కాని కవిత్వం ఒక దీపం వెలిగించడం లాంటిది. ఒకసారి ఒక కాంతికిరణం ఈ లోకంలో ప్రభవించాక అగణ్య కాంతిసంవత్సరాల పాటు అదట్లా ప్రయాణిస్తోనే ఉంటుంది. ఎక్కడో, ఎవరో ఒక పాఠకుడు దాన్ని పట్టుకునేదాకా. అటువంటి సహృదయుడు ఉండితీరతాడన్న నమ్మకం ఉండబట్టే భవభూతి 'పృథ్వి విశాలం, కాలం అనంతం' అన్నాడు.
నిర్వికల్ప సంగీతం
ఇంకా ఇలానే చాలామంది ఆ రోజుల్లో నేను అభిమానించే, ఆరాధించే కవులు సంజీవ దేవ్, ఇస్మాయిల్, త్రిపుర, మో లాంటివాళ్ళు ఆ పుస్తకాన్ని ప్రేమగా తమ హృదయాలకు హత్తుకున్నారు.
కొండ కింద పల్లె
కొండ కింద పల్లె నా కవిత్వ సంపుటాల్లో ఏడవది. కరోనా కాలంవల్ల పుస్తకావిష్కరణ సభ అంటూ పెట్టలేదు. నా కవిత్వాన్ని ఇష్టపడే వాసుకి ఈ పుస్తకం కానుక చేసాను. ఆయన దీన్ని వెంటనే చదివి ఆనందంగా పలవరిస్తూ తన వాల్ మీద ఆవిష్కరించేడు.
