లండన్! నీకు నా నమస్కారం. నువ్వు నీ అధికార దర్పాన్ని చూపినప్పుడు మా మనిషి ఒకడు కొల్లాయిగుడ్డతో, రాట్నంతో, కబీరోదోహాతో దాన్ని ఎదిరించాడు. ఇప్పుడు నేను స్వతంత్ర దేశ పౌరుడిగా, భావుకుడిగా, కవిగా నీదగ్గరికి వచ్చాను. నిన్ను చూశాను, ముగ్ధుణ్ణయ్యాను. నీ పావురాలకి గింజలు చల్లిన వాళ్లలో నేనూ ఉన్నాను. సెలవు.
