ఒక ద్రుపద్ సాయంకాలం

కానీ ఇవాళ అంతమంది యువతీయువకులు సంగీత సరస్వతికి తమ 'స్వాంతమనే సరోజాన్ని సమర్పణ' చేయడానికి అంకిత చిత్తులై కనిపిస్తుంటే నాకు చాలా చాలా సంతోషమనిపించింది. ఆ రాగాల పేరిట, ఆ బందిష్ ల పేరిట వాళ్ళకి ఈ దేశపు ఋతువులు, ఈ దేశపు కవితలు, ఈ దేశపు రంగులు పరిచయమవుతున్నాయి కదా అనిపించింది.

ఒక సంగీత సాయంకాలం

నిన్న సాయంకాలం ఆ సితారు ఆలాపన వింటున్నంతసేపూ నాకు ఒక నది ఒడ్డున కూచున్నట్టూ, నా పాదాలు ఆ నీళ్ళల్లో మునిగీ మునక్కుండా పెట్టుకున్నట్టూ, చిన్ని చిన్ని నీటితరగలు నా పాదాల్ని తాకి విరిగి కిందకి జారిపోతుంటే, నా హృదయంలోపల ఎవరో చేయిపెట్టి మెత్తని సున్నితమైన తంత్రులేవో కెరలిస్తున్నట్టూ అనిపించింది.

స్వర-మిలన్

సంగీతం వినేప్పుడు నా అనుభూతి కూడా అటువంటిదే. అంతేకాదు, గొప్ప చిత్రలేఖనాలు చూస్తున్నప్పటిలాగా, గొప్ప కావ్యాలు చదువుతున్నప్పటిలాగా, ఆ సంగీతం నాలోని ఏవో పురాస్మృతుల్ని కెరలిస్తుంది. నెమ్మదిగా నేనొక మధుర విస్మృతిలోకి జారుకుంటాను.