అంతకన్నా కూడా నాకు పదే పదే అనిపిస్తూ వచ్చింది ఒకటే: ఒకసారంటూ 'ప్రధానస్రవంతి' కథనాలు బీటలు వారడం మొదలుపెట్టాక, ఇంతదాకా అప్రధానీకరణకి లోనయిన కథనాలు ఎంత బలంగా, ఎంత కొత్తగా, ఎంత హృద్యంగా వినిపించడం మొదలుపెట్టగలవూ అన్నదే.
వైట్ నైట్స్
ఇది డాస్టొవిస్కీ తొలిరోజుల్లో రాసిన ఒక చిన్నపాటి నవలికగా కాకుండా ఆయన తదనంతర జీవితాన్నీ, సాహిత్యాన్నీ తనలో ఇమిడ్చిపెట్టుకున్న ఎంతో భావగర్భితమైన రచనగా కనిపించింది. దాని గురించే ఆ ప్రసంగంలో వివరంగా చర్చించాను.
మహాత్ముణ్ణి చూసిన క్షణాలు
గాంధీ జయంతినాడు మొదలుపెట్టి నిన్నటిదాకా ధారావాహికంగా పోస్టు చేసిన గాంధీ జ్ఞాపకాల్ని మీరంతా ఎంతో ఉత్సాహంతోనూ, ఆసక్తితోనూ చదువుతూ వచ్చారు. ఇప్పుడు ఆ స్మృతులన్నింటినీ ఇలా ఈ-బుక్ గా వెలువరిస్తున్నాను.
