ప్రత్యూష పవనాలు చిన్న పుస్తకం. కొందరు మహాత్ముల రచనలనుంచి ఏరి కూర్చిన కొన్ని వాక్యాలు. 1996 లో వెలువరించిన ఈ పుస్తకం ఇప్పుడు ఎక్కడా లభ్యంగా లేదు. కొత్తగూడెం కి చెందిన కిరణ్ గారి పుణ్యమా అని అప్పటి పుస్తకం పిడిఎఫ్ ఒకటి దొరికింది. దాన్ని ఇలా లే ఔట్ మార్చి రెండో ముద్రణగా మీతో పంచుకుంటున్నాను. మంచిమనిషి వెలమూరి శ్రీరాం స్మృతికి ఈ పుస్తకం అంకితమిస్తున్నాను.
అవధూత గీత
కిందటి అక్టోబరు-నవంబరు నెలల్లో అవధూత గీతకు నా తెలుగు అనువాదాన్నీ, ఆ గీతను ఉపదేశించిన దత్తాత్రేయుల దర్శనం పైన కొన్ని ఆలోచనల్నీ మీతో పంచుకున్నాను. ఇప్పుడు ఆ అనువాదాన్ని ఈ మహాశివరాత్రి పర్వదినం నాడు ఇలా పుస్తక రూపంలో మీతో పంచుకుంటున్నాను. ఈ అనువాదాన్ని గాణ్గాపురంలోని శ్రీ నృసింహ సరస్వతీ స్వామివారి నిర్గుణపాదుకలముందు సమర్పిస్తున్నాను. ఇది నా 57 వ పుస్తకం.
ప్రేమగోష్ఠి
ఈ 'ప్రేమగోష్ఠి' నా 52 వ పుస్తకం. ఈ రోజు హైదరాబాద్ బుక్ ఫెయిర్ మొదలవుతున్న సందర్భంగా ఆ అనువాదాన్నిలా ఇ-బుక్ గా మీతో పంచుకుంటున్నాను. ఇందులో ఆ సంభాషణ నేపథ్యాన్ని, తాత్త్విక ప్రాసంగికతని వివరిస్తూ నేను రాసిన ఒక సుదీర్ఘ పరిచయ వ్యాసం కూడా ఉంది. దీన్ని మిత్రులు కల్యాణి నీలారంభంగారికి అంకితమిస్తున్నాను. ఆమె తానున్నచోటునే ఒక ఏథెన్సుగా మార్చగల విద్వన్మణి.
