నన్ను వెన్నాడే కథలు

అనిల్ బత్తుల పబ్లికేషన్స్ ప్రచురించిన 'నన్ను వెన్నాడే కథలు' (2026) పుస్తకం పైన పిన్నంసెట్టి కిషన్ గారు రాసిన సమగ్ర సమీక్ష ఇది. కిషన్ గారు అత్యంత సమర్థుడైన, నీతివంతుడైన ప్రభుత్వ అధికారి. పేదల పక్షపాతి. కాబట్టి ఆయన ఈ కథల్తో మమేకం కాగలిగారు. వేములవాడనుంచి వచ్చిన కిషన్ గారు 'లేంబాళవాటిక కథలు' పేరిట అమరవాతి కథల్ని తలపించే కథలు రాసారు. 'నల్లపద్యం' ఆయన కవితాసంపుటి.

కొండగాలీ కొత్త జీవితం

కొండగాలీ కొత్త జీవితం: ఇలా ఒక అత్యంత చారిత్రిక ప్రాధాన్యత కలిగిన ఒక రచనను నా చేతుల్తో ఆవిష్కరించగలనని నేనెన్నడూ ఊహించలేదు. ఈ అవకాశాన్ని నాకు అయాచితంగా అందిచినందుకు అనిల్ కి ఎన్ని ధన్యవాదాలు చెప్పినా తక్కువే.

వేపపూల తీపిగాలి

అందుకని 64 కవితలు ఎంచి ఇమ్మని మానస చామర్తిని అడిగారు. ఆమె నేను ఇంతదాకా వెలువరించిన 8 సంపుటాల్లోంచీ, ఈ ఏడాది పొడుగునా నా బ్లాగులో రాస్తూ వచ్చిన కవితల్లోంచీ 64 కవితలు ఎంపికచేసారు. వాటిని ఆమే, అనల్ప బలరాం గారూ ఇద్దరూ కలిసి ఇలా 'వేపపూల తీపిగాలి' పేరిట ఈ రోజు విడుదల చేసారు.