly, the city centre, the streets thinned out by seven; except for dining halls, pubs, and theatres, the city stood largely desolate.
Wandering those freezing streets at dusk, I was startled by the mendicants who approached me with: “Gentleman, would you mind sparing a penny?”
There is an immense chasm between begging in India and begging in England. In that bone-chilling cold, in that hyper-privatized country, to be reduced to mendicancy is to embark on a desperate fast unto death under an utterly pitiless sky.
The first time I encountered those beggars on the street, their faces haunted my sleep throughout the night. It deeply disturbed me that at the close of this twentieth century, in the very England that had furnished the world with its paradigm of developmental progress, so many souls should be left destitute and unsheltered. When I mentioned this to our professor, he observed sorrowfully that matters had deteriorated to this point within the last decade, pointing to the economic policies of the state as the culprit.
Yet this is not a crisis to be resolved merely by laying the blame at Margaret Thatcher’s door. The tragedy is embedded within the very marrow of the industrial economic model that England consciously and proudly embraced over the past three centuries. Thatcher held her own convictions, recognizing with cold precision that even a welfare state cannot function without capital. She reportedly remarked that “no-one would remember the Good Samaritan if he’d only had good intentions; he had money as well.” Figures like Gorbachev and Thatcher were simply individuals who stripped away the comforting illusions of their respective systems, exposing their raw mechanisms. Those who condemn them must first reckon with the structural hollows of the systems themselves.
In the prime of its industrialization, Benjamin Disraeli hailed Manchester as a “modern Athens.” In his novel Coningsby (1844), he went so far as to write:
“It is the philosopher alone who can conceive the grandeur of Manchester, and the immensity of its future… What Art was to the ancient world, Science is to the modern: the distinctive faculty. In the minds of men the useful has succeeded to the beautiful… a great city, whose image dwells in the memory of man, is the type of some great idea… It is a place where capital and scientific knowledge have achieved an unprecedented partnership upon the stage assigned to them by Nature.”
Yet not everyone who looked upon Manchester surrendered to such rapture. In 1842, an English traveller visiting the industrial quarters of Lancashire recorded:
“The impression made on my mind by my first view of Manchester… I was looking over a forest of chimneys, from which rolled dense volumes of steam and smoke, which hung like a dark canopy over the entire city, hiding it completely from view.”
A far more scathing indictment emerges in Charles Dickens. In his novel Hard Times (1854), Coketown stands as the archetypal industrial city. He describes it thus:
“It was a town of red brick, or of brick that would have been red if the smoke and ashes had allowed it; but as matters stood, it was a town of machinery and tall chimneys, out of which interminable serpents of smoke trailed themselves for ever and ever… It was a town of machinery and tall chimneys… It had a black canal in it, and a river that ran purple with ill-smelling dye, and vast piles of building full of windows where there was a rattling and a trembling all day long, where the piston of the steam-engine worked monotonously up and down, like the head of an elephant in a state of melancholy madness. It contained several large streets all very like one another, and many small streets still more like one another, inhabited by people equally like one another, who all went in and out at the same hours, with the same sound upon the same pavements, to do the same work, and to whom every day was the same as yesterday and to-morrow, and every year the counterpart of the last and the next.”
9
A City of the Dispossessed
Within an industrial order that enriches the few while plunging the multitude into destitution, it is hardly surprising that the seeds of socialist and communist thought found fertile soil. Robert Owen (1771–1858), celebrated as an early utopian socialist, ran manufacturing mills in Manchester for a time. Encouraged by the industrialist Peter Drinkwater, he established an exemplary industrial community here, believing he could transform the factory into an ideal commonwealth through systematic reform, enlightened management, and a commitment to workers’ welfare.
The Chartist movement, which profoundly altered the trajectory of English democracy, flowered in that very era. It is estimated that nearly three hundred thousand workers assembled at the great Chartist demonstration in Manchester in 1838!
Yet of the six demands put forward in the People’s Charter, it took England more than eighty years to enact the first five: universal male suffrage, the secret ballot, abolition of property qualifications for Members of Parliament, salaries for MPs, and equal constituencies.
The irreconcilable contradictions of industrial society, however, were laid bare with supreme force by Karl Marx and Friedrich Engels. Much of the empirical evidence vital to that critique was gathered by Engels right here in Manchester. Arriving in 1842 on business for his family’s firm, Engels channeled what he witnessed into The Condition of the Working Class in England (1845)—the very treatise that forged his intellectual partnership with Marx.
Assessing that work in 1895, V. I. Lenin observed:
“Engels settled in Manchester, the center of English industry, in 1842, and there came to know the English proletariat. He did not confine himself to a factory office, but wandered through the slums in which the workers were cooped up, and saw their poverty and misery with his own eyes. But he did not confine himself to personal observations. He read all that had been revealed before him on the condition of the British working class and carefully studied all the official documents he could obtain. The result of these studies and observations was the book which appeared in 1845: The Condition of the Working Class in England… Even before Engels, many people had depicted the sufferings of the proletariat and had pointed out the necessity of helping it. Engels was the first to say that the proletariat is not only a suffering class; that it is, in fact, the disgraceful economic condition of the proletariat that drives it irresistibly forward and compels it to fight for its ultimate emancipation.”
In truth, neither before 1845 nor since has there appeared so searing and truthful an account of working-class misery. After an interval, Engels returned to Manchester and remained bound to its industrial life until 1870, when he relocated permanently to London.
During those decades, he lived two lives: by day, an executive in a capitalist enterprise; by night, a revolutionary intellectual. The profits he drew from that commerce were quietly diverted to support Marx through the composition of Das Kapital. Thus, Manchester served not only as the quintessential capital of the industrial order, but also as the crucible that forged the sharpest intellectual weapon turned against it.
Visiting the city a century and a half later, it came as no surprise to find Manchester still wrestling with its defining paradox. The city’s imaginative minds have consistently exposed the inner hypocrisies of industrial ideals. Thomas De Quincey (1785–1859), author of Confessions of an English Opium-Eater, lived in Manchester from 1791 to 1796. Unlike many of his Romantic contemporaries who turned away from harsh social actualities, his prose bears an uncompromising honesty and a refusal of self-deception.
In the introductory notice to his Confessions, he recalled walking through Manchester and hearing cotton-mill masters remark that their workers were contracting the habit of opium-eating. Furthermore, he noted that the meager wages of the workers were directly responsible for driving them to the cheap solace of opium rather than other indulgences:
“…on a Saturday afternoon the counters of the druggists were strewed with pills of one, two, or three grains, in preparation for the known demand of the evening… the work-people of Manchester, and the neighbouring towns, had a great fondness for opium… the low rate of wages had of late months urged them into this habit, as a cheap substitute for spirits.”
Industrial society has yet to devise a mode of life capable of securing true, lasting well-being for the great mass of humanity. The dispossessed wandering the avenues of Manchester today stand as living proof that its vanity and material hubris cannot perpetually mask its hollow core.
And how does the industrial leadership regard them? Far from acknowledging their plight, it blames them for their own dispossession—as a commentator in The Guardian pointedly observed: castigating the homeless for having no homes, and the jobless for having no work.
10
A Fabric of Music
Under the title Sounding the Century, BBC Radio 3 launched a national broadcasting festival surveying the musical landscape of the twentieth century. The BBC announced that the twentieth century had witnessed a radical reinvention of music—shattering traditional forms to usher in diverse experimental and personal idioms, an experimentation accelerated by the arrival of electronics and computers. The festival sought to trace these revolutionary currents, centering on live orchestral broadcasts from venues such as London’s Royal Festival Hall.
I tuned in to one of those live broadcasts by the BBC Symphony Orchestra. That evening was devoted to Igor Stravinsky, one of the titanic composers of the twentieth century, featuring his Perséphone and Oedipus Rex. Conducted by Andrew Davis, it was Oedipus Rex that arrested my attention completely.
Stravinsky seems to have conceived the work as a monument of austere, classical severity. His choice of Sophocles’ supreme tragedy, Oedipus Rex, was a masterstroke. It remains one of the enduring monuments of world literature; moreover, the myth of Oedipus has exerted a profound, subterranean influence upon the modern Western psyche, possessing an extraordinary power to stir deep psychological tremors. It traces the interplay between human will and insurmountable fate. By taking an arc that moves from astonishment to dread, and from dread to existential horror, the composition laid bare the hidden musical architecture within the drama.
Throughout the performance, the text is chanted in Latin. The choice of Latin for the libretto was equally deliberate: the gravitas, antiquity, and monumental cadence of that classical tongue, flowing as a subterranean current beneath modern Western life, lent the work sublime weight. Between spoken narrative passages, the orchestral progressions charted the psychological trajectory of the tragedy. The movement felt so organic that one surrendered completely to the rising and falling tides of the score; it was as though one were hearing the inner tremors of the human mind given outward acoustic form.
I cannot recall any work in modern Carnatic music composed on such a grand conceptual plane, though Tyagaraja Swami’s Nowka Charitramu might be cited as a modest parallel. In our country, with the exception of film scores and folk traditions, classical music seems to have exerted little direct influence upon modern writers and poets. Admiring classical music as an aesthetic diversion is one thing; drawing it into one’s philosophical quest for truth is quite another. Strikingly, one finds little trace of classical music’s architectural discipline in our major poets.
In the Western world, by contrast, the dialogue between musical architecture and philosophical thought is profound. Reading Friedrich Nietzsche on Richard Wagner, one is astonished by the formidable metaphysical foundation they erected beneath musical innovation.
I noticed that music occupies an inseparable place across the whole fabric of English life. It was not merely that concerts blossomed everywhere; what surprised me was hearing classical music drifting through ordinary public spaces—on public transport, in stations, and across modest restaurants.
Featured image: Photography by Božo Gunjajević via pexels.com
15-10-2026


నమస్కారము …..ఇంచుమించుగామనంచదువుకునేరోజులలోదాస్కేపిటల్,డికెన్సురచనలు,మార్క్సు,తదితరులు రచనలు,హిస్టరీఓSUBJECT అవడంవలనచదవగలిగాం..మార్గరేట్ధాచర్,గోర్భచేవ్, గుప్పిడువిప్పితమదేశాలఅసలైనప్రజాస్వామ్యంగూర్చి తెలియచేయడానికిచాలాధైర్యంచేయడానికిఎంతమనపడ్డారో……ఈడిపస్రెక్సు…(రెండూ)నాకు చాలా నచ్చింది.మీఈప్రయాణంమరికొంతచరిత్రసూక్ష్మంగాతెలియచేసినందుకుధన్యవాదములు.
ధన్యవాదాలు మాస్టారూ!
మనిషిచేతుల్లో ఉన్నదీ, చేతుల్లో లేనిదీ అతని జీవితాన్నీ, భవితవ్యాన్నీ నిర్ణయించడం.