మహాత్ముణ్ణి చూసిన క్షణాలు-15

రైలు ఆగిన ప్రతి స్టేషన్ లోనూ మేం బోగీల్లోంచి ‘మహాత్మా గాంధీకి జై’ అని గట్టిగా అరిచాం. ప్లాట్‌ఫారమ్‌మీద వేచి ఉన్న ప్రయాణికులు కూడా ‘మహాత్మా గాంధీకి జై’ అంటూ బదులిచ్చారు. నాటి భారతదేశంలో మహాత్మా గాంధీ అనే ఒక్క పేరు సామాన్య ప్రజానీకాన్ని ఎంతగా ఉత్తేజపరిచిందో, ఎంతటి అనురక్తిని నింపిందో చెప్పడానికి ఈ సంఘటనే ఒక నిదర్శనం.