నా ఇంగ్లాండ్ యాత్ర-8

ఏంకొనాలో, ఏం చూడాలో, ఎటుపోవాలో తేల్చుకోలేని జనసందోహపు వీథుల్తో, అన్నీ కొంటున్న, అన్నీ చూస్తున్న, అన్ని దిక్కులకూ నడుస్తోన్న సహస్ర పథగామిగా లండన్ కన్పించింది. ఆ మానవ కంఠధ్వనుల్లో కరిగి ముద్దవుతూ నన్ను నేను మర్చిపోయాను.