మహాత్మా గాంధీ భారతదేశానికి వచ్చిన తరువాత 1921 లో మొదటిసారి ఒరిస్సా పర్యటించారు. అప్పణ్ణుంచీ 1946 దాకా, ఆ మధ్యకాలంలో, మొత్తం ఏడుసార్లు ఒరిస్సాలో ఆయన పర్యటించారు. ఆ సందర్భంగా ఆయన్ని చూసినవాళ్ళూ, కలుసుకున్నవాళ్ళూ, మాట్లాడినవాళ్ళూ, ఆ తర్వాత తమ తమ ఆత్మకథల్లోనో లేదా జ్ఞాపకాల్లోనో ఆ క్షణాల్ని తలుచుకున్న విశేషాలకు సంబంధించిన వ్యాసాలు అవి.
