రెడ్డి రాఘవయ్య చివరి పుస్తకం

రెడ్డి రాఘవయ్య (1940-2022) తెలుగులో బాలసాహిత్యవేత్తల్లో అగ్రశ్రేణి రచయిత, సంపాదకుడు, పరిశోధకుడు. ఆయన చివరి పుస్తకం కూడా ప్రసిద్ధ బాలసాహిత్యకారుల గురించి రాసిందే. వారి అమ్మాయి ఆ పుస్తకం నాకు పంపి ముందుమాట రాయమని అడగడం నా భాగ్యం. ఇవాళే ఆ పుస్తకాలు అందుకున్నాను. అందులో నేను రాసిన ముందుమాట మీ కోసం.

డా.కొత్తకోట శ్రీనివాసరావు

కొత్తకోట శ్రీనివాసరావు శ్రీకాకుళానికి చెందిన యువకుడు. ఆంధ్రవిశ్వవిద్యాలయం నుంచి తెలుగు సాహిత్యంలో ఎమ్మే చేసారు. మూడేళ్ళ కిందట ఆయన నాకు ఫోన్ చేసి నా కథల మీద డాక్టరల్ పరిశోధన చేస్తున్నట్టుగా చెప్పారు.

నేలకొండపల్లి-3

నేలకొండపల్లి వెళ్ళి వచ్చినప్పటినుంచీ ఈ వారం రోజులూ నా ఆలోచనల్లో రామదాసే ఉన్నాడు. రామదాసు కీర్తనల్లో ప్రధానమైంది ఆర్తి. అది ఆయన జైల్లో ఉండగా రాసిన పాటల్లో మరీ మరీ వినిపిస్తుంది. కాని అంతకన్నా ముందటి పాటల్లో ఉండేది ఉత్సాహం.