ఏ విధంగా చూసినా ప్రపంచ సాహిత్యంలోని శ్రేష్ఠకృతుల్లో అగ్రశ్రేణిలో నిలబడే ఈ గీతాన్ని రెండేళ్ళ కిందట తెలుగులోకి అనువదించాను. ఇప్పుడు ఆ గీతానికి సర్గల వారీగా వివరణలతో పాటు, ఇప్పటిదాకా వచ్చిన వ్యాఖ్యానాల్ని దృష్టిలో పెట్టుకుని ఒక విపులమైన ముందుమాట కూడా రాసి 'దివ్యప్రేమ గీతం' పేరిట ఇలా వెలువరిస్తున్నాను. ఈ పుస్తకం డిజిటలు ప్రతిని ఇక్కణ్ణుంచి డౌన్లోడు చేసుకోవచ్చు.
ఆత్మోత్సవ గీతం
వాల్ట్ విట్మన్ రాసిన Song of Myself ను ఆత్మోత్సవ గీతం పేరిట తెలుగు చేసి ఈ-బుక్కు రూపంలో గతంలో మీతో పంచుకున్నాను. ఆ పుస్తకాన్ని ఇప్పుడు అనల్ప పబ్లికేషన్స్ బలరాం గారు పుస్తకగా తీసుకొచ్చారు. ఆ పుస్తకాన్ని ఈ రోజు ఇలా విడుదల చేస్తున్నాము.
కథలు ఎలా పుట్టాయి
చాలా సంతోషంగా ఉంది. పదిహేనేళ్ళ కిందట మొదలుపెట్టిన ప్రాజెక్టులో మొదటిభాగాన్ని ఇప్పటికి సంతృప్తిగా పూర్తిచేయగలిగాను. 'కథలు ఎలా పుట్టాయి: ప్రాచీన కథారూపాల పరిచయం' అనే ఈ పుస్తకాన్నిలా ఈ-బుక్కుగా మీ చేతుల్లో పెట్టగలుగుతున్నాను.
