కొండవీడు-2

కొండవీడులో చరిత్ర శిథిలాలు ఒక చిన్న అంశం మాత్రమే. ఆ కొండకొమ్ముల మీద తేలాడే ఆ మబ్బులముందు, మేఘాలముందు మనకి చరిత్ర గుర్తుకు రాదు. మీరు శ్రీనాథుడి కవిత్వం చదివి ఉంటే, ఆ పద్యాల్లోని loftiness ఎక్కడిదో తెలియాలంటే మాత్రం ఒకసారైనా కొండవీడు పోయి రావాలి.

మొదటి స్వతంత్ర కావ్యం

అసలు తెలుగు సాహిత్యంలో పదిహేనో శతాబ్ది కవులందరిదీ ఒక ప్రత్యేకమైన అధ్యాయం. పిల్లలమర్రి పినవీరన, శ్రీనాథుడు, పోతన, అన్నమయ్య- ఈ నలుగురూ పదిహేనో శతాబ్ది పొడుగునా శృంగార, వైరాగ్యాల మధ్య నలిగిపోయారు.

సప్తగోదావర జలము తేనె

కాని ఒక మహాకవి తాను వర్ణించాలనుకున్న వస్తువుకి ఒక పోలిక తెచ్చినప్పుడు దాన్ని సమగ్రంగా పోల్చే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఆ వర్ణనీయ వస్తువు మన హృదయాల్లో చెక్కుచెదరకుండా నిలిచిపోతుంది.