తెలుగులో రామకథ

'మరలనిదేల రామాయణంబన్నచో. ..' అని తనని తాను ఎవరన్నా ప్రశ్నిస్తారనుకుని జవాబు చెప్తూ విశ్వనాథ సత్యనారాయణ ‘శ్రీమద్రామాయణ కల్పవృక్ష కావ్యం’ (1934) మొదలుపెట్టాడు. కాని అటువంటి ప్రశ్న వెయ్యేళ్ళుగా తెలుగు గ్రామసీమల్లోని స్త్రీలకి కలగలేదు. వారు నిరంతరం రామాయణాన్ని పాటలుగా పాడుకుంటూనే ఉన్నారు.