మహాత్ముణ్ణి చూసిన క్షణాలు-8

ఆ తర్వాత సభికుల్ని ఉద్దేశించి, ‘ముందే చెప్పినప్పటికీ మీరు మన అతిథిని అవమానించి తీవ్రమైన అపరాధం చేశారు. కాబట్టి మీ తరఫున నేను భగవంతుణ్ణి క్షమాపణ కోరుతున్నాను’ అన్నారు. నాకు బైబిల్ వాక్యం గుర్తొచ్చింది: ‘ఓ తండ్రీ! వీరిని క్షమించు. వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు!’