నా ఇంగ్లాండ్ యాత్ర-5

11

హావర్త్

మేం ఉన్న రోజుల్లో వీకెండ్స్‌ లో ముఖ్యమయిన స్థలాల్ని చూడాలనుకున్నాం. ఇంగ్లాండ్‌లో టూరిజం, ట్రావెల్ నిర్వహణ చాలా ప్రొఫెషనల్‌గా, ఎంతో వీలుగా, సౌకర్యంగా ఉంటాయి. మా ట్రావెల్ కన్సల్టెంట్ మాకు నేషనల్ ఎక్స్‌ ప్రెస్ కంపెని వారి ట్రావెల్ ఎరేంజ్మెంట్స్ కేటలాగ్ ఇచ్చి మాకున్న రెండు వీకెండ్స్‌ లో ఒకటి పల్లెప్రాంతం చూడడానికీ, మరొకటి లండన్ చూడటానికీ కేటాయించుకొమ్మని చెప్పింది.

పల్లెప్రాంతం లేదా దేశప్రాంతంలో మాముందు ఆప్షన్స్ చాలానే ఉన్నాయి. వర్డ్స్‌ వర్త్ ఎంతో ప్రేమించిన లేక్‌డిస్ట్రిక్ట్, షేక్స్పియర్ పుట్టిన స్ట్రాట్‌ఫర్డ్-ఆన్-ఏవన్‌లో ఏదో ఒకటి చూడాలని ఎంతో అనుకున్నాను. ట్రావెల్ కన్సల్టెంట్ ఎడింబరో వెళ్ళమని సలహా ఇచ్చింది. స్కాట్లాండ్‌కి చెందిన ఎడింబరో పురాతన దుర్గాల, బేగ్‌పైపర్ల, ప్రాచీన రాజదర్బారుల నగరం. ఉన్నవ లక్ష్మీనారాయణగారు ఎడింబరో యూనివర్సిటీలోనే చదువుకున్నారు. కానీ గ్రామసీమలకు ఎక్కడికి వెళ్ళినా కనీసం రెండురోజులు ఉండవలసి వస్తుంది.

మా మొదటివారాంతంలో మలేషియా ప్రయాణం కూడా ఉన్నందువల్ల మేం విండర్మీర్‌గానీ, ఎడింబరోకి గాని, ఏవన్‌తీరానికిగాని వెళ్లలేకపోయాం. కాని ఇంటర్నేషనల్ సొసైటీవారు ఏర్పాటుచేసిన వీకెండ్ ట్రావెల్‌లో హావర్త్, బ్రాడ్‌ఫర్డ్‌ కి పోయిరావడం ద్వారా ఇంగ్లీషు దేశప్రాంతాన్ని చూడాలన్న మా కోరిక సంతోషంగా నెరవేరినట్లయింది.

సెలవురోజు తీరిక ఉదయంలో యార్క్‌ షైర్ సీమ అంచుల్లో ఆకుపచ్చని పచ్చిక దిబ్బల నడుమ వెచ్చనిఎండకి చేతులు జాపిన ఇంగ్లీషుగ్రామాన్ని చూడటం నిజంగా ఒక అనుభవం. రాళ్లపలకలు పొదిగిన సన్నని గ్రామవీథులు, నునువెచ్చని ఎండ పసుపుదనాన్ని అలముకొన్న గాజుఅద్దాల కిటికీలు, లోపల మెల్లమెల్లగా కదుల్తున్న పల్చని తెల్లని లేసుపరదాలు, విండోసిల్స్‌లో పెట్టిన చిన్నిచిన్ని ఫ్లవర్‌పాట్స్, బయట గుమ్మాల దగ్గర కుండీల్లో విరిసిన పచ్చని ఆకులు, పూలు, గాలి అంతటా ఆవరించిన వెచ్చదనం, పండ్ల దుకాణాలు, కేఫ్‌లు, పచ్చికబయలు నడుమ విరిసిన పుష్పశయ్యలాంటి హావర్త్‌ ని చూడగానే మాంచెస్టర్ సిక్‌నెస్‌లో కూరుకుపోయిన నాకు ప్రాణం లేచివచ్చినట్టనిపించింది.

పచ్చికమూర్ల నడుమ ఆ వూరు పురాతన మధ్యయుగాల దుర్గంలాగా వుంది. పడిపోతున్న రాతిగోడలు, విస్తారమయిన పచ్చికబయళ్ళు, ఆకులు రాలిపోయిన కొమ్మలు, పచ్చిక మేస్తున్న గొర్రెలు, మైళ్లకు మైళ్ళు శూన్యం, పసుపురంగు, నిస్తేజం – అయినప్పటికీ వాటిమధ్యనే ఒక ఆహ్వానం వినవస్తుంటే, మేం చేసిన ప్రయాణంలోంచి ప్రశాంతమయిన ఆ గ్రామం ఆకుపచ్చని ఎడారిలో ఒయాసిస్‌లాగా సేదదీర్చింది.

వాలెస్ స్టీవెన్స్ ‘సండే మార్నింగ్’ కవితలో ఉపమించినట్టుగా ఆ ఉదయం చిన్న గలగల కూడా లేని జలరాశిలాగా తీరికగా ప్రశాంతంగా చేరదీసుకుంది. దూరంగా లంకాషైర్‌కి యార్క్‌ షైర్‌కి నడుమ సేతువు నిర్మించుకున్నట్లుండే దక్షిణ పెన్నైన్ పర్వతశ్రేణి. ఆ కొండలు మనకి కొన్ని శతాబ్దాల వెనుకటి ప్రపంచాన్ని గుర్తు చేస్తున్నట్టుంటాయి. ఎక్కడకు వెళ్ళినా ఈ లోయల్లో మైదానాల్లో మనకన్నాముందు నడిచి వెళ్ళినవాళ్ళ అడుగుజాడలు కన్పిస్తుంటాయి. నార్మన్ దండయాత్రలు, బ్రిగాంటియన్ జాతులు, రోమన్ సైనికశ్రేణులు, చేనేతపనివాళ్ళు, రైతులు, పారిశ్రామికవేత్తలు, సీమపొడుగునా ప్రకృతి, చరిత్ర పెనవేసుకున్న గుర్తులు, సాహిత్యజ్ఞాపకాలు, సెలవుదినాల సంరంభాలు.

ఆ సన్నని వీధులగుండా నడుస్తూ ఒకటీ అరా దుకాణాల్లో తొంగిచూస్తూ ఒక పూల దుకాణంలో అడుగుపెట్టాం. అక్కడ ఇద్దరు పురుషులు వెచ్చని నెగడి దగ్గర చలికాగుతున్నారు. గ్రామీణ ఇంగ్లాండ్ తీరిక దినమంతా అక్కడ రూపుకట్టినట్టుంది.

‘ఎక్కణ్ణుంచి వస్తున్నారు’ మన గ్రామాల్లో విన్పించే ప్రశ్నలాంటి ప్రశ్న.

ఇండియా నుండి.

ఇండియానా!

వాళ్లలో ఒక వృద్ధుడి కళ్లల్లో ఏదో మెరుపు. సుదూరమైన జ్ఞాపకాన్నేదో గుర్తు చేసుకుంటున్నట్టుగా, అద్భుతాన్ని చూసినట్టుగా, సుగంధద్రవ్యాల ఓడలు మెడిటరేనియన్ జలసంధిని దాటుతున్న దృశ్యాన్ని తలుచుకుంటున్నట్టుగా. మేం ఎందుకొచ్చేమో ఎక్కడుంటున్నామో కూడా చెప్పాను.

‘మీరు ఇంగ్లీషు ఎంతో బాగా మాటాడతున్నారు! ఇంతకుముందు ఎప్పుడయినా ఇంగ్లాండ్‌లో వున్నారా’ అని అడిగాడు అతను. ఎదురుచూడని ఆ కాంప్లిమెంట్‌ని ఆకాశంనుండి రాలిన హంసరెక్కని ఏరుకున్నట్టుగా అందుకుని హృదయంలో భద్రపరచుకున్నాను.

దాదాపు నూటయాభై యేళ్ళ వెనుక ఈ చిన్ని గ్రామంలో ఒక కుటుంబం అద్భుతమైన సాహిత్యజీవితాన్ని జీవించింది. పాట్రిక్ బ్రంటి అనే ఐరిష్ వ్యక్తి గ్రామ చర్చ్ వ్యవహారాలు చూడటానికి 1820 నుండి 61 దాకా హావర్త్‌లో నివాసమున్నాడు. తన ఆరాధ్య హీరో నెల్సన్ డ్యూక్ ఆఫ్ బ్రాంటిగా నియమితుడయినపుడు తన పేరునికూడా బ్రాంటిగా మార్చుకున్నాడు. 1821లో అతని భార్య మేరియా బ్రాన్‌వెల్ తన పిల్లలు అయిదుగురు కూతుళ్లు, ఒక కొడుకుని వదిలి కేన్సర్‌వల్ల మరణించింది. ఆ పిల్లల్లో ఇద్దరు అమ్మాయిలు మేరీ, ఎలిజబెత్ పది, పదకొండేళ్ళ వయసులో మరణించారు.

మిగిలిన ముగ్గురు అక్కచెల్లెళ్ళు, సోదరుడు ఆ గ్రామంలో ఏకాంతజీవితం జీవించారు. ఈ ఏకాంతంలో వాళ్ళు గొప్ప సాహిత్యాభిలాషతో విస్తారంగా చదివారు, రచనలు చేసేరు. ముగ్గురు అక్కచెల్లెళ్ళూ గొప్ప రచయితలుగా ఇంగ్లీష్ సారస్వతంలో గుర్తించబడ్డారు. ముగ్గురిలో చార్లెట్ బ్రాంటికి విశిష్టమయిన పేరు లభించింది. ఆమెది అందరిలోనూ విషాదభరితమయిన జీవితం. ప్రేమవంచితగా, బాధ్యత కలిగిన సోదరిగా ఆమె గడిపిన జీవితం నలభైయేళ్ళు తిరక్కుండానే ముగిసిపోయింది. ఆమె చెల్లెళ్ళు ఇద్దరూ కూడా పక్వం కాకుండానే రాలిపోయిన పిందెలే. ఎమిలీబ్రాంటి ముప్ఫయ్యేళ్ళ వయసులో, అన్నేబ్రాంటి ఇరవై తొమ్మిదేళ్ళ వయసులో మరణించారు.

ఆ పురాతనదేశంలో, ఆ నేత పనివాళ్ళ గ్రామంలో సంపూర్ణమైన జీవితసాఫల్యానికి నోచుకోని ఆ అభిశప్త కుటుంబంలో, ఏకాంతంలో, ఆ ముగ్గురు అన్నాచెల్లెళ్ళు చేసిన సాహిత్యసేవ, ఇంగ్లీషు సాహిత్యంలో అపురూపసంఘటన. ఛార్లెట్ రాసిన ‘జేన్ ఐర్’, ఎమిలీ రాసిన ‘వుదరింగ్ హైట్స్’, అన్నే రాసిన ‘టెనంట్ ఆఫ్ వెల్డ్‌ ఫెల్ హాల్’ యార్క్‌ షైర్ మూర్ లాం డ్స్‌ ని దాని వెలుగునీడల్తో చిత్రించిన రచనలుగా చెప్తారు.

ఈ రోజు హావర్త్ ఆనాటి బ్రాంటి కుటుంబపు బాధానందాలకు సజీవ స్మారకంగా నిలిచిఉంది. ఆనాటి గ్రామచర్చి, ఒక మ్యూజియం, బ్రాంటి కుటుంబపు సమాధుల్తోపాటు వర్త్‌ వ్యాలీ స్టీమ్ రైల్వేలైన్, రైల్వేస్టేషన్ ఆ వూరికి వచ్చిన యాత్రీకులని ఆకర్షిస్తూవున్నాయి.

శుష్కపాండురమయిన ఆ శీతాకాలపు చివరిదినాల్లో ఆ పచ్చికలోయల నడుమ పుష్పశయ్యలాంటి గ్రామవీథుల్లో తిరుగుతూ వందేళ్ళ క్రింద ఆ గ్రామంలో సాహిత్య తపసు చేసిన ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లనీ తలుచుకుంటే నా మనసంతా చెప్పలేని దిగులుతో నిండిపోయింది.


11

Haworth

During our stay, we set aside our weekends to visit key landmarks across the country. In England, tourism and travel management are organized with consummate professionalism, ease, and comfort. Handing us a National Express touring catalogue, our travel consultant advised us to devote one of our two available weekends to the English countryside and the other to London.

When it came to the countryside, a wealth of options lay before us. I nurtured a deep longing to see either the Lake District, so profoundly cherished by Wordsworth, or Stratford-upon-Avon, the birthplace of Shakespeare. The travel consultant suggested Edinburgh—that Scottish city of ancient citadels, bagpipers, and historic royal courts, where Unnava Lakshminarayana once studied at the University of Edinburgh. Yet any journey into these distant rural horizons demanded at least a two-day stay.

Because our upcoming study tour to Malaysia was scheduled right after our first weekend, we could neither make our way to Windermere, nor set out for Edinburgh, nor walk the banks of the Avon. However, through a weekend excursion arranged by the International Society to Haworth and Bradford, our yearning to experience the English countryside found joyful fulfillment.

On a leisurely holiday morning, to behold an English village outstretched under a tender wash of pale sunshine along the edge of the Yorkshire moors, cradled amid rolling green slopes, is an unforgettable experience. Narrow village lanes paved with stone setts; windowpanes washed in the pale amber of mild sunlight; sheer white lace curtains swaying gently within; miniature flowerpots set upon windowsills; potted greens and blossoms flourishing before doorsteps; a pervasive warmth lingering in the morning breeze; fruit stalls, tearooms, and cafés—beholding Haworth nestled like a bed of blossoms amid open pastures, the persistent Manchester malaise that had weighed upon me lifted in an instant, and life surged back into my veins.

Set against the rolling moors, the village looked like a medieval stone sanctuary. Weathered stone walls falling into quiet disrepair, sweeping pastures, bare deciduous boughs, grazing sheep, miles of open emptiness, faded amber tones, and austere stillness—yet an unspoken welcome breathed through it all. Emerging from the strain of our journey, that tranquil hamlet restored our spirits like an oasis set within a verdant wilderness.

As Wallace Stevens evokes in his poem Sunday Morning, that dawn received us with quiet, leisurely stillness—like water without sound. Far off rose the South Pennine range, spanning the divide between Lancashire and Yorkshire like a massive natural bridge. Those brooding heights seem to summon the memory of an ancient world centuries behind us. Wherever one wanders, through valleys and across windswept plateaus, one encounters the layered footprints of those who walked these tracks before us: Norman invasions, Brigantian tribes, Roman legions, domestic handloom weavers, yeoman farmers, and early industrialists. Across the entire tract, nature and history remain inseparably interwoven with literary memories and the quiet rhythms of holiday retreats.

Wandering along those narrow cobbled streets, peering into a shop or two, we stepped inside a florist’s shop. Two men were warming themselves beside a hearth. It seemed as though the unhurried ease of rural England had crystallized right there.

“Where are you from?” one asked—a greeting as familiar as the quiet inquiries heard in our own Indian villages.

“From India.”

“India!”

A sudden sparkle lit up the eyes of the elder man, as though stirred by some far-off memory—as though gazing upon a distant marvel, or recalling fleets laden with rare spices traversing the Mediterranean Straits. I explained why we had come and where we were staying in Manchester.

“You speak such excellent English!” he exclaimed. “Have you lived in England before?”

I gathered that unexpected compliment into my heart like a swan’s feather drifting down from an open sky, keeping it close.

Nearly a century and a half ago, a remarkable family lived an extraordinary literary life in this secluded village. Patrick Brontë, an Irish clergyman, resided in Haworth from 1820 to 1861, tending to the village parish. Having adopted the surname Brontë in homage to his hero, Lord Nelson, who had been created Duke of Bronte, he took up the perpetual curacy here. In 1821, his wife, Maria Branwell, succumbed to cancer, leaving behind five daughters and an infant son. Two of those young girls, Maria and Elizabeth, died while still children of ten and eleven.

The surviving three sisters and their brother lived out their days in rural seclusion. In that solitude, nourished by a fierce passion for literature, they read voraciously and wrote without cease. All three sisters came to be acknowledged as towering figures in English literature. Among them, Charlotte Brontë attained pre-eminent renown. Hers was perhaps the most sorrowful fate: deprived of lasting love, bearing the unflagging burdens of an elder sister, her life closed before she had completed her fortieth year. Her younger sisters were like tender fruit blighted before ripening: Emily Brontë died at thirty, and Anne Brontë at twenty-nine.

In that ancient realm, in that stone village of handloom weavers, the solitary literary devotion achieved by those three sisters within an ill-fated, grief-stricken household remains a peerless chapter in English letters. Charlotte’s Jane Eyre, Emily’s Wuthering Heights, and Anne’s The Tenant of Wildfell Hall are celebrated as masterpieces capturing the brooding Yorkshire moorlands in all their shifting play of light and shadow.

Today, Haworth endures as a living monument to the griefs and rare joys of the Brontë family. The parish church, the parsonage museum, and the Brontë family tombs, alongside the Keighley and Worth Valley steam railway and its vintage station, continue to draw pilgrims from across the world.

Wandering through those village lanes resting like a flowerbed amid pastoral vales in the dying days of winter, the memory of those three sisters performing their literary austerities a century ago filled my heart with an unspeakable, lingering sorrow.


Featured image: Photography by Joanna-Kmiecik via pexels.com

15-10-2026

4 Replies to “నా ఇంగ్లాండ్ యాత్ర-5”

  1. నమస్కారములు….నాహ్రుదయాన్నిఅత్తుకున్నాయిమీయాత్రావిశేషాలు….చాలాఆనందంఅనిపించింది.,….కానీఅక్కాచెల్లెళ్ళుజీవితంచాలాభాధఅనిపించింది…..

  2. నమస్కారములు….నాహ్రుదయాన్నిఅత్తుకున్నాయిమీయాత్రావిశేషాలు….చాలాఆనందంఅనిపించింది.,….కానీఅక్కాచెల్లెళ్ళుజీవితంచాలాభాధఅనిపించింది…..

  3. The Yorkshire countryside you describe reminded me of the setting in James Herriot’s ‘All Creatures Great and Small’, Sir. The green pastures, grazing sheep, rolling hills and old English villages.

Leave a Reply