నేను తిరిగిన దారులు-21

ఆమె ఒక్కసారిగా రాగమందుకుంది. నోరారా ఎలుగెత్తిపాడింది. ఆ పాట ఏమిటో, ఆ మాటలేమిటో నాకెంతమాత్రం తెలియకపోయినా, ఆ భావమేదో నాకు చాలాసన్నిహితంగా తెలిసిందేననీ, నా చిన్నప్పుడు మా ఊళ్లో వసంతకాలపు రాత్రుల్లో గిరిజనస్త్రీలు పాడుకున్నపాటలాంటిదేననీ అనిపించింది.