మహాత్ముణ్ణి చూసిన క్షణాలు-10

అందుకని గాంధీజీ ఆయన్ను నేరుగా కాజీపట్నాకు రమ్మనీ, అక్కడ అవసరమైతే అతడి రక్షణ కోసం ప్రత్యేక వాలంటీర్లను నియమిస్తామనీ, అతడి అభిప్రాయాల్ని చెప్పుకోడానికి తగిన అవకాశం ఇస్తామనీ సూచించారు. తనకు నల్ల జెండాలు చూపించాలనుకున్న వ్యక్తికి సైతం సహాయం చేయడం కేవలం సత్యారాధకుడికే సాధ్యమవుతుంది!