ఆ కవులంతా ఒక సమిష్టి కుటుంబం-2

(శ్రీనాథుడి పైన సంస్కృత కవుల ప్రభావం గురించి మాట్లాడమని అడిగారు మా మాష్టార్ని 1985 లో నరసాపురంలో జరిగిన ఒక జాతీయ గోష్ఠిలో. ఆ సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం మిత్రులు డా. అరిపిరాల నారాయణరావుగారి సౌజన్యం వల్ల నాకు లభించింది. ఆ ప్రసంగాన్ని ఇన్నాళ్ళకు ట్రాన్స్ క్రైబు చెయ్యగలిగాను. అందులో మాష్టారు అప్పటికప్పుడే తన ధారణలోంచి చదివిన పద్యాల్నీ, శ్లోకాల్నీ, పద్యపాదాల్నీ, శ్లోక పాదాల్నీ గుర్తుపట్టడం దానికదే ఒకclassical education అని అర్థమయింది. ముందు ఈ ప్రసంగం వినండి. వ్యాసం మొదట్లోనే ఆడియో ఫైలు రూపంలో ఉంటుంది. దాన్ని మీరు డౌను లోడ్ కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత వ్యాసం చదవండి. మీ సౌలభ్యం కోసం దాన్ని రెండు భాగాలుగా అందిస్తున్నాను. ఇది రెండవ భాగం.)


మల్లంపల్లి శరభయ్య

శ్రీనాథుడి పైన సంస్కృతకవుల ప్రభావం

A Talk by Mallampalli Sarabhayya on Srinatha

అని పద్యం రాశాడు కాశీఖండంలో. Fashion mongeror  అన్నాను కదా  ఇందాక-

నారద మహర్షి వింధ్య పర్వత ప్రాంతానికి వచ్చాడు. ఆ నర్మదా నది నుంచి వచ్చే ఆ నీటి గాలి తరగల చేత ఆయన జడలు కదులుతున్నాయి అన్నాడు.

ఆ శ్రీనాథుడు ఆ పద్యం లాంటి పద్యం రాయాలని ప్రలోభంతో పెద్దనగారు ఇది రాశాడు. చూడండి రెండూ. వాళ్ళిద్దరినీ  చూసి-

ఇది అగస్త్యుని మీద పద్యమే, తెనాలి రామకృష్ణ కవి రాశాడు.

ఆ శ్రీరంగానికి పెరియాళ్వార్లు వేంచేసినప్పుడు శ్రీకృష్ణదేవరాయలు చెప్పాడు ఈ పద్యం . ఈ పద్యాలకన్నింటికీ model  పద్యం ఏది? శ్రీనాథుని యొక్క పద్యం.

కాబట్టి శ్రీనాథుని సాహిత్యం మీద సంస్కృత కవుల ప్రభావం అన్నంత మాత్రంచేత చాలదు. వాడు  ఏమేమి మేసాడో- సంస్కృత కవులను చాలా మేసాడు, వాడు ఇంతా  అంతా  మెయ్యలేదు. ఆ మేత యొక్క సారాంశం అంతా అతని వాక్కుకు పట్టి ఉంది. అది మేసారు వీళ్ళు ప్రబంధ కవులు. మేసినందువల్ల ఏమిటంటే, ఆ సమస్తమైనటువంటి సారం వచ్చింది. ఆ ఓజస్సు అంతా వచ్చింది. మరి మిగిలిన దేశ భాషల సంగతి నాకు తెలియదు. ఈ సంస్కృతాన్ని అంత సర్వంకషంగా భర్జించుకోగలిగింది జీర్ణించుకోగలిగినది, జీర్ణించుకోగలిగింది ఏది అంటే తెలుగు భాష అన్న విషయాన్ని వాళ్ళు experiment చేసి చూపించారు.

అతని యొక్క ఆ వాక్కులోనే ఒక సమ్మోహనమైనటువంటి లక్షణం ఉంది. వాళ్ళేమిటి  హేమాహేమీలు, సామాన్యులా? పెద్దనగారు గానీ, ఆ రామకృష్ణ కవి గానీ, ఆ ధూర్జటి గానీ, కృష్ణదేవరాయలు గానీ- వాళ్ళందరూ అతన్నే అనుసరించారు. తెలివితక్కువ వాళ్ళు అనుసరిస్తే అనుసరించినట్టు కనిపిస్తుంది, గడుసు వాళ్ళు అనుసరిస్తే అనుకరించడం వేరు, అనుసరించడం వేరు.

ఆ క్రియాపదాలతో సహా సమాసం చేసి పెట్టేసాడు, ‘అస్తివామ్య భారం’- అలా ఉంది సంస్కృతంలో ఆయన రాశాడు. ఆ సొగసు  ఎలా వస్తుంది? అందుకోసం దాన్ని సరాసరి తీసుకొచ్చి పెట్టాడు. పెట్టి ఏమనిపించాడు అది? తెలుగు పద్యం- తెలుగు పద్యం అనిపించేటట్టుగా చేశాడు, ఎలా చేశాడో వాడు వత్సమాయ !

దీనికి సమ్మోహపడి పెద్దనగారు:

ఈ వెనకటి పుస్తకాలు చదివే అలవాటు రాను రాను పోతుంది కానీ, రతిని వర్ణించిన ఈలాంటి ఒక పాతిక ముప్పై పద్యాలు ఉన్నాయి మన ప్రబంధాల్లో. వీటన్నిటికీ కులగురువు ఏదంటే ఆ శ్రీనాథుని యొక్క పద్యం.

పద్యాన్ని వ్యాఖ్యానించాలంటే గంట సేపు పడుతుంది. ఉపన్యాసాల్లో ఎలా సాధ్యమవుతాయి ఇవి?

తిక్కన గారిది. ఈ ధనుస్సుతో నన్నెక్కడ యుద్ధం చేయమంటావురా? ఈ సంక్రాంతి విల్లంబుల్లాంటివి లాంటివి ఉత్తరుడి యొక్క విల్లంబులు. వీటితో కౌరవ సేనతో ఎక్కడ సమరమవుతుంది? గాండివమున్నది అది పట్టుకు రమ్మన్నాడు.

కాబట్టి ఇటువంటి పరిశీలన కాకుండా, కొడుకులో తండ్రి పోలిక, తాతయ్య పోలిక ఉన్నాయన్న research కాకుండా- మీకు నిజంగా కావ్య తత్వ జిజ్ఞాస కనుక స్థిరంగా ఉన్నట్లయితే, దృఢంగా ఉన్నట్లయితే అప్పుడు జరిపించే సభల యొక్క పద్ధతి వేరు, అప్పుడు topics వేరు. నేను వచ్చి ఇలా అన్నానని మీరు ఆగ్రహించకండి.

ఇదేమిటి? పెద్ద కవి కుటుంబం ఇది. తెలుగు కవుల కుటుంబం వేరు, సంస్కృత కవుల కుటుంబం వేరు కాదు. మొత్తం ఒక సమిష్టి కుటుంబం. ఏ influence ఎక్కడ ఎవడి మీద ఉందంటే, తీగ కదిలిస్తే డొంక కదులుతుంది. అది సులభమా? తేలే  విషయము కాదు.

ఎక్కడినుంచి పట్టుకొచ్చాడు?

కాళిదాసుది ఇది. ఆస్తిమిత భూషణారవము… కాబట్టి స్టడీ అనేది ఎలా ఉండాలంటే comprehensive గా ఉండాలి. Analysis ఉండవలసిందే, Analysis తో పాటు అది ఎలా ఉండాలి? Comprehensive గా ఉండాలి. ఉన్నప్పుడు ఏమవుతుంది? దాని యొక్క సమగ్రమైనటువంటి దర్శనం మనకి కలుగుతుంది. దేనికది విడదీసి చూస్తే ఏం మిగలదు, ఏమీ ఉండదు. ఆ total picture మనస్సులో అది భాసించదు.

ఇప్పుడేమిటంటే సంస్కృతం చదవని వాళ్ళకి కూడా ఆ సంస్కృత సాహిత్యం యొక్క పుష్టిని కలిగించే లక్షణం ఆ శ్రీనాథుని పద్యాల్లో ఉంది. ఈ రోజుల్లో పద్యాలు కంఠస్థం చేయటం నామర్దా. సభల్లో పద్యాలు ఉదాహరించడం fashion కాదు. ఇటువంటి సభల్లో వాటి గురించి మాట్లాడటం అంటే ఎలా ఉంటుంది? మాట్లాడటం అనేది ఎలా ఉంటుంది? ఈ సభ్యుల యొక్క దృష్టిని, వాళ్ళ receptivity ని అది జాగ్రత్తగా చూసుకొని మాట్లాడాలి. మాట్లాడకపోతే- మాట్లాడినవాడు ఏమవుతాడు? హాస్యాస్పదుడవుతాడు.

అందువల్ల ఏదో కొంతవరకు ప్రసంగం చేశాను. ఇంతవరకు ఆపడం మంచిదనుకుంటా. తర్వాత చాలా కార్యక్రమం ఉంది కాబట్టి, ఏం తేలే  విషయం కాదు ఇది. ఇంతకీ సారాంశం ఏమిటంటే, ఈ ఆంధ్రభాష యొక్క భవిష్యత్తును మార్చాడు అప్పటికే ఆయన. ఇప్పుడు చూడండి, ఒక ప్రతిభా వంతుడు వచన కవిత్వం రాస్తే అందరూ వచన కవిత్వాలు రాస్తారు. ఒకడు మినీ కవిత రాస్తే అందరూ మినీ కవితలు రాస్తారు. ఆ రోజుల్లో అది fashion. వాళ్ళేం భారతం చదవని వాళ్ళు కాదు ఆ ప్రబంధ కవులు గానీ, వాళ్ళు గానీ. ఆ శ్రీనాథుడు పెట్టినటువంటి మార్గం, శ్రీనాథుడు పెట్టినటువంటి ఒరవడి, ఆ శ్రీనాథుడు ఏర్పాటు చేసినటువంటి దానికి సమ్మోహితులయ్యారు. ఆ సమ్మోహం కొన్ని శతాబ్దాల దాకా పోలేదు. అసలు ఎప్పుడూ పోదనుకుంటాను, ఎవరో నావంటి ఛాందసులు రాస్తే, ఆ శ్రీనాథుని ప్రభావం- ఆ సంస్కృత కవుల ప్రభావం శ్రీనాథుని మీద ఎలా ఉందో, నేను చెప్పకుండా కనుక ఒక పద్యం చదువుతాను, అది ఎవరిదో మీరు చెప్పుకోండి.

ఇరవయ్యో శతాబ్ది పద్యమేనా ఇది?

కాబట్టి ఎన్ని సారస్వతోద్యమాలు వచ్చినా, ఏమి వచ్చినా జీవనది దానంతట అది ఎలా ప్రవహిస్తూనే ఉంటుంది. ఇవి ఇలా వస్తూ ఉంటాయి, కొన్ని decades ఉంటాయి, పోతూ ఉంటాయి. అది ఎప్పుడూ ఉండేది, ఎప్పుడూ ప్రవహించేది. మీరేం అనుకోకపోతే ఈ పద్యం నాది. విక్రమోర్వశీయంలో పద్యం. విక్రమోర్వశీయం తెలుగు చేశాను. ఆ నాలుగో అంకంలో ఒక ఆక్షిప్తకం ఉంటుంది. పురూరవస్సు యొక్క ప్రవేశానికి ఒక మదగజం ఇలా నడుస్తోంది అని- ఈ పద్యం ఎలా రాశాను నేను? ఆ శ్రీనాథుడు ఆవేశించినందువల్లనే కదా!

 ‘ఇంక కొరత పెట్టనేల? ‘నేను అర్జునుడ’నన్నాడు కదా! దాచి పెట్టడం ఎందుకు, ఇది కూడా నా పద్యమే ఇది కూడా.

ఒక్క మాట అంటాను మీకు ఏమీ కోపం రాకుండా ఉన్నట్లయితే, కోపం వచ్చినా మరి నన్ను మీరు చేయగలిగింది ఏమీ లేదు. మీ విశ్వవిద్యాలయాలూ ఇవి, ఇప్పటి పద్ధతులు ఇవన్నీ ఉన్నాయి అనుకోండి… ఒక చేమకూర వెంకటకవిని produce  చేయగలవా ఇవి? ఒక శతకకర్తను produce చేయగలవా? కాబట్టి ప్రతిభ అనేది దానంతట అది పుట్టవలసిందే తప్ప, manufacture చేయబడేది కాదు. వాళ్ళు ఏ యూనివర్సిటీలో చదువుకున్నారండి వెనకటి కవులు? వాళ్ళకి ఏ డిగ్రీలు ఉన్నాయి వాళ్ళకి?

కాబట్టి ఆ సంపదకంతకీ మీరు వంచితులు కాబోతున్నారు, ఆ విషయం హెచ్చరిస్తున్నాను నేను. అంత వాఙ్మయ సంపదకి కానివాళ్ళు అవుతున్నారు, దానికి మీరు వారసులై ఉండి దాన్ని దఖలు పరుచుకోలేని వాళ్ళు అవుతున్నారు మీరు. అందువల్ల అందులోకి ప్రవేశం కలిగించే సారస్వతానుశీలనం, సాహిత్య విద్యాభ్యాసం అదేదైనా ఉంటే దాన్ని revive చేయటానికి మీరందరు బుద్ధిమంతులు కాబట్టి, సమ్యగ్విచార దక్షులు కాబట్టి, ఆ పని చేయవలసిందిగా ఇంత మహాసభలో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. నా పారుష్యం ఏమైనా ఉంటే దాన్ని మీరు క్షమించాలి.


Featured image: The road to Kondaveedu

26-9-2026

2 Replies to “ఆ కవులంతా ఒక సమిష్టి కుటుంబం-2”

  1. ఈ మాటలు శరభయ్య మాస్టారి గొంతులో విన్నప్పుడు.. మీ ట్రాన్స్క్రిషన్ చదివినప్పుడు కూడా కళ్ళనీళ్ళ పర్యంతం అయిపోయాను భద్రుడు గారు..
    **********
    కాబట్టి ఆ సంపదకంతకీ మీరు వంచితులు కాబోతున్నారు, ఆ విషయం హెచ్చరిస్తున్నాను నేను. అంత వాఙ్మయ సంపదకి కానివాళ్ళు అవుతున్నారు, దానికి మీరు వారసులై ఉండి దాన్ని దఖలు పరుచుకోలేని వాళ్ళు అవుతున్నారు మీరు. అందువల్ల అందులోకి ప్రవేశం కలిగించే సారస్వతానుశీలనం, సాహిత్య విద్యాభ్యాసం అదేదైనా ఉంటే దాన్ని revive చేయటానికి మీరందరు బుద్ధిమంతులు కాబట్టి, సమ్యగ్విచార దక్షులు కాబట్టి, ఆ పని చేయవలసిందిగా ఇంత మహాసభలో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. నా పారుష్యం ఏమైనా ఉంటే దాన్ని మీరు క్షమించాలి.
    *************
    ఎంత గొప్ప ప్రసంగమో ఇది. దీన్ని మాకు అందించినందుకు మీకు ధన్యవాదాలు.

    1. మీరు ఈ ప్రసంగం విన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ వంటి పిపాసుల కోసమే అటువంటి అమృతభాండం అక్కడ సిద్ధంగా ఉంది.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading