ప్రియమైన శాఫో-16

ఆమెని రష్యాలో నీతో పోలుస్తారట. Russian Sappho. ఒక్క కవిత్వంలోనే కాదు, జీవితంలో కూడా ఆమెకీ నీకూ చాలా పోలికలున్నాయి. నువ్వూ ప్రవాసివే, ఆమె కూడా ప్రవాసినే. కాని ఆమె తన స్వదేశంలోనే ప్రవాసి. ఆ మాటకొస్తే ప్రవాసి కాని కవి ఎవరు?

ప్రియమైన శాఫో-15

శాఫో, నువ్వు నీ రెండు వాక్యాల్లో రాసిన నలుగులాట మొత్తం ఒక ప్రేమికురాలు తనకై తాను విస్తరించి రాసుకుంటే, అది రేవతీదేవి రాసుకున్న 'అనురాగ దగ్ధ సమాధి' కవిత అవుతుంది. పెద్ద కవిత, కాని ఆ కవిత మొత్తం నీతో పంచుకోకుండా ఉండలేకపోతున్నాను. ఆమె ఇప్పుడు స్వర్గంలోనే ఉండి ఉంటుంది. నువ్వు కబురు చేస్తే తప్పకుండా వచ్చి తనే నీకీ కవిత చదివి వినిపిస్తుంది.

ప్రియమైన శాఫో-14

ఒక్క వాక్యం శాఫో- ఈ ఒక్క వాక్యంతో నువ్వు నేనింతదాకా చదివిన మహనీయ సాహిత్య కృతులన్నిటికీ హారతి పట్టి చూపిస్తున్నావు. ఆ వెలుగులో  ఆ కావ్యాల్నే  కాదు, నీ మంగళమయ వదనాన్ని కూడా చూడగలుగుతున్నాను శాఫో!