
13
విట్ వర్త్ ఆర్ట్ గాలరీ
ఆదివారం యూనివర్సిటీ కాంపస్లోఉన్న విట్వర్త్ ఆర్ట్ గాలరీని చూడటంకోసమే కేటాయించుకున్నాను. విట్వర్త్ ఇంగ్లాండ్‌లోని అంతర్జాతీయ ప్రసిద్ధిపొందిన గాలరీల్లో ఒకటి. నీటిరంగుల చిత్రాలు, టెక్స్ టైల్స్, వాల్పేపర్లు, ఇంగ్లీష్ చిత్రకారుల, శిల్పుల, శాశ్వత ప్రదర్శనతోపాటు ఎప్పటికప్పుడు ఏర్పాటుచేసే ప్రత్యేక ప్రదర్శనలుకూడా ఉంటాయి. ఆరోజు పీటర్ బ్లేక్, విలియం టిల్లర్ల చిత్రకళా ప్రదర్శన, మేరియన్ డార్న్ డిజైన్ల ప్రదర్శన గాలరీలో ముఖ్య ఆకర్షణ.
ఈ చిత్రాల్లో బ్లేక్ యూరోపియన్ చిత్రకళా చరిత్రలో క్లాసికల్ కృతులు అనదగిన చిత్రాల్ని ఆధునిక అత్యాధునిక జీవితచిత్రాలలో మిళితం చేశాడు. ‘మడోన్నా ఆఫ్ వెనిస్బీచ్’ అన్న చిత్రంలో వెనుక ప్రీ-రాఫెలైట్ సంప్రదాయంలో చిత్రించిన మేరీమాత ఉండగా ముందు భాగంలో మడోన్నా నల్లకళ్ళద్దాలు, బికినీ ధరించి స్కేటింగ్ షూస్‌తో బీచిపైన సాగుతున్న దృశ్యం ఉంటుంది. క్లాసికల్ కృతుల్నీ, వర్తమాన జీవితదృశ్యాల్నీ వెక్కిరింతలాగా మిళితం చేసిన ఈ చిత్రాల్లో ఎంతో గాఢత ఉంది.
వర్తమానజీవితం, గతజీవితంలాగా వైభవోపేతం కాదు. జీవితాన్నీ, కళనీ సమూలంగా మార్చగలిగిన సమున్నతమానవులు జీవిస్తున్న యుగం కాదిది. జీవితంలోనూ కళలోనూ కూడా విశిష్టవ్యక్తులకి స్థానం తగ్గిపోతున్నది. అత్యధిక సంఖ్యాకులు పబ్లిక్ జీవితంలోలోకి ప్రవేశించిన ఈ కాలంలో కళ అందరికీ అర్థమయ్యే భాషని మాట్లాడవలసి ఉంటుంది. అందరికీ బోధపడే సార్వత్రికసంకేతాల్ని రూపొందించవలసిఉంటుంది. కాని ఈ భాషకోసం, ఈ సంకేతాలకోసం అన్వేషించగలిగే తీరిక కలిగిన కళాకారులుకూడా లేరు. ఒకవేళ ఆవిధంగా అన్వేషించినా ఈ కొత్తసంకేతాల్లో పాతసంకేతాల గాఢత్వం, ఉదాత్తత ఉండకపోవచ్చు. ఒకవేళ ఆ స్థాయిలో సంకేతాలు రూపొందించినప్పటికీ ఈ లోగా కాలం మారిపోవచ్చు. జీవితంలో కొత్తవస్తువులు, కొత్తభావనలు ఉప్పెనలాగా వచ్చిపడవచ్చు. కాబట్టి కళాకారుడు తను చూస్తున్నదాన్ని సత్వరమే సాంకేతికస్థాయికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తాడు. నల్లకళ్లద్దాలు, బికినీ, స్కేటింగ్ షూస్ ఇవే ఆధునిక కవిసమయాలు. బహు సంఖ్యాకులకు నిత్యగోచరాలు అయినప్పటికీ కళాకారుడికి గతం, గతంలోని గంభీరాకృతులు సదా గుర్తుంటూనే ఉంటాయి. అవి అతని అంతరంగాన్ని ఒత్తిడి చేస్తుంటాయి.
కాబట్టి నిజమైన కళాకారుడు ఏకకాలంలో గతంలోనూ వర్తమానంలోనూ కూడా జీవిస్తుంటాడు. పవిత్రమయినదాన్నీ, పనికిరానిదాన్నీ కూడా ఏరుకుంటాడు. ఉదాత్తమయినదాన్నీ, అప్రధానమయినదాన్నీ కూడా పట్టించుకుంటాడు. ఈ సంఘర్షణనే బ్లేక్ చిత్రాలుగా మలిచాడు. ఇందులో వ్యంగ్యం వుంది, తన వర్తమానం పట్ల ఏవగింపు ఉంది. అయినప్పటికీ తన అనుభవం, గతంతో పోలిస్తే అదెంత సంకుచితంగా కన్పించినా, దానిపట్ల గౌరవం ఉంది. ఆ రకంగా బ్లేక్ సాధారణ బ్రిటిష్ పౌరుడికీ, బ్రిటిష్ కళాకారుడికీ కూడా ప్రాతినిధ్యం వహించేవాడిగా కన్పించాడు.
బ్రిటిష్ లాండ్స్కేప్ చిత్రకారుల్లో ప్రఖ్యాతుడైన విలియం టిల్లర్ నలభైయేళ్ళ (1956-96) కృషిపైన రిట్రాస్పెక్టివ్ కూడా ఉంది. టిల్లర్ నీటిరంగుల్తో నైరూప్య అభివ్యక్తి గురించి పడిన తపన మనకి అర్థమవుతున్నప్పటికీ దాన్ని స్పష్టంగా మాటల్లో వివరించడం కష్టం. ఆయన రంగుని సూక్ష్మ, ఆంతరంగిక సంవేదనాస్థాయిలో సమీపిస్తాడు. మృదుల కోమలమయిన కవిత విన్నప్పుడు హృదయంలో చెలరేగే నిరాకారసంవేదనల వంటి వాటిని తన రంగుల ద్వారా మనలో జాగృతపరిచే ప్రయత్నం చేస్తాడు. లాండ్స్కేప్ పెయింటర్‌గా టిల్లర్ని ప్రకృతిలోని రేఖాకృతీ, రంగూ సమంగా ఆకర్షించి వుండాలి. అతను లాండ్స్కేప్ని దృశ్యంగాకాక అనుభూతిగా గుర్తుపెట్టుకోవడం నేర్చుకున్నాడు. వసంతకాలపుఉదయం ఒక అడివిఅంచున ఒక సరోవరాన్ని చూసామనుకోండి. చిత్రకారుడు ఆ దృశ్యాన్ని తిరిగి ఇస్తున్నప్పుడు ఆ రేఖాకృతుల్ని ఇవ్వడం ఒక పద్ధతి. అలాకాక నీలిమ, ఆకుపచ్చదనం, పత్రం, పుష్పం – వీటినిమాత్రమే చిత్రించి వదలడం టిల్లర్ పద్ధతి. ‘వెస్ట్ వుడ్ స్టడీషీట్’ అన్న చిత్రంలో మనకి కనిపించే తేజస్సు, ప్రకాశం, కోమలచలనం, సమ్మేళనం, విశ్రాంతి, ప్రకృతిని చూసినపుడు మనకి కన్పించే దృశ్యంగాకుండా ఆ దృశ్యంతో మనం తాదాత్మ్యం చెందినప్పటి సుకుమారజాగృతిగా మనకి బోధపడుతాయి.
డిజైనింగ్‌కి కళాత్మకతని సాధించిన డిజైనర్ మారియన్ డార్న్ (1896-1964) జీవితకాలపు కృషిపైన ‘మాడర్నిజమ్, ఆర్ట్’ అన్న పేరిట విశిష్టమైన ప్రదర్శన ఏర్పాటుచేశారు. డార్న్ కాలిఫోర్నియాలో జన్మించింది. ప్రపంచయుద్ధాల మధ్యకాలంలో లండన్‌లో పనిచేసింది. ఇంగ్లీష్ డిజైనింగ్‌లో ఆద్యుడని చెప్పదగిన కవీ, చిత్రకారుడూ విలియంమోరిస్ తరువాత అంత ప్రసిద్ధి చెందిన కళాకారిణి మారియన్ అని విమర్శకులు పేర్కొన్నారు. ఈ ప్రదర్శనలో డార్న్ డిజైన్ చే సిన వివిధరకాల టెక్స్ టైల్ నమూనాలు, ఎంబ్రాయిడరీ, ఇంటీరియర్ డెకొరేషన్, రేఖాచిత్రాలు, సేకరణలు ఉన్నాయి.
ఆమె రూపకల్పన చేసిన వివిధరకాల రగ్గులు, దుప్పట్లు, సోఫాస్ప్రెడ్లు, వాల్పేపర్లు, గ్రాఫిక్స్ చూస్తూవుంటే వ్యాపారప్రపంచంలో ఆ కళాకారిణి ఎటువంటి నిరంతర సౌందర్యావిష్కరణకు పూనుకుందో బోధపడి విస్మయపడ్డాను. ఆమెని ప్రపంచంలోని విశిష్టాకృతి ప్రతి ఒక్కటీ ఆకర్షించింది. కన్స్యూమర్ని కళారాధకుడిగా చూడటానికి ఇష్టపడి, ఆమె డిజైన్ చేసింది. ఆధునికజీవితంలోని యాంత్రికత వల్ల దృశ్య ప్రపంచంలో వక్రత స్థానంలో చోటుచేసుకున్న సరళత ఆమె ప్రధాన ఇతివృత్తం. చతురస్రాలు, దీర్ఘచతురస్రాలు, సరళరేఖలు వివిధడిజైన్లుగా రూపుదిద్దుకున్నాయి. గదుల్లో, విమానాల్లో, సమావేశస్థలాల్లో, హోటల్సూట్లలో సీట్లు, పరుపులు, సోఫాలు, బల్లలు, మనుషుల ఏకాగ్రతని భంగం చెయ్యకుండా వారిని ఆకర్షించే విధంగా సారళ్యంతో కూడుకున్న డిజైనింగ్‌ను ఆమె సదా నిత్యనవీనంగా ఆవిష్కరించడానికి ప్రయత్నించినట్లు గమనించాను.
ఆమె థీమ్స్, మోటిఫ్స్ లో ఆకులూ, పక్షులూ ప్రధానంగా కనబడతాయి. యాంత్రికజీవితపు లోపలిగదుల్ని అలంకరించడానికి, అంతరించిపోతున్న ప్రాకృతిక సాన్నిహిత్యాన్ని ఆమె మనుషులకు దగ్గరగా తీసుకురావడానికి, కృషి చేసింది. ఆమె సృష్టించిన ఆకుల్లో ప్రకృతిలోని ఆకుతనంతోపాటు యంత్రంలోని యూనిఫార్మిటి కూడా కనబడింది. ఇది ఆధునికకళాకారుడి నిజమైన ఆకాంక్ష. అతడు ప్రకృతినీ, యంత్రాన్నీ సమంగా అభిలషించాడు. నవ్యతా, నిర్వక్రతా ఏకకాలంలో కావాలి అతనికి. పోస్ట్ మాడర్నిజమ్ బయట పెట్టేదాకా ఈ ఆకాంక్షలోని అమానుషత్వం ఆధునికయుగ కళారూపాలన్నింటినీ ఆవహించేవుంది. కాని డార్న్ స్త్రీ కావడంవల్ల, ఆమె వ్యక్తిత్వంలోని, అభిరుచిలోని ఫెమినైన్టచ్ ఆమె కళారూపాల్ని యాంత్రికరూపాలుగా కాకుండా ప్రాకృతికరూపాలుగానే కన్పించేట్టు చేసిందనిపించింది.
యంత్రం మానవఅంతరంగాన్ని ప్రభావితం చేసిన తీరు ఆధునికసాహిత్యాన్నీ, కళనీ మొదట్నుంచీ వెంటాడుతూనే ఉంది. బహుశా గాంధీ వంటి ఏ ఒకరిద్దరు బలవంతులైన మానవులో తప్ప పందొమ్మిది, ఇరవయి శతాబ్దాల్లో యంత్రాల ఆకర్షణకు లోనుకాని మానవుడు కన్పించడు. ముఖ్యంగా యూరపియన్యంత్రాలు, వాటి బృహత్ప్రమాణాల్తో, ఇనుము, ఉక్కు లోహాకృతులతో మానవజాతిని మెగలోమానియాక్‌గా మార్చేసాయి. ఇరవయ్యో శతాబ్దపు చివరి దశాబ్దాల్లో కంప్యూటర్లు విజృంభించినదాకా బయటి స్థలంలో రాక్షసాకారాల్తో ప్రతిష్ఠించబడ్డ యంత్రసామ్రాజ్యం మానవుడి ఆలోచనానుభూతుల్లో తెచ్చిన మార్పు అపారం.
యంత్రపూర్వ సమాజాల్లో, అరణ్యసమాజాల్లో మనిషి ఆశ్చర్యపరుడు. యంత్రసమాజంలో మనిషి విధేయపరుడు. మరొక ఆలోచన లేకుండా యంత్రాన్ని అనుసరించడమే అతని విధ్యుక్తధర్మం. గడియారాన్ని, సిటీబస్ని, రైలింజన్‌ని, సినిమా ప్రొజెక్టరును, టి.విని, ప్రింటింగ్ మెషినరిని, చివరికి, రాజ్యయంత్రాంగాన్ని అనుసరించకుండా అతనికి గత్యంతరం లేదు.
ఇటువంటి యంత్రాకృతుల్లోని ఫార్మ్ ని, మెటఫర్ని చూడగలిగేలా మన దృష్టిని మళ్లించగల శిల్పప్రదర్శన జాన్ గిబ్బన్స్ ది (1949). గిబ్బన్స్ ఐరిష్ జాతీయుడు. లండన్ సెంట్మార్టిన్స్ స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో విద్య నభ్యసించాడు. సర్ ఆంథోనీ కేరో వంటి శిల్పిదగ్గర అప్రెంటిస్‌గా పనిచేశాడు. ప్రస్తుతం వించెస్టర్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ శిల్పవిభాగానికి అధిపతిగా ఉన్నాడు. బహుశా హెన్రీమూర్ తర్వాత బ్రిటిష్ ఆధునిక శిల్పుల్లో జాన్ గిబ్బన్స్ లోనే ప్రగాఢమైన నవ్యతని చూడగలిగాను.
అతని శిల్పాలు ఉక్కుపైపులు, మెష్‌లు, రాడ్లు, సిలిండర్లు ఉపయోగించి ఎసెంబుల్ చేసినవి. ప్రతి ఎసెంబ్లేజ్కి ఒక పేరు పెట్టాడు. ఆ పేరులో ఒక మెసేజ్ ఉంటుంది. కాని ఆ నిర్మాణం నుండి సరాసరి అదే అర్థం వస్తుందని చెప్పలేం. బహుశా ఆ శిల్పికి మటుకే ఆ నిర్మాణం అటువంటి అర్ధాన్ని ధ్వనింపచేస్తుందన్నా ఆశ్చర్యం లేదు. కాని అదే అర్థం మనకు బోధపడకపోయినా ఆ శిల్పాలు అర్థరహితాలు అనలేం. వాటినిచూడగానే చప్పున విచిత్రమైన సంవేదనలు కలుగుతాయి. మొదటిసారిగా సైకిలు రిపేరింగ్షాప్ నీ , గాలిపంపునీ, వాచ్ రిపేరర్ని చూసినపుడు నాలో ఎటువంటి సంవేదనలు కలిగాయో గిబ్బన్స్ కృతుల్ని చూసినప్పుడూ అటువంటి సంవేదనలే కలిగాయి.
సహజసుందరమయిన గ్రామారణ్యఛాయల్లో ఒకనాడు యంత్రాలు రేపిన దుమ్ము మన కళ్లల్లో పడటం నేడు మనం మళ్ళీ గుర్తించవచ్చు. ఉక్కు కాంక్రీటు స్తంభాలు, లాడర్లు, ఇనుపతలుపులు, రైలుపట్టాలు, ఇండ్లకిటికీలు, పొగగొట్టాలు, కన్వేయర్బెల్టులు, ఇంజన్లు, పిస్టన్లు, వాటి సమస్త రిథమ్స్ తో మన జీవితం ఎల్లెడలా ఇనుప చట్రాన్ని అల్లి ఉన్నాయి. వాటిలో మన అంతరంగం వెదుక్కుంటున్న నిర్వక్ర సౌందర్యాన్ని గిబ్బన్స్ చూపిస్తున్నాడు. కాని అతని వర్క్ వల్ల మరో విషయం కూడా బోధపడింది, బృహత్ యంత్రయుగం మానవ చరిత్రలో ముగింపుకి వచ్చిందని. కళాకారుడు ఎప్పుడయితే యంత్రాన్ని దాని యుటిలిటీ నుండి విడదీసి ఆర్ట్ ఫార్మ్ గా చూడగలిగేడో, మెటఫర్‌గా చూపగలిగాడో అప్పుడే అతను దాని ప్రాభవానికి ముగింపు మాటలు చెప్పేసినట్టు.
ఇప్పుడు యంత్రభూతం నిజంగానే భూతకాలవిషయమైపోయింది. కళాకారుడు ఇంద్రజాలికుడిలాగా ఆ భూతాన్ని పట్టి బంధించి గదిలోపెట్టి చూపిస్తున్నాడు. కానీ ఇది మామూలు మనుషులకి అనుభవంలోకి రావడానికి ఇంకా ఏళ్లుపడుతుంది. నేను గిబ్బన్స్ గురించి గాలరీ కాటలాగ్ చదువుతుంటే నడివయసు బ్రిటిష్ స్త్రీ పురుషులిద్దరు ఆ ప్రదర్శననిచూస్తూ అటుగా వచ్చారు.
వారిలోని స్త్రీ నాచేతిలో కాటలాగ్ చూసి నా దగ్గరకు వచ్చి ‘నేనీ ప్రదర్శన తలాతోకా ఏమీ అర్థం చేసుకోలేకుండావున్నాను, కాస్త ఆ పుస్తకంలో ఏముందోచూపిస్తావా’ అని, అక్కడితో ఆగకుండా ‘నిన్ను చూస్తుంటే ఇదేదో కొంత బోధపడ్డవాడిలాగే కన్పిస్తున్నావు, దీని గురించి నాకేమన్నా చెప్పగలవా?’ అని కూడా అడిగింది.
13
The Whitworth Art Gallery
I devoted Sunday entirely to visiting the Whitworth Art Gallery, situated right upon the university campus. The Whitworth ranks among England’s internationally renowned galleries, housing permanent collections of watercolors, textiles, wallpapers, and works by British painters and sculptors, alongside regular temporary exhibitions. That day, the principal attractions were an exhibition featuring paintings by Peter Blake and William Tillyer, and a retrospective devoted to the textile designs of Marion Dorn.
In his compositions, Peter Blake juxtaposes canonical masterpieces from European art history against the textures of modern and contemporary life. In his painting The Madonna of Venice Beach, against a background depicting the Virgin Mary in the Pre-Raphaelite idiom, the foreground reveals Madonna in dark sunglasses and a bikini, gliding across the beach on roller skates. In their ironic blending of classical iconography and contemporary street life, these works possess arresting depth.

Contemporary life lacks the monumental grandeur of the past. Ours is no longer an age walked by titans capable of radically reshaping life and art. The sphere reserved for heroic individuals is shrinking in existence and art alike. In an era where the broad masses have entered public life, art is compelled to speak an idiom intelligible to all, fashioning universal symbols accessible to every spectator.
Yet artists scarcely possess the unhurried leisure required to search for such a visual language and its symbols. Even when sought, these modern motifs may lack the transcendent gravity and noble resonance of archaic iconography. And even should symbols of such caliber be forged, time moves on before they can settle, with new objects and shifting ideas crashing in like an overwhelming tidal surge. The contemporary artist therefore endeavors to elevate what he observes immediately into a stylized sign. Dark sunglasses, a bikini, roller skates—these have become the poetic conventions (kavi-samayas) of modernity.
Though these ephemera confront the public gaze daily, the true artist remains haunted by the past and its solemn, monumental forms; they exert an unremitting pressure upon his inner being. The authentic artist thus inhabits the past and the present simultaneously. He sifts the sacred alongside the discarded; he attends to the sublime while taking reckon of the trivial.
It is precisely this psychic tension that Blake embodies on canvas. There is irony here, and a quiet revulsion toward his own contemporary moment; yet there remains an enduring respect for lived experience, however narrow it may appear beside the monumental past. In that sense, Blake struck me as a true representative of the contemporary British citizen and the British artist alike.
Alongside Blake was a forty-year retrospective (1956–1996) dedicated to William Tillyer, one of Britain’s most distinguished landscape painters. While one readily senses Tillyer’s intense yearning to achieve abstract expression through watercolor, it remains difficult to capture that achievement in prose. He approaches color at an intimate, intuitive frequency of perception. Through his washes of pigment, he awakens within us formless, delicate tremors akin to the stirring in the heart when listening to subtle, lyric verse.
As a landscape painter, Tillyer must have been drawn in equal measure by linear form and pure color in the natural world. Yet he learned to remember landscape not as an objective scene, but as pure sensation.
Suppose one looks upon a tranquil lake bordering a woodland on a spring dawn. In recreating that encounter, outlining the trees, the shore, and the water is one method. Tillyer’s method is quite different: he releases pure azure, emerald wash, the suggestion of a leaf, the breath of a flower, and leaves it there.

n a work like Westwood Study Sheet, the radiance, luminous clarity, tender kinetic movement, harmony, and repose reveal themselves not as an external landscape observed from without, but as an exquisite, delicate awakening born of total communion with the scene.
Titled Modernism, Art and Marion Dorn, a major retrospective celebrated the lifetime achievement of Marion Dorn (1896–1964), the designer who elevated industrial decorative textiles into an authentic art form. Born in California, Dorn was active in London during the interwar decades. Critics observed that after the poet-craftsman William Morris, who laid the foundations of modern British design, no designer had achieved such celebrated stature as Marion Dorn.
The exhibition brought together diverse textile patterns, embroideries, interior schemes, line drawings, and working sketches created by Dorn. Examining her rugs, woven blankets, sofa covers, wallpapers, and graphic prints, I stood astonished at the relentless pursuit of visual grace this artist sustained within the commercial domain. Every distinctive natural form captivated her eye. She designed with a desire to see the modern consumer transformed into an admirer of art.

Her central motif was a cultivated simplicity, introduced to replace the intricate curvatures of traditional design in response to the mechanistic realities of modern existence. Squares, rectangles, and crisp linear geometries took shape across varied decorative patterns. In private chambers, aircraft cabins, conference halls, and hotel suites, she sought to renew a minimalist design aesthetic for seating, upholstery, sofas, and tables—captivating the gaze without disrupting human concentration.
Leaves and birds recur as dominant motifs across her patterns. She labored to furnish the inner chambers of a mechanized existence, striving to draw men back into intimate proximity with a vanishing natural world. Within the stylized leaves she fashioned, the organic vitality of nature coexisted with the precision of machine production.
This, indeed, is the true yearning of the modern artist: he desires nature and the machine in equal measure, demanding modernity and rectilinear purity in the same breath. Until postmodernism exposed its contradictions, the dehumanizing weight of this ambition hovered over all modern artistic expressions. Yet because Dorn was a woman, the feminine sensibility embedded within her temperament and taste ensured that her designs registered not as cold mechanical geometries, but as living, organic forms.
The manner in which the machine has shaped human interior consciousness has haunted modern literature and art from the very beginning. With the exception of a few resolute figures like Gandhi, one scarcely encounters a thinker in the nineteenth and twentieth centuries who remained immune to the magnetic pull of the machine.
European machinery, in particular—with its monumental scale and colossal structures of iron and steel—transformed mankind into a collective megalomaniac. Until computers surged across the closing decades of the twentieth century, the empire of the machine, planted in physical space with monstrous proportions, wrought an immense transformation within the emotional and cognitive faculties of man.
In pre-industrial societies and forest communities, man lived in wonder; in the machine age, man lives in obedience. His duty is to follow the machine without second thoughts. He has no choice but to adjust his pace to the clock, the city bus, the railway locomotive, the cinema projector, the television screen, the printing press, and, ultimately, the bureaucratic apparatus of the State.
John Gibbons’ (born 1949) sculpture exhibition redirected our gaze toward the underlying forms and metaphors embedded within these mechanical structures. An Irish-born artist who studied at Saint Martin’s School of Art in London and served an apprenticeship under Sir Anthony Caro, Gibbons currently heads the sculpture department at the Winchester School of Art. Beside Henry Moore, it was perhaps in John Gibbons that I encountered the most profound creative renewal among contemporary British sculptors.
His sculptures are assembled from industrial steel pipes, wire mesh, iron rods, and metal cylinders. To each assemblage he attaches a title bearing a suggestive message; yet one cannot claim that the sculptural construction yields a literal, direct meaning. It would hardly be surprising if that construction carried such private associations for the sculptor alone.

Yet even if that explicit meaning eludes us, one cannot dismiss these sculptures as meaningless. Looking upon them, strange, visceral associations stir at once within the mind. The sensations awakened within me as I stood before Gibbons’ works were identical to the emotions I felt in my boyhood when I first encountered a bicycle repair shop, a manual air pump, or the fine gears on a watchmaker’s table.
Today, we can recognize once more how the dust churned up by machines in the pristine shadows of forest hamlets settled into our very eyes. Steel pillars, concrete girders, ladders, iron gates, railway tracks, window frames, factory chimneys, conveyor belts, engines, pistons—with their relentless rhythms, they have woven an iron cage around our entire existence. In these very forms, Gibbons unveils the clean, rectilinear beauty that our inner sensibility secretly seeks.
Yet his work revealed something further: that the heroic age of titanic machinery has drawn to its historical close. The moment an artist detaches the machine from its raw utilitarian function and learns to behold it as an art form—rendering it as a poetic metaphor—he has already pronounced the closing words upon its absolute dominion.
The mechanical behemoth has now truly become a creature of the past. Like a sorcerer, the artist has captured that phantom, entrapped it within a gallery, and put it on display. Yet for ordinary humanity to fully realize this truth will take decades more.
As I stood reading the gallery catalogue on Gibbons, a middle-aged British couple came walking past, viewing the exhibits. Seeing the catalogue in my hand, the woman stepped up to me and said:
“I can make neither head nor tail of this exhibition. Would you mind showing me what is written in that booklet?”
Then, looking at me closely, she added:
“Looking at you, you seem like someone who has understood something of this. Could you tell me a little about what it means?”
Featured image: Photography by Abdel Achkouk via pexels.com
15-6-2026


ఈ పోస్ట్ చదువుతుంటే, ఇటువంటి ఆర్ట్ గ్యాలరీలకు మీ వంటి కళాకారులు, సాహిత్యాభిమానులు దర్శించినప్పుడే నిజమైన సార్థకత చేకూరుతుందనిపించింది.
With your deep and wide ranging appreciation of art, literature, and life, I imagine these exhibitions must have offered you many new and enriching experiences. Not surprising that the Brit lady identified that and asked for your insights. 🙏🏽