కొన్ని కలలు కొన్ని మెలకువలు-12

6 ఇంటి భాష నుంచి బడి భాషకి పాఠశాలలోపల ఏం జరుగుతుందో విచారించే అధికారం ఎవ్వరికీ లేదు కాబట్టి అన్ని పాఠశాలలూ ఒక్కలానే పనిచేస్తున్నట్టు పైకి కనబడేది. ఈ ఒక్కలాగా కనబడేదాన్నే మనం సార్వత్రీకరణ (యూనివర్సలైజేషన్) అని పిలుస్తాం. మనం విద్యని (యూనివర్సలైజ్) చెయ్యడమంటే అందరికీ అన్నీ యూనిఫారమ్‌గా అమలు చెయ్యడమనే నమ్మకానికి ఏళ్ల తరబడి అలవాటు పడ్డవాళ్లం. యూనివర్సలైజేషన్ అంటే అందరికీ అవకాశాలు సమానంగా అందుబాటు లోకి రావడం. అంటే ఏమిటన్న మాట? అది కేవలం …