జీవన శిల్పి-17

పూర్వం ఈ ప్రాంతంలో ఏ ఇంటికైనా ఆమ్మాయిని ఇచ్చేవాళ్ళు 'మీ ఊళ్ళో ఏముంది?' అనడిగేవారు. వాళ్ళు 'మా ఊళ్ళో పన్నెండు చెరువులున్నాయి' అని చెప్పారనుకోండి, ఇంకేమీ అడిగేవారు కాదు. పన్నెండు చెరువులున్నచోట ఇంకేం కావాలి?  మరేమీ ఆలోచించకుండా వారు ఆ సంబంధం ఖాయం చేసుకునేవారు.