నా ఇంగ్లాండ్ యాత్ర-12

19

ఏది అసలైన ఇంగ్లీష్?

మాంచెస్టర్‌లోగాని, లండన్‌లోగాని ఇంగ్లీషు ఉచ్చారణ గురించి, భాషని వినియోగిస్తున్న పద్ధతి గురించి కొంత చర్చించాలి. అక్కడ ఇంగ్లీషు ఉచ్చారణ దాని నియమాల వల్లకాక దాని సారళ్యంవల్ల ఎంతో ఆకర్షణీయంగా అన్పించింది. ఇంగ్లీషు ఉచ్చారణ పట్ల ఏర్పడ్డ నియమాలు వాటి కులీన స్వభావంతో కృత్రిమ ఆధిపత్యభావనని ప్రేరేపిస్తాయని ఎన్నో ఏళ్ళ కిందటే బెర్నార్డ్ షా స్పష్టంగా ఎత్తిచూపాడు. షా ‘పిగ్మాలియన్’, భాషలోని అధికారిక నిర్మాణాల పైన సజీవవ్యాఖ్య. తన చురుకైన చమత్కారంతో సజీవవ్యవహారంగా ఉండవలసిన భాషని నిర్జీవనిర్మాణంగా మార్చి దాని ద్వారా ఆధికారికహోదాని పొందే వ్యవస్థని షా ఎంతో నేర్పుగా ఆవిష్కరించాడు.

కాగా కలోనియల్ సమాజాల్లో ముఖ్యంగా ఇండియాలాంటి ఇంగ్లీష్ కాలనీల్లో ఈ దురభిప్రాయం ఇంకా పోనేలేదు. మన కాన్వెంట్లు, మన సెకండరీ స్కూళ్ళు, మన ఇంగ్లీషు ఉపాధ్యాయులు, గ్రామర్ పుస్తకాలు, ఇంగ్లీష్ లాంగ్వేజి సెల్ఫ్ లెర్నింగ్ మాడ్యూల్స్ ఇంగ్లీషుని ఇంకా కృత్రిమభాషగానే నేర్పే ప్రయత్నం చేస్తున్నాయి. ఇలా నేర్చుకున్న ఇంగ్లీషు మాట్లాడితే అది ఇంగ్లాండ్‌లో ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో నేను గమనించాను. ముఖ్యంగా అమెరికన్ యువతరం, మూడవప్రపంచం నుండి వచ్చిన విద్యార్థులూ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంగ్లీష్‌ని ఇంగ్లీషు దేశపు భాషగా కాక ప్రపంచభాషగా మార్చేస్తున్నాయి. ఈ భాషలో కమ్యూనికేషన్ ప్రధానలక్షణం మెసేజ్ ట్రాన్స్‌ మిషన్ మాత్రమే, ఉచ్చారణ, గ్రామర్ అప్రధాన అంశాలు. ఇది ఎటువంటి స్థితికి చేరుకుందంటే ఇతరదేశస్థులు మాటాడే పద్ధతే నిజమయిన ఉచ్చారణ అనీ, తమ ఉచ్చారణే సరైంది కాదేమోననీ ఇంగ్లీషువారే అనుకునేట్టుగా ఉంది.

ఇంగ్లీషుపదాల్లో కొన్ని అక్షరాలు సైలెంట్‌గా ఉచ్చరించబడాలని మనకి పాఠశాలల్లో నేర్పినదానికీ ఇంగ్లాండ్‌లో విన్పిస్తున్న ఉచ్చారణకీ ఉన్నతేడా నన్ను ఆశ్చర్య పరిచింది. ‘వెడ్నస్ డే ‘ని ‘వెన్స్డే’ అనీ, ‘ఆఫెన్’ ని ‘ఆఫ్టెన్’ అని పిల్లలు ఉచ్చరిస్తే మన కాన్వెంట్‌లో ఏ ఇంగ్లీష్ ఉపాధ్యాయినీ క్షమించదు, కాని ఇంగ్లాండ్ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. షా నేడు ‘పిగ్మాలియన్’ నాటకం రాయవలసి వస్తే రాజకుటుంబపు యువతి మార్కెట్ వీథుల భాషని మాట్లాడవలసి రావడాన్నే చిత్రించవలసి వుంటుంది. ఒక్క భాష విషయంలోనే కాదు, టేబుల్‌మానర్స్ వంటి ఇతర అలవాట్లు అన్నిటిలోనూ ఇంగ్లీష్ అరిస్టోక్రసీ అంతరించిపోతున్న కాలం ఇది.

‘ఒక ఇంగ్లీషువాడు తాను మాట్లాడటానికి నోరు తెరవగానే, మరొక ఇంగ్లీషువాడి ఏవగింపుకి గురికాకుండా వుండలేడు’ అని షా తన ‘పిగ్మాలియన్’ ముందుమాటలో రాస్తాడు. కాని ఈనాడు పరిస్థితి వేరు. ఒకదానికొకటి పొంతనలేని వివిధ ఉచ్చారణాపద్ధతుల మధ్య ఎవరికివారు తమకి అలవాటైన కొన్ని ఇంగ్లీషుపదాల్ని గుర్తు పట్టి కమ్యూనికేషన్ మెసేజిస్‌ని అందుకునే సంభాషణా వ్యవహారమే నాకు ఇంగ్లాండ్‌లో కనబడింది. ప్రపంచం చేరువవుతున్నపుడు భాషలు తమ సమస్తవైభవాలతోటీ మరణించి కొత్త భాషలుగా పునర్జన్మించడం తప్పనిసరి. ఈ క్రమంలో వెనుకబడేదల్లా మన దేశంలోని ఇంగ్లీషు ఉపాధ్యాయులూ, టెక్స్ట్ బుక్ రైటర్సూ మాత్రమే.

20

గ్రీన్ రూమ్

విట్‌వర్త్ వీథిలో పశ్చిమం వైపు ఉన్న ‘గ్రీన్‌రూమ్’ ప్రయోగాత్మక నాటకానికి లాబరేటరీ లాంటిది. నిత్యం కొత్త కొత్త ప్రయోగాల్తో కూడిన రూపకాలు అక్కడ ప్రదర్శింపబడుతుంటాయి. అసలు రూపకాలకి ఇప్పుడు ఇంగ్లాండ్ అంతటా గొప్ప తరుణం. ‘నేడు బ్రిటన్‌లో రూపకాలు టమోటాల్లా పండుతున్నాయి’ అని ఒక పత్రిక రాసింది. ఇటువంటి ప్రయోగాత్మక ప్రదర్శనల్లో యాక్టర్స్ టూరింగ్ కంపెనీ వారి ‘ఫౌస్ట్’ చూసాను ఒకరోజు. ఈ ఫౌస్ట్ నాలుగవతరం ఫౌస్ట్. మొదటి మూడుతరాల ఫౌస్ట్ల గురించీ హారీ రెడ్నర్ అనే ఒక విమర్శకుడు ‘ఇన్ ద బిగినింగ్ వజ్ ద డీడ్’ అన్న వ్యాసంలో వివరిస్తూ ప్రతీ తరంలోనూ లేదా ప్రతీ యుగంలోనూ ఆ యుగానికి చెందిన ‘డెవిల్’ లేవనెత్తే సమస్యకి ప్రతిస్పందిస్తూ ఏ యుగానికా యుగానికొక కొత్త ఫౌస్ట్ రూపొందుతాడని రాస్తాడు.

మొదటి ఫౌస్ట్: క్రిస్టఫర్ మార్లో డాక్టర్ ఫాస్టస్ నాటకంలో చిత్రించిన ఫౌస్ట్. అతడు రినైజాన్స్ కాలంనాటి మానవుడు. జ్ఞానంకోసం, అధికారంకోసం, సుఖమయజీవితం కోసం పడిన తపనకి ప్రతినిధి. వీటిని నిరోధించే మతసూత్రాలనుండి, విశ్వాసాలనుండి విముక్తిని ఒక్క సాతాన్ మాత్రమే ఇవ్వగలడని నమ్మినవాడు.

రెండవ ఫౌస్ట్: జగత్ప్రసిద్ధిచెందిన గొథె ‘ఫౌస్ట్’ నాటకంలోని కథానాయకుడు. ఇతడు ఎన్‌లైటెన్‌మెంట్ యుగానికి చెందిన మానవుడు. రినైజాన్స్ మానవుడు కోరుకున్న జ్ఞానం, అధికారం, సుఖమయ జీవితం ఈ మానవుడు రుచిచూసాడు. అయినా జీవితానందం ఇతనికి చిక్కలేదు. అటువంటిదాని రహస్యమేదో తనకి తెలుసునని మెఫిస్టోఫిలిస్ అతన్ని నమ్మించే ప్రయత్నం చేస్తాడు. అతని మాటల్ని నమ్మడానికీ నమ్మకపోవడానికీ మధ్య ఫౌస్ట్ వూగిసలాడుతాడు.

మూడవ ఫౌస్ట్: థామస్ మన్ ‘డాక్టర్ ఫాస్టస్’ నవలలోని నాయకుడు. ప్రపంచయుద్ధాల కాలంనాటి మానవుడు. రినైజాన్స్ నుండి తన కాలం వరకూ మానవాభ్యుదయం గురించి ప్రస్తుతించబడ్డ ఆదర్శాల డొల్లతనం పట్ల ఎరుక కలిగిన మానవుడు. కాని తన కాలంతోటే మానవపురోగతి చరమాంకం ముగిసిపోగలదని థామస్ మన్ నమ్మలేకపోయాడు. ఎంత చెప్పినా మన్ ప్రధానంగా క్లాసిసిస్టు. రినైజాన్స్ మానవుడి గుప్త అవశేషం ఇంకా అతనిలో బలంగా ఉంది. ఎంత కాదన్నా అతను ఆధునికమానవుడే.

ఈ నాల్గవ తరం ఫౌస్ట్: అత్యాధునికప్రపంచపు మానవుడు. ఇతడు రినైజాన్స్ నుండి ప్రపంచయుద్ధాల వరకూ జీవించిన మానవుడి ఆలోచన ‘యూరోసెంట్రిక్ మేల్ థింకింగ్’ మటుకేనని గ్రహించిన వాడు. ఈ థింకింగ్ ప్రపంచమంతటా స్త్రీలనీ, నల్లజాతుల్నీ, హోమో సెక్సువల్స్‌నీ, మొత్తం మూడవప్రపంచమంతటినీ అణచివెయ్యడానికే పనికొచ్చిందని తెలుసుకున్నవాడు. వెయ్యేళ్ళయాత్ర తరువాత నేడు తత్త్వశాస్త్ర పరమార్ధమే ప్రశ్నకు గురవుతున్నది. ఇప్పుడు ప్రపంచం గురించిన బృహన్నిర్మాణాలు నిర్మించడంలో తత్త్వశాస్త్రానికి ఆసక్తిలేదు. అది చిన్న చిన్న సమూహాల్లో, జాతుల్లో, తెగల్లో నిర్ధారితం కాగల స్థానికపరిజ్ఞానాల గురించీ, వ్యక్తిగత నైతికప్రవర్తనల గురించీ అన్వేషిస్తోంది.

ఈ నేపథ్యంలో బ్రిస్టల్ యూనివర్శిటీ విద్యార్థి అయిన మార్క్ రావెన్‌హిల్ పోస్ట్‌ మాడర్నిస్ట్ సత్యాన్వేషి అయిన ఫూకో (1926-84) జీవితం ఆధారంగా రచించిన రూపకమే ‘ఫౌస్ట్’. దీనికి ముందు రావెన్‌హిల్ ‘షాపింగ్ అండ్ ఫకింగ్’ అనే రూపకంతో ప్రసిద్ధి చెందాడు. ‘షాక్ థియేటర్’గా పేరొందిన శైలిలో రావెన్‌హిల్ రూపకాలు ఒళ్ళంతా తిమ్మిరెక్కించి, కడుపులో దేవినట్టయి వాంతి చేసుకునే లాంటి సంవేదనని కలిగిస్తాయి. సామాజికజీవితంలోని సిక్‌నెస్‌ని, మార్బిడిటీని యథాతథంగా ప్రేక్షకులకు కమ్యూనికేట్ చెయ్యడానికి అతను రంగస్థలాన్ని వినియోగించుకునే తీరు ఎంతో దుస్సాహసికంగా వుంటుంది. అతని మొదటి రూపకాన్ని చూసి ఒక బ్రిటిష్ విమర్శకుడు అతన్ని ప్రాసిక్యూట్ చెయ్యాలని గోలపెట్టాడట!

‘ఫౌస్ట్’ రూపకం మొదటిదానితో పోలిస్తే తీవ్రంగా లేదని పత్రికలు రాసినప్పటికీ నావంటి ఇండియన్ ప్రేక్షకుడికి అది ఎంతో తీవ్రాతితీవ్రంగా అన్పించింది. డెవిల్ ఒక యువకుడితో రంగస్థలంపైనే స్వలింగసంపర్కానికి పూనుకున్న దృశ్యాన్ని యథాతథంగా చూపించడం మన రంగస్థలాలు కలలోకూడా వూహించలేని విషయం. ఆ సమాజం అంత సిక్ గా  ఉన్నదని మనం దుఃఖపడాలో, అటువంటి సమాజంలో కళాకారుడు ఆ సిక్‌నెస్‌ని అంత ఫ్రాంక్‌గా చూపించగలుగుతున్నాడని గర్వపడాలో మనకి అర్థం కాదు. ప్రదర్శన జరుగుతున్నంతసేపూ మనం కళ్ళతోకాక మన పేగుల్తో, లివర్‌తో, గాల్ బ్లాడర్‌తో ఆ ప్రదర్శనని చూస్తున్నట్టుంటుంది. హైదరాబాద్‌లో సుదీర్ఘమైన పనిదినం ముగిసాక సిటీబస్సులు పట్టుకుని దిల్ సుఖ్‌నగర్ లేదా కూకట్‌పల్లి ప్రయాణం చేసే గుమాస్తాలు ఎటువంటి నాసియాకు లోనవుతారో అటువంటి వికారమే ఆ ప్రదర్శన మనలో రేకెత్తిస్తుంది.

మనం సృష్టించుకునే ఆర్థికవ్యవస్థని బట్టి మనం మారతాం, ఈ మార్పు మన ఐడెంటిటీని కూడా మార్చి తీరుతుంది అని రాసాడు మార్క్ రావెన్‌హిల్. థాచరైట్ ఆర్థిక వ్యవస్థలో మార్పుకి లోనవుతున్న బ్రిటిష్ యువకుడి కొత్త ఐడెంటిటీని ఈ రూపకంలో చూస్తాం. క్రిస్టఫర్ మార్లో నాటి జ్ఞానపిపాసువైన బ్రిటిషు యువకుడికీ, ఈనాటి సెల్ఫిష్ కెరీరిస్ట్ అయిన బ్రిటిషు యువకుడికీ మధ్య సాగిన చరిత్ర మనల్ని దుఃఖపూరితుల్ని చేస్తుంది. మానవాదర్శం గురించిన మన ఆశయాల డొల్లతనం, వాగాడంబరం మనల్ని నిస్సహాయులుగా వదిలిపెట్టేస్తాయి. అయినప్పటికీ బ్రిటిష్ కళాకారుడు తన కళాత్మక సత్యసంధతవల్ల అజేయుడిగా, ఆరాధనీయుడిగా కన్పడ్డాడు నాకు. మన దేశంలో మన సిక్‌నెస్ ఎటువంటిదో మనకి తెలీదు, కాని ఏ పబ్లిక్ ప్లాట్‌ఫాం పైన కూడా దాన్ని నిస్సిగ్గుగా ఆవిష్కరించడాన్ని మనం క్షమించలేం. కాని ‘గ్రీన్ రూమ్’లో ‘ఫౌస్ట్’ రూపక ప్రదర్శనకి ప్రేక్షకులు ఎక్కువసంఖ్యలో రావడమే కాకుండా దాన్ని చివరిదాకా ఎంతో మెప్పుకోలుగా చూసారు కూడా. తన లోపాల గురించి తనకుగల ఈ జాగృతిలోనే ఐరోపీయమానవుడి నిజమైన విజయం ఉందనిపించింది నాకు.


19

What is Authentic English?

Whether in Manchester or in London, the prevailing pronunciation of English and the manner in which the language is deployed demand close reflection. What struck me about spoken English there was not its adherence to rigid prescriptions, but its natural, uninhibited simplicity.

Decades ago, George Bernard Shaw pointed out that conventional standards of English pronunciation, burdened by aristocratic pretensions, serve primarily to foster an artificial sense of class superiority. Shaw’s Pygmalion stands as a living satire upon the authoritarian hierarchies embedded within speech. With sparkling wit, Shaw exposed a class system that reduced language—which ought to remain a living, breathing idiom of human intercourse—into a fossilized instrument designed to confer social pedigree.

Yet in post-colonial societies, and across formerly colonized lands like India in particular, this Victorian prejudice refuses to die. Our convent academies, our secondary schools, our English tutors, our grammar texts, and our self-instruction manuals continue to teach English as a rigid, artificial contrivance.

I realized how laughable it sounds in England when someone speaks this stilted, bookish English. A younger American generation, students arriving from the Third World, and the imperatives of information technology are rapidly transforming English from the exclusive preserve of an insular nation into a truly global vernacular. Within this global idiom, the paramount function of communication is simply the transmission of the message; pedantic pronunciation and grammatical rigidity have been relegated to the margins. Matters have reached such a pass that the English themselves often begin to wonder whether the effortless speech of non-native speakers is the more authentic currency, and their own received forms archaic.

I was amused by the gulf separating the classroom rules drummed into us—about which letters must remain rigorously silent—from the living speech heard across England. If an Indian child pronounces “Wednesday” as Wed-nes-day or sounds the “t” in “often” (of-ten), no convent schoolmistress will let it pass unpunished; yet across England, one encounters these very inflections in everyday speech without second thought.

Were Shaw called upon to write Pygmalion today, he would find himself depicting a young lady of the royal household compelled to master the raw, vibrant patois of the street markets. It is not merely in speech, but across dining etiquette and social habits that the old English aristocracy is undergoing irreversible extinction.

In his preface to Pygmalion, Shaw famously observed:

“It is impossible for an Englishman to open his mouth without making some other Englishman hate or despise him.”

Today, the reality is entirely different. Amidst a cacophony of divergent, mutually inconsistent accents, what I observed across England was a practical linguistic exchange where individuals simply pick out familiar key terms to grasp the communicative intent. As the world draws closer together, languages must surrender their insular orthodoxies and undergo rebirth into fresh, living vernaculars.

In this unstoppable evolution, the only casualties left behind are the rigid English schoolmasters and textbook grammarians of our own land.

20

The Green Room

Situated on the western stretch of Whitworth Street, The Green Room serves as a veritable laboratory for avant-garde theatre. It is a space where daring experimental productions are mounted without cease. In truth, this is an extraordinary season for drama across Britain. As one journal aptly remarked, “Today, plays in Britain are ripening like tomatoes on the vine.”

Among these experimental stagings, I attended a performance of Faust by the Actors Touring Company. This Faust belongs to a fourth generation. Reflecting upon the preceding three incarnations in his essay “In the Beginning Was the Deed,” the critic Harry Redner observed that across every historical epoch, a new Faust takes shape in response to the fundamental challenge posed by the “Devil” of that specific age:

The First Faust: The protagonist portrayed by Christopher Marlowe in Doctor Faustus. He is the Renaissance man—an embodiment of the voracious appetite for knowledge, power, and worldly pleasure. He is convinced that Satan alone can grant liberation from the ascetic religious dogmas and orthodoxies that restrain human potential.

The Second Faust: The hero of Johann Wolfgang von Goethe’s world-renowned Faust. He belongs to the Age of Enlightenment. Having tasted the worldly knowledge, dominion, and pleasures that Renaissance man yearned for, he finds that the true elixir of life’s inner joy still eludes him. Mephistopheles endeavors to persuade him that he alone holds that secret; Faust oscillates endlessly between belief and skepticism.

The Third Faust: The protagonist of Thomas Mann’s novel Doctor Faustus. He represents humanity during the era of the World Wars—a man acutely conscious of the tragic hollow beneath the celebrated ideals of human progress from the Renaissance down to his own time. Yet Thomas Mann could not bring himself to believe that human evolution had reached its definitive, catastrophic end. When all is said and done, Mann was fundamentally a classicist; a subterranean ember of Renaissance humanism still burned within him. Deny it as one might, he remained an architect of modernity.

The Fourth Faust: The human being of the postmodern world. He realizes that the entire intellectual architecture from the Renaissance down to the World Wars was merely Eurocentric male thinking. He sees clearly that this worldview served primarily to subjugate women, people of colour, homosexuals, and the entire Third World. After a thousand-year odyssey, the very purpose of philosophy is thrown into question. Philosophy no longer harbors any ambition to erect monumental grand narratives; it turns instead toward the local knowledge rooted in intimate communities, marginalized ethnicities, and tribal folds, seeking authentic personal moral agency.

Against this philosophical backdrop, Mark Ravenhill—then a student of the University of Bristol—fashioned this Faust, drawing upon the life of the postmodern seeker of truth, Michel Foucault (1926–1984). Prior to this, Ravenhill had vaulted into prominence with his controversial play Shopping and Fucking. Working in the confrontational aesthetic known as “Shock Theatre,” Ravenhill crafts productions designed to send visceral tremors down the spine—evoking a gut-churning nausea that borders on physical sickness. His use of the stage to convey the raw sickness and morbid decay of contemporary social life to the spectator is shockingly fearless. A British critic was reportedly so outraged by his debut play that he called for the playwright’s immediate prosecution!

Though theatrical reviews suggested that this Faust was less ferocious than his debut, to an Indian spectator like myself it registered as intensely searing. Staging an explicit act of homosexual intercourse between the Devil and a young man before an audience is something our Indian stages could never conceive, even in their wildest dreams. One is left torn between two impulses: should we despair that this society has grown so sick, or should we marvel that an artist within it possesses the unflinching audacity to expose that sickness with such unvarnished candor?

Throughout the performance, one watches not merely with the eyes, but with one’s intestines, liver, and gall bladder. It induces the precise visceral revulsion that grips a tired clerk in Hyderabad when boarding an overcrowded RTC bus for Dilsukhnagar or Kukatpally after an exhausting workday.

Ravenhill has observed that we are remade by the economic systems we construct, and that this structural mutation inevitably transforms our very identity. In this play, we witness the emergent identity of the young Briton being reconstituted under a Thatcherite economy. To trace the trajectory connecting the knowledge-thirsty youth of Christopher Marlowe’s day to the selfish, calculating careerist of contemporary Britain fills one with sorrow. The hollow pretensions and verbal swagger surrounding our modern human ideals leave us feeling utterly helpless.

Yet the British artist appeared to me invincible and worthy of deep admiration for his uncompromising aesthetic integrity. In our own country, we remain blind to the nature of our own societal sickness; worse still, we cannot tolerate its exposure upon any public platform. At The Green Room, however, a large audience not only filled the hall for Faust, but watched it through to the end with sustained, appreciative focus. In that very capacity for self-awareness—in the courage to gaze unblinkingly into one’s own deformities—resides the true triumph of European humanity.

25-10-2026

Leave a Reply