ఎక్కడకు వెళ్ళినా ఈ లోయల్లో మైదానాల్లో మనకన్నాముందు నడిచి వెళ్ళినవాళ్ళ అడుగుజాడలు కన్పిస్తుంటాయి. నార్మన్ దండయాత్రలు, బ్రిగాంటియన్ జాతులు, రోమన్ సైనికశ్రేణులు, చేనేతపనివాళ్ళు, రైతులు, పారిశ్రామికవేత్తలు, సీమపొడుగునా ప్రకృతి, చరిత్ర పెనవేసుకున్న గుర్తులు, సాహిత్యజ్ఞాపకాలు, సెలవుదినాల సంరంభాలు.
