మహాత్ముణ్ణి చూసిన క్షణాలు-5

చేతిలో డబ్బు లేనివాళ్లు ఒంటిమీద ఉన్న నగలన్నీ తీసి, అక్కడ పరిచిన తెల్లటి దుప్పటిమీద కుమ్మరించారు. అలా దాదాపు అరవై నుండి డెబ్బై తులాల బంగారం మేరకు నగలు పోగయ్యాయి. దానికి తోడు, దాదాపు వెయ్యి రూపాయల నగదు కూడా చకచకా వసూలైంది.