రెల్లు పూసే కాలం

కానీ 1948 లోనే ఒక తెలుగు పండితుడు ఒక ప్రాకృత కావ్యం గురించి రాస్తూ ఒక పాచీన చీనా కవిత్వ సంకలనాన్ని తలుచుకోవడంలోని మహత్వం ఎంత గొప్పదో ఎలా చెప్పగలను? అంతేకాదు, ఆయన సప్తశతి గురించి రాస్తూ పారశీక కవిత్వాన్ని తలుచుకున్నాడు. కువలయమాలని తలుచుకున్నాడు. ఇటువంటి రసజ్ఞులు కదా కవిత్వాన్ని బతికించేది! 

సముద్రమంత కవి

శ్రీ శ్రీ జీవితం పొడుగునా ఒక మహాసముద్రం రహస్యంగా ఆయనలో ఘూర్ణిల్లుతూనే ఉంది. లేదా ఒక మహాసముద్రంలో ఆయన ఈదుతూనే ఉన్నాడు. 'శిశువు చిత్రనిద్రలో ప్రాచీన స్మృతులూచే చప్పుడు' ఆయన ఆ సముద్రతరంగాల్లోనే విన్నాడు.

నన్ను వెన్నాడే కథలు-16

ఒక చారిత్రిక సంఘటనని కథగా రాయాలంటే ఈ కథ ఒక నమూనా అని నాకు గుర్తుండిపోయింది. ఇప్పుడు నలభయ్యేళ్ళ తర్వాత, బంగారు రామాచారి పుణ్యమా అని, '23 హిందీ కథలు' మళ్ళా నా చేతుల్లోకి వచ్చాక, మళ్ళా ఈ కథ చదివాను. సందేహం లేదు, ఇది మణిపూస.