ఈ కాలానికి తగ్గ దేవుడు

ఇప్పటికైతే ఒక్క మాట గుర్తుపెట్టుకో. ఈయన సరిగ్గా ఇప్పటికాలానికి తగ్గ దేవుడు. ట్రూ పర్సనాలిటీ కోచ్.  అన్నిటికన్నా ముందు మనం ఎలా బతకాలో చెప్తున్నాడు. నువ్వు ఎలా ఉన్నావన్న దానికి ఎవరికీ సంజాయిషీలిచ్చుకోనక్కర్లేదు. నిన్ను నువ్వు అంగీకరించు. ఎవరు ఏం చెప్పినా చెవులు చాటంత చేసుకుని విను. కానీ ఊరికే ఆందోళన పడిపోకు. నువ్వెలా బతకాలో నీ  స్క్రిప్టు నువ్వే రాసుకో.

తీరని ఋణం

ఆయన చెప్పిన నిర్వచనం ప్రకారమే చూస్తే, ఇది కేవలం ఋషి లక్షణం మాత్రమే కాదు, దైవలక్షణం కూడా. ఇవ్వడమే, ఎటువంటి ప్రతిఫలాపేక్షా లేకుండా ఇవ్వడం మాత్రమే తెలిసినవాణ్ణి దేవుడంటారనే కదా ఆయన చెప్పింది!

జీవన శిల్పి-30

ఏ రోజైతే మనిషి గుర్తింపు తాపత్రయం వదిలేస్తాడో ఆ క్షణమే ఋషిగా మారిపోతాడు. ఒక అనంతత్త్వంలో, ఆ పరమాత్మలో కలిసిపోతాడు. కానీ అలా గుర్తింపుని వదులుకునేవాళ్ళు ఈ లోకంలో చాలా తక్కువమంది మాత్రమే ఉన్నారు.