శాఫో కవితలు

శాఫోకి ఉత్తరాలు రాయడం పూర్తయిన రోజు అంటే మొన్న ద్యావరి నరేందర్ రెడ్డి గారి నుంచి నాకు ‘శాఫో కవితలు’ పుస్తకం పిడిఎఫ్ అందింది. తెరిచి చూద్దును కదా, డా.లంకా శివరామ ప్రసాద్ గారి 100 వ రచన. ఇప్పటికి పదేళ్ళ కిందటనే, అంటే, 2017 లోనే ఆయన ఆ పుస్తకం వెలువరించారు.

ఆ పుస్తకం చూడగానే నాకు చాలా సంతోషంగానూ, ఆశ్చర్యంగా కూడా అనిపించింది. తెలుగులో ఒక రచయిత ఇప్పటికే శాఫో కవితలు పూర్తిగా అనువదించి ఒక పుస్తకంగా విడుదల చేసి ఉండటం నేను ఊహించని విషయం.

ఇప్పటిదాకా, నాకు తెలిసి, తెలుగులో శాఫో పేరు ప్రస్తావించినవారు ఇద్దరే. ఒకరు, కృష్ణశాస్త్రి, కృష్ణపక్షం కావ్యంలో, ఊర్వశి పద్యాల్లో-

నాడు శాఫో విరహకంఠవేణు నాళవేణు
వాలపించిన యరుణారుణాంధగీతి
యేడ్చు, నిట్టూర్చు, కోపించు నిపుడు సంధ్య
యటుల కాలవిహాయసమున

అనే పద్యం, మరొకరు బసవరాజు అప్పారావు. ఆయన గేయాల పుస్తకంలో, శాఫో పేరిట కొన్ని గీతాలున్నాయి. కాని ఆ ఇద్దరూ కూడా శాఫోని తెలుగు చేసిన వారు కారు.

నాకు తెలిసి, డా. లంకా శివరామ ప్రసాద్ గారే శాఫో కవిత్వాన్ని పూర్తిగా తెలుగులోకి తెచ్చిన అనువాదకులు. ఆయన నిర్విరామ సాహితీ తపస్సు గురించి తెలుసు, ఒకసారి సోమయ్యగారితో కలిసి వరంగల్ వెళ్ళి వారిని కలిసాను కూడా. కానీ, ఈ శాఫో అనువాదం చూసినప్పుడు వారి పైన నాకున్న గౌరవం ఇనుమడించింది.

శాఫోకి ఉత్తరాల పేరిట నేను మొత్తం 24 కవితాశకలాల్ని (వాటిల్లో ఒకటి మాత్రమే పూర్తి కవిత) తెలుగు చేసాను. అవి చదివిన మిత్రులకి శాఫో పేరిట లభ్యమవుతున్న పూర్తి కవిత్వం చదవాలనిపించడం సహజం కద! అందుకని ఈ పిడిఎఫ్ నా చేతికి అందినవెంటనే దీన్ని మిత్రుల్తో పంచుకోవచ్చేమో డాక్టరు గారిని అడిగి కనుక్కోండి అని నరేందర్ రెడ్డిగారిని అడిగాను. ఆయన డాక్టర్ శివరామప్రసాద్ గారిని అడిగితే వారు దయతో అంగీకరించారు. వారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈ పుస్తకం ఇక్కడ పొందుపరుస్తున్నాను.

మిత్రులు దీన్నిక్కణ్ణుంచి డౌనులోడు చేసుకోవచ్చు. పుస్తకం చదివాక డా.శివరామ ప్రసాద్ గారికి ధన్యవాదాలు చెప్పడం మర్చిపోవద్దు.

27-5-2026

8 Replies to “శాఫో కవితలు”

  1. ఎంతమంది రచనలిలా అజ్ఞాతంలో ఉన్నాయో!డాక్కర్ గారికి ధన్యవాదాలు,మీద్వారా!

  2. “నాకు తెలిసి, డా. లంకా శివరామ ప్రసాద్ గారే శాఫో కవిత్వాన్ని పూర్తిగా తెలుగులోకి తెచ్చిన అనువాదకులు”
    This is great, sir. Thanks for sharing.

    Thanks to Dr. Sivarama Prasad garu for bringing Sappho’s poetry to Telugu readers that too almost a decade ago. 🙏🏽

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading