
నా ఇంగ్లాండ్ యాత్ర
2
ఊహించని ఔదార్యం
మేం మాంచెస్టర్‌లో అడుగుపెడుతూనే సన్‌షైన్ తీసుకువచ్చామని మిత్రులన్నారు. అప్పటిదాకా కరుడుగట్టిన శీతాకాలపు రాత్రులు, చలిగాలుల వర్షాలు ఆవరించిన వాయవ్య ఇంగ్లాండ్ అప్పుడప్పుడే రాబోతున్న వసంతకాలంలోకి మేల్కొంటూ ఉంది. ‘శిశిర వసంతాల మధ్య వచ్చే విచిత్ర మధురమైన మార్పు’ ని మేం చూడటానికి నోచుకోవడమే కాక, ఆ మార్పు మా రాకతోటే మొదలుకావడం కూడా ఎంతో సంతోషాన్నిచ్చింది.
ఎటుచూసినా నాచుపట్టిన కొండలతో, శాఖలతో ఒక్క ఆకు లేకుండా ఎండి ముడుచుకుపోయిన డెసిడ్యువస్ అరణ్యాలు, ఇటుకపైన ఇటుక పేర్చి కట్టిన ముదురురంగు పురాతనభవనాలు, ఒకరూ అరా మాత్రమే సంచరించే విశాలమైన రోడ్లు, ఎముకల్ని కొరికే చలిగాలులు.. మాంచెష్టర్ మొదటిరోజు నగరసందర్శన దిగులుతో కూడిన శీతల, ఉదాసీనభావాన్ని కలిగించింది.
నగరజీవితం మనకి కొత్తకాకపోయినా మన నగరాలు వేరు. ఇవి సదా మనుష్య కోలాహలంతో ఉక్కిరిబిక్కిరవుతుండే ప్రవాహాలు. కాని ప్రపంచంలోనే తొలి పారిశ్రామిక నగరంగా వికసించిన మాంచెస్టర్ ఒక సోమరికొండచిలువలాగా చుట్టలు చుట్టుకుని అరమోడ్పు కళ్లతో పడుకున్నట్టు అనిపించింది. దాని ఉదాసీనత, దాని గతంలోని రక్తపుచారికలూ, అది లేవనెత్తిన పారిశ్రామిక నమూనాలోని భయానక పరిణామాలు, దాని అంతర్గతసంక్షోభం నాకు కలిగించిన సిక్ నెస్ ఆ మొదటివారమంతా నన్నంటిపెట్టుకునే ఉంది.
కాని ఈ నాగరికఉదాసీనతలో సూర్యరశ్మిలాగా మనుషుల ఆత్మీయత నన్నూరడించింది. యూనివెర్సిటిలో సోషల్ ఆంత్రోపోలజిస్టు ఒకాయన నన్నడిగాడు: ‘బ్రిటిష్ జీవితంలో నిన్నాకర్షించింది ఏది?’ అని.
నేనన్నాను కదా: ‘నన్నాకర్షించినవెన్నో ఉన్నప్పటికీ నేను మొట్టమొదట చెప్పగలిగేది మీ ప్రజలు అభ్యాగతులపట్ల చూపిస్తున్న ఆదరణ. నా దేశం తన అయిదువేల ఏళ్ల సాంస్కృతిక చరిత్రలో ఎన్నో విలువల్ని పైకి తీసుకొచ్చింది. కాని ఆగంతకుడు, అభ్యాగతుడు నీ ఇంటిముందుకు వచ్చినప్పుడు అతన్ని మిత్రుడిగా చేరదీసుకోవడమనేది నా దేశంలో ఇంకా ఆదర్శమే తప్ప పూర్తి ఆచరణకు రాలేదు. కాని ఇక్కడ ఎన్నో ఉదాహరణలు. మీ దేశం వైభవం మీ పరిశ్రమల్లో, కవిత్వంలో, రాజవంశీకుల ఆభరణాల్లో, ఆర్కిటెక్చర్లో లేదు. అది అపరిచితుల్ని మిత్రులుగా దగ్గరకు తీసుకోగలిగే సంస్కారంలో ఉంది’ అని.
ఆయన ఆశ్చర్యపోయాడు: ‘బ్రిటిష్ వాళ్లు జీనోఫోబిక్ అంటారే అంతా. ఇక్కడ ఎన్నో ఏళ్ల నుండి ఉంటున్న ఇండియన్లనే వాళ్లు తమతో సమానులుగా చూడడం లేదంటారే’ అన్నాడు. కాని నా అనుభవాలు, నా మిత్రుల అనుభవాలు మరోలా ఉన్నాయి.
లండన్‌లో ఇమ్మిగ్రేషన్ కౌంటర్లో మా పాస్‌పోర్టుని, ఎంబార్క్‌మెంట్ పత్రాల్ని ఎంతో నిశితంగా పరిశీలించిన అధికారి తన చెక్ పూర్తి కాగానే ‘మాంచెస్టర్‌లో వర్షం బాగా పడుతుంటుంది. గొడుగు తెచ్చుకున్నారా?’ అని అడిగాడు. బర్లింగ్టన్ స్ట్రీట్ లోని మాబర్లీటవర్స్ లోకి పెద్ద సూట్ కేసు తీసుకుపోవడానికి నేనవస్థ పడుతుంటే బయటికి వెళ్తున్న ఒక అపరిచితుడు నా కష్టం చూడలేక తాను ఆ సూట్‌కేసు లిఫ్ట్ దాకా సాయంపట్టి కృతజ్ఞతలకోసం చూడకుండా వెళ్లిపోయాడు.
గ్రోసరీ షాపులో యోగర్ట్ కోసం వెతుక్కుంటున్న నన్ను ఆ దుకాణం నడుపుకునే మహిళా చేయిపట్టుకుని తన షాపు అంతా తిప్పి చూపించి తొందరగా వండుకోవడానికి వీలయ్యే వెజిటేరియన్ ఫుడ్ మెటీరియల్ వివరంగా పరిచయం చేసింది. ఇంగ్లాండ్‌లో సైట్‌సీయింగ్ ట్రావెల్ ఏర్పాట్లు తెలుసుకోడానికి వెళ్తే సీనియర్ ట్రావెల్కన్సల్టెంట్ ఒకమ్మాయి దాదాపు మూడుగంటల పాటు చక్కని గైడ్‌తో వివరించింది.
దీన్ని వ్యాపారసమాజపు సేల్స్‌మేన్ షిప్ అని తీసిపారెయ్యడం సులభం. కాని ‘ఒక కస్టమర్‌ని పొందడానికి నెలలు పడుతుంది, పోగొట్టుకోడానికి క్షణాలు చాలు’ అనే వ్యాపార సమాజవివేకంలో మన ప్రభుత్వకార్యాలయాల్లో కనిపించని మానవత్వం లేశమేనా ఉందనవచ్చు.
రోడ్డుమీద, బస్ కోసం, సమాచారం కోసం, సౌకర్యం కోసం నిన్ను భయరహితునిగా ఉంచడం కోసం ఎన్నో హస్తాలు నీకు చేయూతనివ్వడానికి సిద్ధంగా ఉన్నాయిన్న తలపు ఏ దూరదేశంలోనైనా ఆ యాత్రీకుడికి ఎంత ఓదార్పు. నాలుగంతస్థుల భవనంలో రెండవ అంతస్థులో బయటికి వస్తున్న ఒక అపరిచితుణ్ణి మెట్ల దగ్గర ఆపి ‘ఇక్కడ మీటింగు హాలు ఎక్కడ’ అని అడిగానొకరోజు. దానికాయన ఏం చెప్తున్నాడో అర్థం చేసుకోవడం కష్టమయింది నాకు. భాష అర్థం కాక కాదు, ఊహించని ఔదార్యం ముంచెత్తినందువల్ల.
ఆయనన్నాడు కదా: ‘ఆ మీటింగ్‌హాల్ ఎక్కడో నాకు కూడా తెలియదు. కాని నువ్వు నాకు అయిదు నిమిషాల సమయమిస్తే నేను ఈ భవనమంతా ఒక్కసారి తిరిగివచ్చి ఆ మీటింగ్ హాలు ఎక్కడుందో నీకు చూపిస్తాను. నా కోసం కొద్దిసేపు వేచిఉండే కష్టాన్ని నువ్వు కొద్దిగా ఓపికపట్టగలవా?’.
3
కొత్త పోలరైజేషన్
నిజమే. నాగరికులు, సంస్కారవంతులు అయిన కొద్దిమంది వ్యక్తుల వైఖరినిబట్టి ఏ సమాజాన్ని కూడా మనం పూర్తిగా అంచనావెయ్యలేం. ముఖ్యంగా వ్యక్తి శ్రేయోవాదానికి, సాంఘికవాదానికీ మధ్యగత మూడువందల ఏళ్లుగా వూగిసలాడుతున్న బ్రిటిష్ సమాజాన్ని.
సమాజంలోని పౌరుల మంచిచెడ్డలు వ్యక్తులు లేదా వ్యక్తులు నడుపుకునే ప్రైవేటుసంస్థలు బాగా చూడగలవా లేక పబ్లిక్ సంస్థలు బాగా చూడగలవా అన్న ఈ వివాదానికి మొదటినుంచీ అనుకూల ప్రతికూలవాదాలు రెండుపార్శ్వాల్లోనూ బలంగానే ఉన్నాయి.
ఆధునికచరిత్రలో ఇంగ్లాండ్‌లో ఇటువంటి తాకిడికి గురైన మొదటి పబ్లిక్ సంస్థ రాజరికమేనని చెప్పాలి. జాన్ చక్రవర్తి చేత మాగ్నాకార్టా పైన సంతకం పెట్టించడంతో (1215) కొత్తతరహా వ్యక్తివాదం మొదలయ్యింది. అది అనంతరకాలంలో రూపొందించిన పార్లమెంటరీ ప్రజాస్వామికవ్యవస్థ, దాని శ్రేయోరాజ్య ఆదర్శాలు ప్రతితరంలోనూ కొత్తతరం వ్యక్తివాదాల తాకిడికి గురవుతూనే ఉన్నాయి. అటువంటి తాకిడి మరింతబలంగా చారిత్రకప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్న యుగంలో నేటి ఇంగ్లాండ్ ఉంది.
ఇంగ్లాండే కాదు, ఆ మాటకొస్తే ప్రపంచమంతా కూడా అటువంటి యుగసంధిలో ప్రయాణిస్తోంది. ఈ కొత్త శక్తి పేరు ‘మార్కెట్’. ఇది అంతర్జాతీయశక్తి. గ్లోబల్వ్యాపి. మహా చురుకైనది. ఇంగ్లాండ్‌లో పారిశ్రామిక విప్లవకాలంలో వృద్ధి చెందిన బూర్జువావర్గం నిర్మించిన ఆధునికజాతీయరాజ్యం ఈ కొత్తయుగపు అంతర్జాతీయ కార్పొరేట్ శక్తిముందు నిలబడలేకపోతోంది.
రెండువందల ఏళ్ల కిందట ఇంగ్లాండ్‌లో బూర్జువావర్గం అటు ఫ్యూడల్ కులీనవర్గంతోనూ, ఇటు కార్మికవర్గంతోనూ ఏకకాలంలో పోరాటం చెయ్యవలసివచ్చినప్పుడు ఆ రెండింటి ఆశయాల్నీ, ఆదర్శాల్నీ కలగలిపి శ్రేయోరాజ్యనమూనాను రూపొందించింది. దీనిని నడిపించే బ్యురోక్రసీ నిర్మాణం ఫ్యూడల్ తరహా నిర్మాణం. ఆశయాలు సోషలిష్టువి. ఉదాహరణకి ఒక వికలాంగకార్మికుడికి పెన్షన్ ఇవ్వగలనంటుంది శ్రేయోరాజ్యం. కాని ఆ పెన్షను పత్రాన్ని సమర్పించి పెన్షను పొందడానికి ఆ అర్జీ అసంఖ్యాక ఆధికారిక ప్రాకారాల్ని దాటి పయనించవలసి ఉంటుంది.
ఎంత ఘనమైన సోషలిష్టు ఆదర్శాల్ని ప్రకటించినా శ్రేయోరాజ్యం, వాస్తవానికి వచ్చేటప్పటికి, దాని డొల్లతనం దాగడం లేదు. శ్రామికవిప్లవం చెలరేగకుండా ఇంగ్లీషువివేకం ఇంతకాలం ఎటువంటి వ్యూహాలు పన్ని గర్విస్తూ వచ్చిందో ఆ యుక్తులన్నీ మార్కెట్ ముందు చప్పబడిపోతున్నాయి.
తమ ఖరీదైన జీవనప్రమాణాలు, అంతరించిపోయిన వలసలు, కొరతపడుతున్న భౌతిక వనరులు, మందగించిన ఆర్థికాభివృద్ధి, చురుకుగా పైకి వస్తున్న తృతీయదేశాల నుండి పోటీ, నిరుద్యోగం, గమ్యరహితమైన యువతరం-ఇంగ్లాండ్ తన చరిత్రలోనే అత్యంత కష్టభరితమైన సంక్షోభాన్ని నేడు ఎదుర్కుంటోంది.
ఈ సంక్షోభం ఒక పోలరైజేషన్‌కు దారితీస్తోంది. అందులో ఒక ధ్రువాన్న ఇంగ్లాండ్ అంతర్జాతీయ మార్కెట్లో చేరాలనీ, లిబరలైజ్ కావాలనీ భావించే వర్గం ఉంది. వారికి అఖండయూరోప్ ఆదర్శం. మరొక ధ్రువాన్న ఇంగ్లాండ్ తన గతవైభవమంతటితోనూ తన సార్వభౌమత్వాన్ని నిలుపుకుంటూ ఫ్రీట్రేడ్ ఐలండ్‌గా మిగిలిపోవాలని కోరుకునే వర్గం ఉంది. వీరికి హాంకాంగ్ ఆదర్శం. రెండువర్గాల వాదనలోనూ బలాలున్నాయి, బలహీనతలున్నాయి. కాని మధ్యలో రాజకుటుంబం ఉంది.
బ్రిటిష్ రాజకుటుంబాన్ని అఖండయూరోప్కి ఆటంకంగా భావించి దాన్ని రద్దు చేయాలని వాదించేవారున్నారు. కాగా ఇంటాబయటా దిగజారుతున్న సాంఘికవిలువలనడుమ ధీరురాలుగా నిల్చిన రెండవ ఎలిజబెత్ మహారాణిని చూపిస్తూ కుటుంబవిలువల పరిరక్షణకీ, సాంఘికవిలువల పరిరక్షణకీ ఆమెనొక ఆశాదీపంగా భావిస్తున్నవారూ ఉన్నారు. మొదటివారిని ‘యూరో విజనరీస్’ అనీ, రెండవవారిని ‘యూరోస్కెప్టిక్స్’ అనీ వ్యవహరిస్తున్నారు.
ఈనాటి ఇంగ్లాండ్ విక్టోరియాయుగపు ఇంగ్లాండ్ కాదు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం కాదది నేడు. రాజకీయ, సాంఘిక, సారస్వతరంగాల్లో మేరునగధీరులవంటి మహా వ్యక్తులెవరూ ఇప్పుడు లేరు. ప్రపంచాన్నంతటినీ పాదాక్రాంతం చేసుకోగలిగిన ఆ కాలం అంతరించిపోయింది.
ఇది పోస్ట్‌మాడర్న్ యుగం. కంప్యూటర్ల యుగం. తృతీయప్రపంచదేశాల యుగం, మలేషియా, సింగపూర్ల యుగం, అంగ్ సాన్ సూకీ, నెల్సన్ మండేలాల యుగం. నేటి ఇంగ్లాండ్ జీవితంలోనూ, కళలోనూ, సాహిత్యంలోనూ ఈ సంఘర్షణ ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఒకవైపు వైభవోజ్జ్వలమైన గతం, సుదూరసమున్నతశిఖరాలు. మరొకవైపు వర్తమాన సమస్యలు, భవిష్యత్తు గురించి ఆరాటం, ప్రపంచరాజ్యాలపంక్తిలో తన స్థానాన్ని తను పదిలపర్చుకోవాలన్న ఆతృత. ఏదో ఒక విధంగా ప్రపంచాన్ని ఆకర్షించాలి, జగజ్జనులందరినీ ప్రభావితం చెయ్యాలన్న మహత్వకాంక్ష. మరొకవైపు ఈ మహత్వకాంక్ష మీద నిరసన, మన యువకుల్ని మనం చక్కదిద్దుకుంటే చాలు, మన పిల్లలకి మనం అన్నం పెట్టుకోగలిగితే చాలు అన్న వాదన.
An English Sojourn
2
An Unexpected Generosity
The moment we set foot in Manchester, friends remarked that we had brought the sunshine with us. Until then wrapped in frozen winter nights and driving rains of chill wind, North West England was just beginning to stir into the coming spring. To witness that strange, sweet interlude between winter and spring was a gift in itself; that the change seemed to coincide with our arrival added to the joy.
Yet on that first day, sightseeing through Manchester induced a melancholic chill, a quiet sense of desolation: moss-grown hillsides, deciduous woods shorn of every leaf standing withered and hunched, dark historic buildings raised brick upon brick, wide avenues traversed by only a solitary pedestrian or two, and winds biting straight to the bone.
Urban life was hardly unfamiliar to us, yet our cities back home are of an entirely different nature—torrents perpetually overwhelmed by the press and clamor of human multitudes. Manchester, having blossomed as the world’s very first industrial metropolis, struck me instead like a sluggish python curled upon itself, resting with half-closed eyes. Its brooding inertia, the stains of blood in its history, the dread consequences of the industrial template it had unleashed, and the spiritual malaise rising from its inner crisis—that underlying sickness clung to me throughout that first week.
Yet within that civilizational gloom, the warmth of its people consoled me like sudden sunshine. A social anthropologist at the university once asked me:
“What has struck you most about British life?”
I answered:
“Though many things have moved me, what I can name above all else is the hospitality your people extend to a stranger. My country, across its five-thousand-year cultural history, has given rise to sublime ideals. Yet when an itinerant traveler, a stranger, arrives before your threshold, taking him in as a friend remains largely an ideal rather than an unswerving daily practice. Here, however, I see countless instances of it. The true glory of your country lies neither in your industries, nor your poetry, nor the jewels of your monarchs, nor your architecture; it resides in this innate refinement that embraces strangers as friends.”
He looked surprised:
“People often say the British are xenophobic. They say that even Indians who have lived here for decades are not seen as equals.”
Yet my own encounters, and those of my companions, spoke of something else entirely.
At London immigration, after scrutinizing our passports and embarkation cards with rigorous precision, the officer completed his check and looked up:
“It rains quite a bit in Manchester. Have you brought an umbrella?”
While I was struggling to haul a heavy suitcase into Moberly Tower on Burlington Street, a stranger heading out, unable to bear the sight of my distress, stepped forward, helped me carry the luggage all the way to the lift, and walked away without waiting for words of thanks.
In a grocery store, noticing me searching in vain for yogurt, the woman running the shop took me gently by the hand, guided me through the aisles, and introduced me at length to quick-cooking vegetarian provisions. When I approached an agency to inquire about sightseeing arrangements across England, a senior travel consultant spent nearly three hours walking me through a fine guide, explaining every detail with unhurried care.
It is easy to brush this aside as the practiced salesmanship of a commercial society. Yet in that commercial maxim—“It takes months to find a customer, and only seconds to lose one”—there flickers at least a grain of human consideration seldom encountered across the bureaucratic offices of our own government.
On a public road, waiting for a bus, seeking directions, or needing simple assistance, how immensely comforting it is for a traveler in a distant land to know that hands stand ready to set his anxieties at rest. One afternoon, coming down the stairs of a four-storey building, I stopped a stranger emerging on the second landing and asked:
“Where is the meeting hall here?”
I found it difficult to take in what he said in reply—not because the language eluded me, but because I was completely overwhelmed by his unexpected generosity.
He said:
“I do not know where that meeting hall is either. But if you can spare me five minutes, I will walk through the entire building and find out where it is for you. Could you bear the trouble of waiting for me just a moment?”
3
A New Polarization
It is true: no society can be judged entirely by the refined conduct of a few civil individuals—least of all British society, which has oscillated for the past three centuries between individual utilitarianism and social collectivism.
Whether the welfare of citizens is best secured by individuals and private enterprise or by public institutions is a contest with formidable arguments marshaled on both sides from the very beginning. In modern English history, the first public institution to bear the brunt of this clash was the monarchy itself. When King John was compelled to sign the Magna Carta in 1215, a new strain of individualism was born. The parliamentary democratic structure and welfare state ideals that flowered from it in subsequent centuries have faced the recurring shocks of fresh individualist doctrines in every generation. Today’s England stands in an era where that contest has gathered immense historical gravity.
Indeed, not merely England, but the entire globe traverses such an epochal threshold. The name of this emergent force is the Market. It is an international power—global in reach and exceedingly swift. The modern nation-state, tempered by the bourgeoisie that rose during England’s Industrial Revolution, finds itself unable to hold its ground before this transnational corporate dominion.
Two centuries ago, when the English bourgeoisie had to wage a simultaneous struggle against the feudal aristocracy on one flank and the working class on the other, it synthesized the aspirations and ideals of both to fashion the model of the Welfare State. The bureaucratic apparatus driving this state was feudal in design, while its stated ideals were socialist. For instance, the welfare state promises a pension to a disabled worker; yet to submit that application and secure the relief, the claim must traverse innumerable bureaucratic ramparts.
No matter how lofty its socialist proclamations, the hollow core of the welfare state becomes painfully apparent the moment it meets practical reality. All the statecraft and strategic cunning in which English wisdom took pride for generations—devising compromises to stave off a proletarian revolution—now ring hollow before the relentless logic of the market.
Its expensive standards of living, the loss of colonies, dwindling material resources, sluggish economic growth, vigorous competition surging from developing nations, unemployment, and an aimless younger generation—England confronts perhaps the most agonizing crisis in its modern history.
This crisis is precipitating a sharp polarization. At one pole stand those who insist that England must integrate into the global market, liberalize without hesitation, and embrace the vision of a unified Europe. At the opposing pole are those who urge that England, retaining its sovereignty and imperial memory, should remain a free-trade island along the lines of Hong Kong. Both arguments possess distinct strengths and vulnerabilities.
And caught in the middle rests the Royal Family.
There are those who view the British monarchy as an archaic obstacle to a united Europe and demand its abolition. On the other side are those who, pointing to Queen Elizabeth II standing steadfast amidst collapsing values at home and abroad, revere her as a beacon of hope for preserving familial and social integrity. The former are termed Euro-visionaries; the latter, Eurosceptics.
Today’s England is no longer the England of the Victorian era. It is no longer the British Empire upon which the sun never set. In politics, in society, and in literature, no towering titans stride the earth today. The era of subjugating the globe has vanished into history.
This is the postmodern age. The age of computers. The epoch of the Third World, of Malaysia and Singapore; the era of Aung San Suu Kyi and Nelson Mandela. In the daily life, art, and literature of contemporary England, this fracture shows itself plainly. On one side lies a resplendent past, a landscape of towering, distant summits. On the other side stand immediate crises, an anxious brooding over the future, and an urgency to preserve a dignifying place in the assembly of nations. A lingering ambition endures to somehow charm the world and sway the minds of nations; yet against this ambition rises an opposing plea: Is it not enough if we set our own youth on the right path? Is it not enough if we can ensure food for our own children?
Featured image: Photography by Max W via pexels.com
14-10-2026


బతుకమ్మ డెస్క్ లో పనిచేస్తున్నప్పుడు ఒక సబ్ ఎడిటర్ చక్కటి ప్రశ్న వేశారన్న.
ఎవరినైనా ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లాల్సి వచ్చినప్పుడు వారికి మన వివరాలు చెప్పిందాన్ని బట్టి స్పందిస్తారు. పాత్రికేయుడి, పేరు ( చాలాసార్లు అది కులం జాడను పట్టిస్తుంది కనుక), హోదా, పత్రిక ప్రతిష్టను బట్టి స్పందిస్తారు. చిన్న పత్రికలకు ఒక రీతిలో పెద్ద పత్రికలకు మరో పద్ధతిలో స్పందిస్తూ ఉంటారు. అసలు విలేఖరి కాకుండా ఒక మనిషిగా ఇంకొక మనిషితో ఏ ప్రయోజనం సాకు లేకుండా లేకుండా హృదయపూర్వకంగా సంభాషించాలంటే మన దగ్గర అసంభవం కదా” అన్నారు. ఆ ప్రశ్న నన్ను ఎప్పటికీ వెంటాడుతూ ఉంటుంది.
ఒక మనిషి మరొక మనిషితో నెరిపే సంబంధ బాంధవ్యాల్లో దేశం ప్రాంతం కులం మతం ఆర్థిక స్తోమత – ఇవన్నీ ముఖ్యమవుతాయి. అలాంటిది మొదటి ప్రపంచానికి చెందిన నాగరిక దేశమైన ఇంగ్లాండ్ తృతీయ ప్రపంచమైన భారతం మధ్య పోల్చలేనంతటి అగాధం ఉండడం ఆశ్చర్యమేమీ కాదు. అక్కడి మనుషులు ఇక్కడి మనుషుల మధ్య తారతమ్యం సానుకూల విషయమే అయినప్పటికీ అది విపరీతమే అనే అనుకుంటాను. ఒక సివిల్ సొసైటీకి ఇంకా పౌరుడిగా అన్న సంగతి పక్కన పెట్టండి, కనీసం సాటి మనిషిగానే గుర్తింపు, గౌరవం లేని వాడికి మధ్య ప్రవర్తన రీతిల్లో తేడా ఎంత ఎంత వైవిధ్యంగా ఉంటుందో!
మీరు అక్కడి మనుషుల సంస్కారం గురించి, ఔదార్యం గురించి, అది సామూహిక చేతనగానే మీకు కనిపించినందున, ఆ విషయాలు ప్రస్తావించినప్పుడు ఈ విషయం బాధగా గుర్తొచ్చింది.
అవును. ఆ మనుషుల ఔదార్యం వాళ్ళ సంస్కృతిలో, సంస్కారంలో, నాగరికతలో ఒక భాగం కావడం నన్ను చాలా ఆశ్చర్యపరిచింది.