నేను బరోడాలో ఉన్నప్పుడు చూశాను, వాళ్లు మట్టితో ఎలా ఆడుకుంటారో, కానీ, మన ఆదిలాబాద్ కుమ్మరి దగ్గర ఏదైతే ఉందో ఆ బరోడా మట్టిలో ఆ స్పర్శ లేదు. అక్కడంతా టెక్నికల్. ఇక్కడ సహజత్వం ఉంది. మట్టిని చూడగానే దానితో ఏం తయారవుతుందో మన కుమ్మరి చెప్పేస్తాడు. ఈ అనుభవం ఏ కాలేజీ లోనూ దొరకదు. ..
