స్వాగతం!

మిత్రులారా! మీరు నా కుటీరానికి ఇస్తున్న ప్రోత్సాహానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ సహకారం వెలకట్టలేనిది. చాలామంది మిత్రులు నా రచనల గురించి అడుగుతున్నారు. నా రచనలు ఈ బ్లాగులోనే ఉన్నాయి. ఇప్పుడు మీరు వాటిని అందుకోడానికి వీలుగా మెనూలో రచనలు అనే విభాగం కింద వివిధ ఉపవిభాగాలు పొందపరిచాను. మీరు నేరుగా ఆ ఉపవిభాగాల్లోకి ప్రవేశించి మీకు కావలసిన పుస్తకాలు ఉచితంగా పి.డి.ఎఫ్ లు డౌనులోడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నా గురించిన ఒక స్థూల పరిచయం, ఇంతదాకా వెలువడ్డ నా పుస్తకాల వివరాలూ కూడా మీ సమాచారం కోసం పొందుపరిచాను. Happy Reading!


జ. 28-3-1962, శరభవరం, రాజవొమ్మంగి మండలం, పూర్వపు తూర్పుగోదావరి   జిల్లా.

తల్లిదండ్రులు శ్రీ విశ్వేశ్వర వేంకట చలపతి, సత్యవతీ దేవి.

1985 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి తత్త్వశాస్త్రంలో ఎమ్మే.

కొన్నాళ్ళు రాజమండ్రిలో టెలికమ్యూనికేషన్స్ డిపార్ట్ మెంటులో పనిచేసాక, 1987 లో గ్రూపు-1 సర్వీసులకు ఎంపికయ్యారు. 1987 నుంచి 1919 దాకా ఆంధ్రప్రదేశ్ ప్ర భుత్వంలో గిరిజన సంక్షేమ శాఖలో వివిధ హోదాల్లో పనిచేసారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుకు పదోన్నతి పొందాక, ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ సంచాలకులుగా పనిచేసి, 2022 లో గిరిజనసంక్షేమ శాఖ సంచాలకులుగా పదవీవిరమణ చేసారు. మూడున్నర దశాబ్దాల ప్రభుత్వ ఉద్యోగంలో భాగంగా, గిరిజన ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి, ఆదిమ గిరిజన సమూహాల అభివృద్ధికీ, గిరిజన ఉపప్రణాళిక అమలుకు విశేషంగా కృషిచేసారు. రాష్ట్రంలో గిరిజన, దళిత, మైనార్టీ సమూహాల పిల్లల విద్యావకాశాల మెరుగుదలకూ, బాలికల విద్యోన్నతికీ, ప్రభుత్వపాఠశాలల పనితీరు మెరుగుదలకు, విద్యాప్రమాణాల మెరుగుదలకూ గణనీయమైన కృషిచేపట్టారు.

చినవీరభద్రుడు కవి, రచయిత, సాహిత్య విమర్శకుడు, అనువాదకుడు, కాలమిస్టు, వక్త, చిత్రకారుడు, బ్లాగరు, యూట్యూబరు  కూడా.

ఇప్పటిదాకా 81 పుస్తకాలు వెలువరించారు.

భారత రిపబ్లిక్ పూర్వ అధ్యక్షులు డా.ఎ.పి.జె.అబ్దుల్ కలాం రాసిన Ignited Minds గ్రంథానికి ఆయన చేసినఅనువాదం ‘నా దేశ యువజనులారా’కు 2008లో సాహిత్య అకాదెమీ ఉత్తమ అనువాద పురస్కారం అందించింది. ఆయన  రాసిన ‘పునర్యానం’ దీర్ఘకావ్యానికి తెలుగు విశ్వవిద్యాలయం 2007 లో  ఉత్తమ వచన కవితా పురస్కారం  అందించింది. గిరిజన ప్రాంతాల్లో తన అనుభవాలను వివరిస్తూ ‘కొన్ని కలలు, కొన్ని మెలకువలు’ పేరిట ఆయన రాసుకున్న పుస్తకం అపారమైన ప్రాచుర్యం పొందింది.

ప్రస్తుతం ఆయన ‘నా కుటీరం’ పేరిట ఒక బ్లాగు, ‘గోదావరి’ పేరిట ఒక యూట్యూబ్ చానెల్ నిర్వహిస్తున్నారు. ఉత్తమ సాహిత్యాన్ని పరిచయం చెయ్యడం, ప్రపంచ సాహిత్యం నుంచి మేలిమి గ్రంథాల్ని అనువదించడం, గొప్ప పుస్తకాల గురించి వారం వారం ప్రసంగాలు చెయ్యడం ప్రస్తుతం ఆయన వ్యాపకాలు. ఆయన రాసిన పుస్తకాల వివరాలు:

స్వీయ రచనలు (30)

కవిత్వ సంపుటాలు (9)

నిర్వికల్ప సంగీతం, 1986

ఒంటరి చేల మధ్య ఒక్కత్తే మన అమ్మ,1995

పునర్యానం, ఎమెస్కో, 2004*

కోకిల ప్రవేశించే కాలం, శ్రీ ప్రచురణ, 2009

నీటిరంగుల చిత్రం, శ్రీ ప్రచురణ, 2014

కొండమీద అతిథి, శ్రీ ప్రచురణ, 2018

కొండకింద పల్లె, ఎమెస్కో, 2021

కోమల నిషాదం, ఈ-బుక్, 2025

జ్యోతిర్మయ రోదసి, ఈ-బుక్, 2026

కథాసంపుటాలు (2)

ప్రశ్నభూమి, మరికొన్ని కథలు , 1990*

వాడ్రేవు చినవీరభద్రుడు కథలు 1980-2023, ఎమెస్కో, 2023

నవలలు (2)

అరణ్యం, నవోదయ, 1987

ఆ వెన్నెల రాత్రులు, ఈ-బుక్, 2025, శ్రీపాద లీటరరీ వర్క్స్ ప్రచురణ, 2025

సాహిత్య ప్రశంస (11 )

సహృదయునికి ప్రేమలేఖ. ఎమెస్కో, 2001

సాహిత్యమంటే ఏమిటి, శ్రీ ప్రచురణ, 2009

సాహిత్యసంస్కారం, ఎమెస్కో, 2017

దశార్ణ దేశపు హంసలు, ఈ-బుక్, 2019

ఎల్లలోకము ఒక్క ఇల్లై, ప్రపంచ కవిత్వంతో పదేళ్ళు, ఈ-బుక్, 2022

తీరని దాహం, కవిత్వ పరిచయాలూ, పలవరింతలూ, ఈ-బుక్, 2025

ఆ బంభరనాదం, సాహిత్యప్రయాణాలూ, సాహిత్యసంతోషమూ, 2025, పల్లవి ప్రచురణ, 2025

కథల సముద్రం, కథలూ, నవలలూ, కలబోతలూ, ఈ-బుక్, 2025, ఎన్నెలపిట్ట ప్రచురణ, 2025

కొత్త యుగం రచయిత్రి, మరికొన్ని సాహిత్యవ్యాసాలు, ఈ-బుక్, 2025

ఎవరో ఒకరు ఏదో ఒక కాలంలో, ప్రపంచ కవిత్వం వారికోసమే, ఈ-బుక్, 2025

తెలుగదేలయన్న, తెలుగు భాష, తెలుగు పద్యం, ఈ-బుక్, 2025, శ్రీపాద లిటరరీ వర్క్స్, 2025

యాత్రాకథనాలు (4)

నేను తిరిగిన దారులు, శ్రీ ప్రచురణ, 2011

నా చంపారన్ యాత్ర , ఈ-బుక్, 2018

పాటలు పుట్టిన తావులు, ఎమెస్కో, 2020

మునిగి తేలాం,  బ్రహ్మపుత్ర నుంచి కావేరీ దాకా, ఈ-బుక్, 2024

విద్య (2)

కొన్ని కలలు, కొన్ని మెలకువలు, ఎమెస్కో, 2005

ఆ వెలుగుల కోసమే, పాఠశాలలూ, ప్రయత్నాలూ, ప్రయోగాలూ, ఈ-బుక్, 2024

స్వీయ రచనలు: ఇతరప్రక్రియలు (15)

బాల సాహిత్యం (3)

మీరు ఇంటినుంచి ఏమి నేర్చుకోవాలి, ఎమెస్కో, 2005

మీరు బడి నుంచి ఏమి నేర్చుకోవాలి, ఎమెస్కో, 2005

మీరు సమాజం నుంచి ఏమి  నేర్చుకోవాలి, ఎమెస్కో, 2005

సామాజిక పరివర్తన (3)

సోమయ్యకు నచ్చిన వ్యాసాలు, శ్రీ ప్రచురణ, 2012

ఉదారచరితులు,  వారిది వసుధైకకుటుంబం, ఈ-బుక్, 2025 , పల్లవి పబ్లికేషన్స్ ప్రచురణ, 2025

జీవన శిల్పి, రవీంద్రకుమార శర్మతో సంభాషణలు, శ్రీపాద ప్రచురణ, 2026

చిత్రకళ (1)

తూలిక, చిత్రకారులూ, చిత్రకళారీతులూ, ఈ-బుక్,2025

సంగీతం, నాటకం, నాట్యం (1)

రసధార, రంగస్థలంపైన సంగీతం పైన వ్యాసాలు, ఈ బుక్, 2025

సినిమా వ్యాసాలు (1)

ఇన్విక్టస్, మరొకొన్ని సినిమాలు, ఈ-బుక్, 2025

తాత్త్విక చింతన  (2)

పరమయోగి శ్రీ వై.హనుమంతరావు, 2006

సంతోషం ఒక క్రియాపదం, సత్యశోధకులూ, సన్మార్గ సాధకులూ, ఈ-బుక్, 2025, పల్లవి పబ్లికేషన్స్ , 2025

మ్యూజింగ్సు (1)

ఇంకొంచెం సూర్యకాంతి, బతుకును వెలిగించిన క్షణాలు, ఈ-బుక్, 2025

డైరీలు (1)

రాజమండ్రి డైరీ, 1986, ఈ-బుక్, 2024, శ్రీపాద లిటరరీ వర్క్స్ ప్రచురణ, 2025

ఉత్తరాలు (2 )

పోస్టు చేసిన ఉత్తరాలు, కొంచెం స్వగతం, కొంచెం సాహిత్యం , ఈ-బుక్, 2025

ప్రియమైన శాఫో, ప్రాచీన గ్రీకు కవయిత్రికి ఉత్తరాలు, శ్రీపాద ప్రచురణ, 2026

సంకలనాలు (3)

వందేళ్ళ తెలుగు కథ, ఇరవయ్యవ శతాబ్ది ప్రతినిధి కథల సంకలనం, ఎమెస్కో, 2001*

జీవనం సత్యం, జీవనం సుందరం, అమృత సంతానం పై ఆత్మీయ స్పందనలు, 2018

నన్ను వెన్నాడే కథలు, ఈ బుక్, 2025, అనిల్ బత్తుల పబ్లికేషన్స్ ప్రచురణ, 2026

పరిచయ గ్రంథాలు (20)

ప్రపంచ తత్త్వశాస్త్ర పరిచయం (9)

ప్రత్యూష పవనాలు, ఎమెస్కో, 1996 , ఈ బుక్, 2026

సత్యాన్వేషణ, 2500 ఏళ్ళ పాశ్చాత్య తత్త్వశాస్త్రం నుంచి ఎంపికచేసిన కొన్ని భాగాలకు అనువాదం, విపుల పరిచయం, ఎమెస్కో, 2003

జర్మన్ తత్త్వవేత్త కాంట్ రచనలు, ఎంపికచేసిన రచనలకు అనువాదం, పీకాక్ క్లాసిక్స్, 2008*

వేదార్థ మీమాంస, డా.కొత్త సచ్చిదానందమూర్తిగారి ‘వేదిక్ హెర్మన్యూటిక్స్’ కు అనువాదం, విపుల పరిచయం, 2011*

తేనీటిపుస్తకం, ఒకాకురొ కకుజొ, ‘బుక్ ఆఫ్ టీ’ కి అనువాదం, అనల్ప, 2022

నీ శిల్పివి  నువ్వే, మార్కస్ అరీలియ మెడిటేషన్స్ పరిచయం, అనల్ప, 2022

కన్ ఫ్యూసియస్ జీవితం, దర్శనం, అనువాదం, విపుల పరిచయం, అలకనంద, 2023*

ప్రేమగోష్ఠి, ప్లేటో ‘సింపోజియం’ కు అనువాదం, విపుల పరిచయం, ఈ-బుక్ , 2024 , పల్లవి పబ్లికేషన్స్ ప్రచురణ, 2025

అవధూత గీత, దత్తాత్రేయుల ‘అవధూత గీత’కు అనువాదం, విపుల పరిచయం, ఈ-బుక్, 2025

ప్రపంచ సాహిత్య  పరిచయం (11)

హైకూ యాత్ర, మత్సువొ బషొ యాత్రాకథనాలకు అనువాదం, విపుల పరిచయం, ఎమెస్కో, 2010

మనసున మనసై, భారతీయ కవులూ, వారి హృదయేశ్వరులూ, ఎమెస్కో, 2014, ఈ-బుక్, 2025

నాది దుఃఖం లేని దేశం, కబీరు కవితలకు అనువాదం , విపుల పరిచయం, శ్రీ ప్రచురణ, 2017

మూడు వందల వచనాలు, ఎంపిక చేసిన బసవన్న వచనాలకు అనువాదం, విపుల పరిచయం, శ్రీపాద  ప్రచురణ 2024

ఆత్మోత్సవ గీతం, వాల్ట్ విట్మన్ ‘సాంగ్ ఆఫ్ మైసెల్ఫ్’ కు అనువాదం, విపుల పరిచయం, ఈ-బుక్, 2024, అనల్ప బుక్స్ ప్రచురణ, 2025

ఈశ్వరస్తుతిగీతాలు,  బైబిల్లోని అరవై‘సామ్స్’ గీతాలకు అనువాదం, విపుల పరిచయం,ఈ-బుక్,2024

వికసించిన విద్యుత్తేజం, ఆఫ్రికన్-అమెరికన్ సాహిత్య పరిచయం, ఈ-బుక్, 2025, శ్రీపాద లిటరరీ వర్క్స్ ప్రచురణ, 2025

ఆషాఢమేఘం, ప్రాచీన సంస్కృత, ప్రాకృత, తమిళ కవిత్వాలలో తొలివర్షాకాలం, ఈ-బుక్, 2025

ఏకాంత కుటీరం, ప్రాచీన చీనా కవిత్వ పరిచయం, ఈ-బుక్, 2025

కథలు ఎలా పుట్టాయి, ప్రాచీన కథారూపాల పరిచయం, ఈ-బుక్, 2025, పల్లవి పబ్లికేషన్స్ ప్రచురణ, 2025

దివ్యప్రేమ గీతం,  సోలోమోను ‘సాంగ్ ఆఫ్ సాంగ్స్’  కు అనువాదం, ఈ-బుక్, 2025

అనువాదాలు (10)*

డా..పి.జె.అబ్దుల్ కలాం రచనలు (6)

ఒక విజేత ఆత్మకథ,  ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’, ఎమెస్కో, 2002

నా దేశ యువజనులారా, ‘ఇగ్నైటెడ్ మైండ్స్’, ఎమెస్కో, 2002

ఈ మొగ్గలు వికసిస్తాయి, ‘యు ఆర్ బార్న్ టు బ్లోజమ్’, రీమ్స్  2009

ఎవరికీ తలవంచకు, ‘ఇండామిటబుల్ స్పిరిట్’, రీమ్స్ , 2009

ఉత్తమ కుటుంబం, ఉదాత్త దేశం, ‘ఫామిలీ అండ్ నేషన్’, రీమ్స్,2015

యు ఆర్ యునీక్, ‘యు ఆర్ యునీక్’, పుణ్య పబ్లిషింగ్ హౌజు, 2023

గాంధేయ సాహిత్యం (3)

గాంధీ  వెళ్ళిపోయాడు, మనకు దిక్కెవరు, డా.గోపాలకృష్ణగాంధీ,‘ గాంధీ ఈజ్ గాన్, హు విల్ గైడ్ అజ్’, ఎమెస్కో, 2010

హరిలాల్ గాంధీ, చందుబాయి భాగుభాయి దలాల్ రాసిన హరిలాల్ గాంధి జీవితకథ. ఎమెస్కో, 2016

సత్యమొక్కటే, దర్శనాలు వేరు, గాంధీ-టాగోర్ లేఖలు, ఎమెస్కో, 2016

మానేజిమెంటు (1)

వారిలా కలగనండి, వారిలా సాధించండి, రశ్మి బన్సాల్ రచన, ‘స్టే హంగ్రీ స్టే ఫూలిష్’ కు అనువాదం, రీమ్స్, 2010

Translations (3)

Song of My Village, Selected Poems, A Bilingual Edition, 1982-1992, e-book, 2025

The Second Horizon, Selected Poems from Punaryanam,  A Bilingual Edition, e-book, 2025

The Song Arrives, Selected Poems, A Bilingual Edition, 2006-2009, e-book, 2026


గమనిక: పై పుస్తకాలలో * గుర్తు గల రచనలు తప్ప తక్కినవన్నీ ఈ బ్లాగునుంచి PDF లు ఉచితంగా డౌనులోడ్ చేసుకోవచ్చు. అందుకు మెనూలో ‘రచనలు’ విభాగం కింద తిరిగి మళ్ళా పైన పేర్కొన్న ఉపవిభాగాల నుంచి ఆయా పుస్తకాలు డౌనులోడ్ చేసుకోవచ్చు.

17-9-2026