ఇప్పుడు నా ముందున్నవి నీ కవిత్వ శకలాలు. చిన్ని చిన్ని తునకలు. అయితేనేం, వాటితోనే నిన్ను నా మనసులో రూపుకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాను. వాటిలో ఏ ఒక్కదాన్ని తీసుకున్నా చుట్టూ అంతులేని ఖాళీ. ముందూ వెనకా పేజీలు చిరిగిపోయిన ఒక జీవితకథ.
ప్రియమైన శాఫో-6
నీ గాఢమైన అనుభూతి ప్రపంచంలోకి అడుగుపెట్టేముందు, నీ కావ్యప్రపంచంలో మరింత విహరించే ముందు, అందం గురించిన నిన్నటి సంభాషణ మరికొంత కొనసాగించాలనిపిస్తోంది. నీ మరో కవితా వాక్యం గురించి కొంత ఆలోచించాలనిపిస్తోంది. Fragment 50 గా మాకు లభించిన ఈ వాక్యం.
ప్రియమైన శాఫో-5
కాబట్టి సోక్రటీసు నిన్ను అందమైన శాఫో అని అన్నాడంటే ఆశ్చర్యం లేదు. ఆయనలాంటి అనుద్వేగకరమనస్కుడు మాత్రమే గుర్తుపట్టగలడు నీ అందం నీ అనుద్వేగానిదని.
