వారిలోని స్త్రీ నాచేతిలో కాటలాగ్ చూసి నా దగ్గరకు వచ్చి 'నేనీ ప్రదర్శన తలాతోకా ఏమీ అర్థం చేసుకోలేకుండావున్నాను, కాస్త ఆ పుస్తకంలో ఏముందోచూపిస్తావా' అని, అక్కడితో ఆగకుండా 'నిన్ను చూస్తుంటే ఇదేదో కొంత బోధపడ్డవాడిలాగే కన్పిస్తున్నావు, దీని గురించి నాకేమన్నా చెప్పగలవా?' అని కూడా అడిగింది.
