నా ఇంగ్లాండ్ యాత్ర-10

ఈ అంశంలోకూడా బ్రిటన్‌కీ ఇండియాకీ చాలా దగ్గర పోలిక వుంది. ఇండియాలో ఒక హంతకుడికన్నా కూడా ఒక లంచగొండిని ఎక్కువ నేరస్థుడిగా ప్రజామనస్తత్వం భావిస్తుంటుంది. రాజకీయపార్టీలు హంతకులకు కూడా ఎన్నికల టిక్కెట్లు ఇవ్వగలవుగాని హవాలా కుంభకోణంతో సంబంధమున్నవారికి టిక్కెట్లు ఇవ్వడానికి సాహసించలేవు. భారతీయ సమాజంలో అధికారం డబ్బు సంపాదించే మార్గం కాగా, బ్రిటిష్ జీవితంలో అది నిర్లజ్జగా జీవిత సుఖాల్ని పొందడానికి మార్గం.

నా ఇంగ్లాండ్ యాత్ర-9

లండన్! నీకు నా నమస్కారం. నువ్వు నీ అధికార దర్పాన్ని చూపినప్పుడు మా మనిషి ఒకడు కొల్లాయిగుడ్డతో, రాట్నంతో, కబీరోదోహాతో దాన్ని ఎదిరించాడు. ఇప్పుడు నేను స్వతంత్ర దేశ పౌరుడిగా, భావుకుడిగా, కవిగా నీదగ్గరికి వచ్చాను. నిన్ను చూశాను, ముగ్ధుణ్ణయ్యాను. నీ పావురాలకి గింజలు చల్లిన వాళ్లలో నేనూ ఉన్నాను. సెలవు.