మనసున మనసై

అయితే అది పెళ్ళికానుక కాబట్టి విస్తృతపాఠకలోకానికి అందుబాటులో లేకుండా ఉండిపోయింది. అదీ కాక, ఆ పుస్తకం ఎ-4 సైజులో ఉండటంతో అది పాఠకసన్నిహితం కాదు. అందుకని ఆ పుస్తకాన్ని ఇప్పుడిలాగ ఎ-5 సైజులో రీడిజైను చేసి మీతో పంచుకుంటున్నాను.

ఆషాఢమేఘం

ఇన్నాళ్ళకి ఈ మృగశిర కార్తె మొదటిరోజున ఈ పుస్తకాన్ని ఇలా మీతో పంచుకుంటున్నాను. దీన్నిక్కడ డౌనులోడు చేసుకోవచ్చు. మీ మిత్రులకు మాన్సూను గిఫ్టుగా పంపించుకోవచ్చు. ఈ పుస్తకాన్ని నా చిరకాల మిత్రుడు, పాటలమాంత్రికుడు గంటేడ గౌరునాయుడుకి కానుక చేస్తున్నాను. ఇది నా 64 వ పుస్తకం

వికసించిన విద్యుత్తేజం

ప్రతి ఏడాదీ ఫిబ్రవరి నెలపొడుగునా అమెరికాలో, కెనడాలో జరుపుకునే నల్లజాతి చరిత్ర మాసోత్సవాన్ని పురస్కరించుకుని 2018 లో ఆఫ్రికన్‌-అమెరికన్‌ సాహిత్యం పైన కొన్ని పరిచయ వ్యాసాలు రాసాను. వాటిలో డగ్లస్‌, డన్‌బార్‌, లాంగ్‌స్టన్‌ హ్యూస్‌, పాల్‌ రోబ్సన్‌ మీద వ్యాసాల్ని ఇప్పుడు కొద్దిగా విస్తరించాను. వారితో పాటు ఫిల్లిస్‌ వీట్లి, జార్జి మోజెస్‌ హోర్టాన్‌, రిచర్డ్‌ రైట్‌ల మీద కొత్తగా రాసిన వ్యాసాలు ఈ సంపుటిలో చేర్చాను. ఇప్పుడు ఈ పదిహేను వ్యాసాల్నీ 'వికసించిన విద్యుత్తేజం' పేరిట ఈ ఫిబ్రవరి నల్లజాతి చరిత్ర మాసోత్సవం సందర్భంగా ఇలా విడుదల చేస్తున్నాను. ఇది నా 55 వ పుస్తకం. ఆఫ్రికన్‌-అమెరికన్‌ సాహిత్యం వైపు నా దృష్టి మళ్ళించిన నా ఆత్మీయుడు కన్నెగంటి రామారావుకు ఈ పుస్తకాన్ని ప్రేమతో కానుక చేస్తున్నాను.