కిందటి ఏడు నా కవితాసంపుటి 'కోమల నిషాదం' వెలువరించినప్పటినుంచీ ఇప్పటిదాకా రాసిన 62 కవితల్తో ఈ 'జ్యోతిర్మయ రోదసి' వెలువరిస్తున్నాను. ఇది నా తొమ్మిదవ కవితాసంపుటి. 77వ పుస్తకం. ఈ పుస్తకాన్నిక్కడ డౌనులోడు చేసుకోవచ్చు. పుస్తకప్రేమికులు, ఆత్మీయులు కొప్పరపు లక్ష్మీనరసింహారావుగారికి దీన్ని కానుక చేస్తున్నాను.
వేపపూల తీపిగాలి
అందుకని 64 కవితలు ఎంచి ఇమ్మని మానస చామర్తిని అడిగారు. ఆమె నేను ఇంతదాకా వెలువరించిన 8 సంపుటాల్లోంచీ, ఈ ఏడాది పొడుగునా నా బ్లాగులో రాస్తూ వచ్చిన కవితల్లోంచీ 64 కవితలు ఎంపికచేసారు. వాటిని ఆమే, అనల్ప బలరాం గారూ ఇద్దరూ కలిసి ఇలా 'వేపపూల తీపిగాలి' పేరిట ఈ రోజు విడుదల చేసారు.
కోమలనిషాదం
ఈ 42 కవితల్నీ ఇలా 'కోమలనిషాదం, మరికొన్ని కవితలు' పేరిట ఒక సంపుటంగా కూర్చి సంక్రాంతి కానుకగా మీతో పంచుకుంటున్నాను. ఇది నా 54 వ పుస్తకం. ఈ పూలగుత్తిని పెద్దలు నాగరాజు రామస్వామిగారికి కానుక చేస్తున్నాను.
