గాంధీజీ, 'బుద్ధభగవానుడూ, చైతన్యమహాప్రభువూ, శంకరాచార్యుల వంటి మహనీయులకి ఈ పాశ్చాత్య విద్యతో పరిచయమే లేదు. వారితో పోలిస్తే నేనెక్కడ? అసలు ఆ పాశ్చాత్య విద్యా సంపర్కమే లేకపోయి ఉంటే నేను మరింత ఉన్నతుడిగా మారి ఉండేవాణ్ణి అని అనుకుంటున్నాను ' అని జవాబిచ్చారు.
