ప్రత్యూష పవనాలు చిన్న పుస్తకం. కొందరు మహాత్ముల రచనలనుంచి ఏరి కూర్చిన కొన్ని వాక్యాలు. 1996 లో వెలువరించిన ఈ పుస్తకం ఇప్పుడు ఎక్కడా లభ్యంగా లేదు. కొత్తగూడెం కి చెందిన కిరణ్ గారి పుణ్యమా అని అప్పటి పుస్తకం పిడిఎఫ్ ఒకటి దొరికింది. దాన్ని ఇలా లే ఔట్ మార్చి రెండో ముద్రణగా మీతో పంచుకుంటున్నాను. మంచిమనిషి వెలమూరి శ్రీరాం స్మృతికి ఈ పుస్తకం అంకితమిస్తున్నాను.
‘ప్రియమైన శాఫో’
ఏమైతేనేం, ఈ నడివేసవి, మండుటెండల మధ్య ఆమె కవిత్వసముద్రంలో ఈదులాడుతూ, ఆమెకి ఉత్తరాలు రాస్తూ ఆ ఉత్తరాల కాపీలు మీతో పంచుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఆ ఉత్తరాల్ని శ్రీపాద లిటరరీ వర్క్స్ వారు పుస్తకంగా పబ్లిష్ చేసారు.
మొదటి పని గంట
ఈ కథాస్రవంతి శీర్షిక నడుపుతున్న పప్పు భోగారావుగారు కమర్షియల్ టాక్స్ డిపార్ట్ మెంట్లో ఉన్నతాధికారిగా పనిచేసి రిటైర్ అయిన వ్యక్తి. నీతిపరుడైన అధికారి. బహుశా అందువల్లనే ఈ కథ ఆయన్ని ఆకర్షించి ఉండవచ్చు. మీరు కూడా వింటారని ఆ లింకు ఇక్కడ పొందుపరుస్తున్నాను.
