మహాత్ముణ్ణి చూసిన క్షణాలు-16

కానీ ఆయన చిరునవ్వు చూడగానే మాత్రం ఆయన నాకెంతో అందంగా కనిపించారు—ఎంతటి దయార్ద్రభరితమైన, విశాలమైన, మధురమైన చిరునవ్వు! చుట్టూ ఉన్న జనం నుండి ఆయన వైపు వెల్లువెత్తుతున్న భక్తిప్రపత్తుల తరంగాన్నీ, ఆయన్నుండి పెల్లుబుకుతున్న అపారమైన తేజస్సునూ, కరుణామృత ధారనూ మాత్రమే నేను అనుభవపూర్వకంగా గ్రహించగలిగాను.