నేలకొండపల్లి-2

ఆ బావి మీద 'ఈ బావి శ్రీరామదాసుగారు వాడినది' అని రాసి ఉంది. అటువంటి సజీవస్రవంతిని చూడటంలో ఒక పులకింత ఉంది. అయితే ఆయన ప్రవహింపచేసిన  కీర్తనాసాహిత్యమనే సుజలస్రవంతిలో ఒక్కసారేనా మునకలెయ్యని తెలుగువాడంటూ ఉండడుకాబట్టి, నేలకొండపల్లిలో ఆయన చేదుకున్న నీళ్ళబావిని చూడటంలో ఒక చిత్రమైన సంతోషముంది.