ఆ శిఖరాన్ని అట్లా చూస్తున్నకొద్దీ నాలోపల నా జ్ఞాపకాలలోపల ఎన్నో పొరలకిందనుంచి, ఎన్నో వాసనల, సంస్కారాల తెరలు తప్పించుకుంటూ నెమ్మదిగా ఒక మహాశిఖరం తలెత్తుతున్నట్లుగా అనుభవమైంది. నేనిక్కడికి వచ్చింది ఈ శిఖరాన్ని చూడటంకోసమే, అసలు నన్ను చూడటంకోసమే ఈ శిఖరం నన్నిక్కడికి రప్పించుకుందని నాకు హఠాత్తుగా స్ఫురించింది.
