మేధాపరంగా ఆయన ఆర్థిక ప్రణాళిక నన్ను ఆకట్టుకోలేకపోయింది; ఆధ్యాత్మికంగా ఆయన నాకంటే ఎన్నో లోకాల ఎత్తులో ఉన్నారనిపించింది. సముద్రపు అలలు కొండ అంచుల్ని తాకి ముందుకు సాగిపోయినట్టు, నేనూ ఈ భౌతిక పురోగతి ప్రపంచమూ ఆయనను దాటి వెళ్లిపోతున్నామనిపించింది;
మహాత్ముణ్ణి చూసిన క్షణాలు-17
‘ఓహ్, ఏదైనా ఇస్తాను, ఏమైనా సరే ఇస్తాను’ అన్నాను నేను ఆవేశంలో, మాటల ప్రవాహంలో. ఆయన నన్ను కించిత్ చమత్కార పూరితమైన, దయార్ద్రమైన చూపుల్తో చూశారు; ఆ చూపు ముందు నేనొక తెలివితక్కువ పసిపిల్లలా అనిపించాను. మీరాబెహెన్ వెంటనే హెచ్చరిస్తున్నట్టుగా: ‘ఆయన కోరుకునేది ఏమిటో మీకు తెలుసుగా—నూలు వడకడం!’ అన్నారు.
మహాత్ముణ్ణి చూసిన క్షణాలు-16
కానీ ఆయన చిరునవ్వు చూడగానే మాత్రం ఆయన నాకెంతో అందంగా కనిపించారు—ఎంతటి దయార్ద్రభరితమైన, విశాలమైన, మధురమైన చిరునవ్వు! చుట్టూ ఉన్న జనం నుండి ఆయన వైపు వెల్లువెత్తుతున్న భక్తిప్రపత్తుల తరంగాన్నీ, ఆయన్నుండి పెల్లుబుకుతున్న అపారమైన తేజస్సునూ, కరుణామృత ధారనూ మాత్రమే నేను అనుభవపూర్వకంగా గ్రహించగలిగాను.
