నేను తిరిగిన దారులు-25

అయితే ఈ వేడుక నన్నానందపరచకపోలేదు. ఆ రంగులు, ఆ సంగీతం, ఆ మహాసంరంభం, ఆ సైనికబలం, అసలు ఆ మొత్తం సమష్టిఅనుభవం. భారతదేశ రాజకీయభవితవ్యం గురించి మొత్తం అంశాలన్నిటినీ మళ్లా కొత్తగా పరిశీలించు కోవడానికి ఇది నాకొక కొత్త సందర్భాన్నిచ్చింది

నేను తిరిగిన దారులు-24

కానీ, నేననుకుంటాను: తమ చుట్టూ ఉండే మనుషుల గురించి ఆలోచించే మనుషులు భారత దేశానికి ఎక్కువ అవసరమని. కానీ అటువంటి వాళ్లు నాకు ఢిల్లీలో అతి తక్కువ మంది, అసలు లెక్కించడానికి కూడా సాధ్యంకానంత అల్పసంఖ్యలో కనిపించారు.

నేను తిరిగిన దారులు-23

అందుకనే ఆ పర్వతసముదాయం నన్ను 'నువ్వు అగస్త్యుడివేనా?' అని అడిగినట్టనిపించింది. నేను చిరునవ్వుతో 'అగస్త్యుణ్ణి కాదు, అవిసె చెట్టుని మాత్రమే' అన్నానా కొండలతో. (సంస్కృతంలో అగస్త్యమంటే అవిసె చెట్టు అని కూడా అర్థం.)