ఇది సాధారణమైన పనికాదు. జీవితమంతా విద్యాతత్త్వశాస్త్రాన్ని ఔపోశన పట్టిన మహోపాధ్యాయుడు, తనని తాను పదవతరగతి ఫెయిలైన లేదా పాసైన గిరిజన యువకుడిగా ఊహించుకుని, తన ముందు గిరిజన బాలబాలికల్ని సంభావించుకుని, వారికి పాఠాలెట్లా చెప్పాలా అన్న అవేదనతో, తపనతో తయారు చేసిన ప్రణాళికలవి. ..
కొన్ని కలలు కొన్ని మెలకువలు-21
ఆమె మాటలు వింటున్నంతసేపూ నేను పదేపదే ‘నేను ఒంటరిని కాను’, ‘నేను ఒంటరిని కాను’ అని నాకు నేను చెప్పుకుంటూనే వున్నాను. అక్కడెక్కడో కొండకోనల్లో గూడగూడకి, బడిబడికీ తిరుగుతూ నేను మాట్లాడుతున్న మాటల్నే ఇక్కడ ఢిల్లీలో ప్రభుత్వపు విద్యావిధానాన్ని నిర్దేశించే అత్యంత కీలకమైన సంస్ధలో అత్యంత కీలకమైన విద్యావేత్త కూడా మాట్లాడుతుండటం నాకు మానసికంగా, నైతికంగా ఎంతో బలాన్నిచ్చింది.
గురుదక్షిణ
డా.రవీంద్రకుమార శర్మగారితో 2010 లో అదిలాబాదులో కళాశ్రమంలో చేపట్టిన సంభాషణల్ని ధారావాహికంగా నా బ్లాగులో మీతో పంచుకున్నాను. ఇప్పుడు ఆ సంభాషణల్ని ఇలా పుస్తక రూపంలో ఈ గురుపూర్ణిమ శుభదినాన మీతో పంచుకుంటున్నాను. 416 పేజీల ఈ పుస్తకం డిజిటల్ ప్రతిని ఇక్కణ్ణుంచి డౌనులోడు చేసుకోవచ్చు.
