మహాత్ముణ్ణి చూసిన క్షణాలు-12

ఇంగ్లీషులో ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’ అనే మాటొకటుంది. అంటే తొలిచూపులోనే ప్రేమ అన్న మాట. సరిగ్గా ఆ క్షణంలో జరిగిందదే. రెండే రెండు మాటలు, ఒక చిరునవ్వు—మేమిద్దరం యుగయుగాలుగా ఒకరికొకరం తెలిసినట్టే అనిపించింది; గాంధీ మా ప్రియనేస్తమూ, మా అత్యంత ఆప్తుడూ, అమూల్య స్నేహితుడూ అయిపోయారు.