మహాత్ముణ్ణి చూసిన క్షణాలు-7

ఆ పాదయాత్ర సాగుతున్న సమయంలో బాపూజీ నన్నొకసారి గట్టిగా మందలించారు. ఆ కోపంలో కూడా నా పట్ల ఎంతో ప్రేమ కనిపించింది. అది కూడా ఆశీస్సులతో సమానమేనని అనిపించింది. పైగా వార్తల్ని రాయడంలో విచక్షణ ఎంత కీలకమో ఆ సంఘటన నాకు నేర్పింది.