మహాత్ముణ్ణి చూసిన క్షణాలు-4

గాంధీజీ ఏదో ఒక రోజు విదేశీ పాలకుల్ని తరిమికొడతారన్న నమ్మకం మాలో కూడా బలపడటంతో, నేనూ సుదర్శనూ ఆ నదీతీరం నుంచి దోసిళ్ళతో ఇసుక తెచ్చి ఆశ్రమం ముందు చల్లాం. గాంధీజీ, కస్తూర్బాలు నడిచిన ఆ పవిత్రమైన ఇసుకను ఒక పెన్నిధిలా మేమేంటో కాలం పాటు దాచుకున్నాం.