నా ఇంగ్లాండ్ యాత్ర-8

14

లండన్ లో ఒక రాత్రి

మేం మలేషియానుండి తిరిగి వచ్చిన వీకెండ్‌లోనే లండన్ పర్యటన ఏర్పాటుచేసుకున్నాం. నిజానికి లండన్ పోవడానికి నాకు ప్రత్యేకంగా ఏమీ ఆసక్తి లేదు. ఆ రెండు రోజులుకూడా ఉత్తరఇంగ్లాండ్‌లో ఏదయినా గ్రామప్రాంతానికి పోయి గడిపి రావాలనే అనుకున్నాను. మహానగరాల పట్ల నాలో కరడుగట్టిన వైముఖ్యం లండన్‌పట్ల కూడా కరగలేదు. బ్లేక్ లండన్ పైని రాసిన కవిత (1793) చదివినప్పుడు ఆయన మరింత పరుషంగా రాసివుంటే బాగుండునే అనుకున్నాను.

బ్లేక్ కవిత:

లండన్ మహానగరాన్ని ప్రతి ఇంగ్లీషు రచయితా ప్రేమించాడు, తన భావి జీవితకేంద్రం కనుక. కాని రహస్యంగానూ, బహిరంగంగానూ, దాన్ని ద్వేషించకుండా తప్పించుకోలేకపోయాడు, సామూహికమైన, అతికాయమైన ఏ మహాశక్తుల్నో అది మేల్కొల్పుతున్నది కనుక. షేక్స్పియర్ చారిత్రక నాటకాల్లో లండన్ మోహవ్యాకుల నేపథ్యంలో కన్పిస్తుంది, ముఖ్యంగా రెండవ కింగ్ రిచర్డ్ నాటకం. రినైజాన్స్ నాటి లండన్ నే  షేక్స్పియర్ క్షమించలేకపోయాడంటే విక్టోరియన్ యుగపు లండన్‌ను చూసి ఏమనివుండేవాడో. వర్డ్స్‌ వర్త్ లండన్ పైని రాసిన ప్రసిద్ధపద్యంలో (1802) ఇలా అంటున్నాడు:

ఈ కవితకి ముందో వెనుకో లండన్‌పైనా మరొక కవిత కూడా రాసాడు వర్డ్స్‌ వర్త్. మహానగరాన్ని చూసినప్పుడు జీవిత విలువలకీ విచారణకీ మధ్యనున్న అగాధం అతన్ని మరింత బాధించింది. చాలా స్పష్టమయిన వాక్యాల్లో ఆయన ఇలా ఆక్రోశించాడు:

లండన్‌ని చూడటమంటే నిలవనీళ్ళలో నిలిచిన నాచుమొక్కని చూడటమన్న భయంతో అనుమానంతో నేషనల్ ఎక్స్‌ ప్రెస్ కోచ్‌లోంచి లండన్‌నేలపై అడుగుపెట్టాను. విక్టోరియా కోచ్‌స్టేషన్ నుండి బయటకివచ్చి టూరిస్ట్‌ ఇన్ఫర్మేషన్ సెంటర్ కోసం వెతుక్కుంటుండగా లండన్‌రైడ్ సైట్‌సీయింగ్ వారి రిప్రజెంటేటివ్ మమ్మల్ని పిలిచి ఆకర్షణీయమైన సైట్‌సీయింగ్ సర్వీస్ గురించి వివరించి టిక్కెట్లు చేతిలో పెట్టాడు. ఇక రానున్న ఇరవైనాలుగు గంటల్లో మేము లండన్‌రైడ్ బస్‌సర్వీస్‌లో దాదాపు వందకి పైగా ఉన్న స్టాపుల్లో ఎక్కడన్నా దిగి, ఎక్కడన్నా ఎక్కి, లండన్‌ని తేలిగ్గా, వివరంగా చూసే అవకాశమన్నమాట.

మేం మొదటి అవకాశంలోనే లండన్‌ని గ్రాండ్‌టూర్‌లో చుట్టిరావాలనుకున్నాం. ఓపెన్‌టాప్ బస్‌లో డిజిటల్లీ ప్రోగ్రామ్‌డ్ కామెంటరీతో బస్ విక్టోరియా నుండి వెస్ట్‌ మినిస్టర్ ఎబే మీదుగా వెస్ట్‌మినిస్టర్ బ్రిడ్జి మీంచి పార్లమెంట్ భవనాన్ని చుట్టి తిరిగి మరలా వెనక్కు తిరిగి ట్రఫాల్గర్ స్క్వేర్ మీదుగా తూర్పులండన్ వైపు ప్రయాణించి లండన్‌టవర్ వరకూ పోయి తిరుగు ప్రయాణంలో మమ్మల్ని పిక్కడిల్లీ సర్కస్‌వద్ద దింపేవరకు ఆ మొదటి గంటలోనే లండన్ తన మహాపక్షాల్తో భూమిపైన వాలిన గరుడపక్షిలా నన్ను ఆనందసంభ్రమాల్లో ముంచెత్తింది.

లండన్ గురించిన నా భయాలు, అనుమానాలు ఎక్కడికి పోయాయో తెలీదు. ఇంకా తన మహాసామ్రాజ్యమధ్యంలో ఉన్నట్లే, రోమ్, బాబిలోన్, డమాస్కస్, కైరో, మొఘల్‌డిల్లీలవలె ఆ సామ్రాజ్యం ఎన్నటికీ అస్తమించని సామ్రాజ్యమన్నట్లే, తాను ప్రపంచకేంద్రంలో ఇంకా ఒక విజయధ్వజంగా నిలబడినట్లే లండన్ భావిస్తున్నట్లు నాకనిపించింది. లాస్ యాంజిల్స్, టోక్యోలవలె అది సమకాలీన నగరం కాదు, వారణాసి, జెరూసలేంల వలే సనాతన నగరం కాదు, షాంఘై, ముంబయిలవలె జనసందోహపు నగరంకాదు, సింగపూర్, కౌలాలంపూర్‌ల వలె యవ్వన శోభతో అలరారుతున్న నగరం కాదు. ఐనప్పటికీ దానిలో ప్రాచీనవైభవం, ఆధునిక గతిశీలతా సమంగా మేళవించినట్లుంది. గ్రీకు లాటిన్ల క్లాసికత, ఫ్రెంచి సౌకుమార్యం, స్కాటిష్ గ్రామసీమల మాధుర్యం కలిసి వికసించిన రమణీయ ఇంగ్లీష్ కవితలావుంది లండన్. చాలా ఏళ్ళ కిందట లండన్‌ని మొదటిసారి చూసినప్పుడు మన్మోహన్‌ఘోష్ ప్రకటించిన ఆనందోత్సాహం నా హృదయంలో ప్రతిధ్వనించింది. ఘోష్ అంటున్నాడు కదా:

ఆ సాయంకాలం పిక్కడిల్లీ సెంటర్‌లో పాడింగ్‌టన్ స్టేషన్‌కి వెళ్ళే బస్సు కోసం వెయిట్‌చేస్తూ నిల్చున్నాం. మా చుట్టూతా అసంఖ్యాకులయిన యాత్రీకులు. మరో వారం దినాల్లో రాబోతున్న ఈస్టర్ పండగ కళ నగరమంతటా ఆవరించింది. పండగ ముందటి వీకెండ్ కావడంతో దేశం నలుమూలలనుండీ మనుషులు లండన్‌కి చేరుకుంటున్నారు. నా చిన్నతనంలో చైత్రమాసపు ప్రారంభంలో జరిగే కొత్త అమావాస్య తిరణాల గుర్తొచ్చింది నాకు.

మేం నిల్చున్న సెంటర్ నగరంలోని అతి పెద్ద వినోదకేంద్రమని తెలుసుకోడానికి అట్టేసేపు పట్టలేదు. నాటకశాలలు, ప్రదర్శనశాలలు రంగురంగుల దీపాల్తో, పోస్టర్లతో, ప్రకటనలతో వెలిగిపోతున్నాయి. దుకాణాలు, రెస్టారెంట్లు, మద్యశాలలు కోలాహలంతో వూగిపోతున్నాయి. మనుషులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఏంకొనాలో, ఏం చూడాలో, ఎటుపోవాలో తేల్చుకోలేని జనసందోహపు వీథుల్తో, అన్నీ కొంటున్న, అన్నీ చూస్తున్న, అన్ని దిక్కులకూ నడుస్తోన్న సహస్ర పథగామిగా లండన్ కన్పించింది. ఆ మానవ కంఠధ్వనుల్లో కరిగి ముద్దవుతూ నన్ను నేను మర్చిపోయాను. ‘ఇది లండన్’ అని మధ్యమధ్యలో గిల్లి చూసుకున్నట్లు గుర్తు చేసుకుంటున్నా ఆ సంతోషపు సాయంకాలానికి ఒక దేశం లేదు, ఒక సరిహద్దులేదు.

ఆ రాత్రి మేం ససెక్స్ గార్డెన్స్ దగ్గర్లో ఉన్న డెల్మీర్ అనే అందమయిన హోటల్లో బస చేసాం. వసంతవిహంగం అక్కడ అప్పటికే వాలివుంది. మెరుస్తున్న దాని రెక్కల తళతళల్లోంచి హోటల్లో అడుగు పెడుతున్నప్పుడు గుమ్మం ఎదట నిండుగా విరబూసిన చెర్రీ తరువు ఆనందస్వాగతమిచ్చింది. ఆ హోటల్ రిసెప్షనిస్ట్ తనే ఒక స్వచ్ఛపుష్పంలా ఆదరించింది. నా ఉల్లాసాన్ని అణుచుకోలేక ‘మీ హోటల్ పూల పొదరిల్లులాగా వుంది, ఈస్టర్, వసంతం కలిసి లండన్ని లక్ష పక్షులు వాలిన రాజోద్యానంలా మార్చేసాయి’ అన్నాను ఆమెతో. పూలరేకులు గాలికి వూగినట్లుండే చిరునవ్వు నవ్వి ఆమె ‘ఎంత సంతోషకరమైన మాట విన్నాను’ అన్నది. ఆ మాటల్లో ఒట్టి మర్యాద కన్పించలేదు నాకు. మహిమోపేతమయిన వసంతగానం మామూలు చెట్లని నందనతరువులుగా మార్చినట్లే నన్నూ, ఆ రిసెప్షనిస్టుని కూడా అతిలోక రమణీయానుభూతిని పంచుకునేట్లు చేసింది.

ఆ రాత్రి మేం మళ్ళా వూళ్ళోకి వెళ్ళాం, పిక్కడిల్లీ సర్కస్‌లో క్రైటీరియన్ థియేటర్లో ‘కంప్లీట్ వర్క్స్ ఆఫ్ విలియం షేక్స్పియర్’ చూడటానికి. నాటకం చూడటానికి ముందొక పిజ్జాహట్‌లో ప్రవేశిస్తుంటే కెరటాల్లాగా మనుషులు గుంపులు గుంపులుగా తోసుకుంటున్నారు. వీథుల్లో నృత్యాలు, కేరింతలు, బేగ్‌పైపర్లు, బెలూన్లు, పిల్లలు, ముఖ్యంగా పిల్లలు, సాయంకాలం వేళ ఆకాశంలో ఎగిరే కొంగలబారుల్లా ఏదో గమ్యం, దిశ ఏమీలేకుండా అటూ ఇటూ ఎటుపడితే అటు కదిలిపోతున్న పురుషులు, స్త్రీలు, పిల్లలు, వృద్ధులు. పైని ఆకాశంలో వెన్నెల, పురాతనహర్మ్యాలపైని, నగరవీథులపైని ధవళసుందరమైన వెన్నెల, ఆ చంద్రికలకి వేలాడే రంగురంగుల దారాల్లాగ విద్యుద్దీపపు కాంతులు. ఆ ఆనందం ఎంత ప్రమోదభరితంగా ఉందంటే మేం అండర్‌గ్రౌండ్ ట్యూబ్ దిగి వాషింగ్టన్ స్టేషన్ మెట్లు ఎక్కుతుంటే ఆ మెట్ల దగ్గర ఒక ప్రేమికుడు పారవశ్యంతో ఫిడేలు వాయిస్తున్నాడు. అతడు యాచకుడుకాదు, దాత, జీవితానందం నుండి తాను పొందిన సమస్త ఉత్తేజాన్ని దోసిళ్ళతో విరజిమ్ముతున్న ఆనందప్రదాత.

మిత్రులారా, ఆనాటి ఆ మహానగరం, ఆ వెన్నెల రాత్రి, ఆ చెర్రీ సుమాలు, ఆ చలిగాలులు, ఆ సంగీత వాద్యాలు, ఆ జనసందోహం ఇవన్నీ ఒక్కుమ్మడిగా నా ఆత్మపైని మీటిన ఆనందసంగీతాన్ని నేను మీకు ఎట్లా వివరించగలను? ಆ రాత్రి నేను క్రీస్తు పునరుత్థానం చెందడాన్ని కళ్ళారా చూసాను. మృత్యుతుల్య హిమరాత్రుల నుండి సూర్యరశ్మిమంతమైన వసంతప్రభాతాల్లోకి మేల్కొంటున్న జనజీవితం నన్నుకూడా నా గాఢనిద్రనుండి పైకి లేపింది. బీదరికం, నిరుద్యోగం, శాపాలు, క్షామం ఉన్న ప్రపంచమే ఇది అయి ఉండవచ్చుగాక, కాని మానవసంతోషం వాటన్నింటికన్నా మహత్తరమయిందనిపించింది. మనుష్య జీవితానందపు ఉత్సవసౌరభం ముందు ఏ గాలీ నిలవలేదనిపించింది. ఆ రాత్రి నేను నా జీవితంలో కెల్లా అత్యంతసుందరమయిన దాన్ని దేన్నో చూసినట్లే భావిస్తున్నాను. లండన్ మహానగరంలోని ఆ రాత్రి తరువాత నేను మరింత బలోపేతుడిగా, సంతోషభరితుడిగా మారానని చెప్పుకోవడానికి నాకేమీ సంకోచం లేదు.


14

A Night in London

We arranged our visit to London for the very weekend following our return from Malaysia. In truth, I felt no special eagerness to go to London. My own preference had been to spend those two days exploring some secluded rural district in northern England. The stubborn aversion to great metropolises that had hardened within me had not softened toward London. Reading William Blake’s poem London (1794), I had often felt he might well have written with an even sharper, more unsparing severity:

I wander thro’ each charter’d street,
Near where the charter’d Thames does flow,
And mark in every face I meet
Marks of weakness, marks of woe.

In every cry of every Man,
In every Infant’s cry of fear,
In every voice, in every ban,
The mind-forg’d manacles I hear.

How the Chimney-sweeper’s cry
Every black’ning Church appalls;
And the hapless Soldier’s sigh
Runs in blood down Palace walls.

But most thro’ midnight streets I hear
How the youthful Harlot’s curse
Blasts the new-born Infant’s tear,
And blights with plagues the Marriage hearse.

Every English writer has loved London, for it was the indispensable center of his worldly ambitions. Yet, whether in secret or openly, none could escape hating it, because it awakened colossal, monstrous forces of collective existence. In Shakespeare’s history plays—most notably in Richard II—London looms as a brooding, feverish backdrop. If Shakespeare could not forgive the London of the Renaissance, one wonders what he would have uttered upon beholding the London of the Victorian era. In his celebrated sonnet London, 1802, William Wordsworth cried out:

Milton! thou shouldst be living at this hour:
England hath need of thee: she is a fen
Of stagnant waters: altar, sword, and pen,
Fireside, the heroic wealth of hall and bower,
Have forfeited their ancient English dower
Of inward happiness. We are selfish men;
Oh! raise us up, return to us again;
And give us manners, virtue, freedom, power.

Thy soul was like a Star, and dwelt apart;
Thou hadst a voice whose sound was like the sea:
Pure as the naked heavens, majestic, free,
So didst thou travel on life’s common way,
In cheerful godliness; and yet thy heart
The lowliest duties on herself did lay.

Around the same time, Wordsworth composed another poem on London (Written in London, September 1802). Beholding the great city, the chasm separating genuine human values from the restless pursuit of wealth tormented him still more deeply. In unmistakable terms, he lamented:

O Friend! one feeling was there which pursued
Her thinkings, then and now: “O gentle Friend!
“What true ground of contentment are we in?
“What good is given to men, more than a show
“Of easy indulgence, though it could not bring
“One hour of peace? …
…Rapine, avarice, expense,
This is idolatry; and these we adore:
Plain living and high thinking are no more:
The homely beauty of the good old cause
Is gone; our peace, our fearful innocence,
And pure religion breathing household laws.

It was with a lingering fear and suspicion—as though stepping forth to gaze upon a fen of stagnant waters—that I stepped down from the National Express coach onto London soil. Emerging from Victoria Coach Station, while searching for the Tourist Information Centre, a representative from London Pride Sightseeing called out to us, explained their hop-on hop-off service, and placed the tickets in our hands. For the next twenty-four hours, this pass gave us the freedom to board or disembark at any of their hundred-plus stops, exploring London with ease and unhurried depth.

We decided to begin with their grand circular tour. Seated upon the open-top deck with digitally programmed commentary guiding the way, the bus rolled from Victoria past Westminster Abbey, crossed Westminster Bridge, circled the Houses of Parliament, turned back through Trafalgar Square, drove east toward the Tower of London, and finally set us down at Piccadilly Circus. Within that very first hour, London swooped upon me like an eagle descending upon the earth with outspread wings, overwhelming me with sheer wonder and astonishment.

Where had my apprehensions and misgivings vanished? London seemed to bear itself as though it still reigned at the heart of a colossal empire—as though, like Rome, Babylon, Damascus, Cairo, and Mughal Delhi, its dominion were an empire that could never set; as though it still stood at the center of the world like an unvanquished banner of victory.

It is not a contemporary metropolis like Los Angeles or Tokyo; it is not a sacred primordial city like Varanasi or Jerusalem; it is not an overwhelming hive of humanity like Shanghai or Mumbai; nor is it a gleaming citadel of youthful opulence like Singapore or Kuala Lumpur. Yet within its fabric, ancient majesty and modern dynamism seemed to merge in equal measure. London appeared like an enchanting English poem blossoming from the harmonious marriage of Greco-Roman classicism, French grace, and the lyric sweetness of the Scottish countryside.

The joy that Manmohan Ghose had voiced upon beholding London for the first time echoed through my heart. In his poem London, Ghose had sung:

Farewell, sweetest country; out of my heart, you roses,
Wayside roses, nodding, the slow traveller to keep.
Too long have I drowsed alone in the meadows deep,
Too long alone endured the silence Nature espouses.
Oh, the rush, the rapture of life! throngs, lights, houses,
This is London. I wake as a sentinel from sleep.

Stunned with the fresh thunder, the harsh delightful noises,
I move entranced on the thronging pavement. How sweet,
To eyes sated with green, the dusty brick-walled street!
And the lone spirit, of self so weary, how it rejoices
To be lost in others, bathed in the tones of human voices,
And feel hurried along the happy tread of feet.

And a sense of vast sympathy my heart almost crazes,
The warmth of kindred hearts in thousands beating with mine.
Each fresh face, each figure, my spirit drinks like wine,
Thousands endlessly passing. Violets, daisies,
What is your charm to the passionate charm of faces,
This ravishing reality, this earthliness divine?

O murmur of men more sweet than all the wood’s caresses,
How sweet only to be an unknown leaf that sings
In the forest of life! Cease, Nature, thy whisperings.
Can I talk with leaves, or fall in love with breezes?
Beautiful boughs, your shade not a human pang appeases.
This is London. I lie, and twine in the roots of things.

That evening, we stood at Piccadilly Circus waiting for a bus to Paddington Station, surrounded by an immense throng of travellers. The spirit of the coming Easter festival, due in another week, had already cast its festive radiance across the entire city. It being the weekend preceding the holidays, people were arriving in London from every corner of the realm. It brought back memories of my childhood: the vibrant Kotta Amavasya village fairs that gathered in the opening days of the month of Chaitra.

It took little time to realize that where we stood was the grandest pleasure ground in the city. Theatres and exhibition halls blazed with vivid lights, posters, and hoardings; shops, restaurants, and pubs surged with boisterous clamor; people seemed breathless with delight. With streets packed with crowds wondering what to buy, what to see, and which way to turn, London appeared like a thousand-pathed wanderer—buying everything, beholding everything, stepping out in every direction at once.

Dissolving into that ocean of human voices, I lost all sense of myself. Though I pinched myself at intervals, whispering “This is London,” that evening of joy belonged to no single country and knew no frontier.

That night, we stayed at the Delmere, a lovely hotel near Sussex Gardens. The bird of spring had already perched there. Stepping into the foyer through the glimmer of its glistening wings, a cherry tree in full, radiant blossom before the entrance offered a jubilant greeting. The receptionist welcomed us like an unblemished flower herself. Unable to restrain my delight, I said to her:

“Your hotel is like a bower of blossoms; Easter and spring together have transformed London into an imperial garden where a hundred thousand birds have alighted.”

Smiling a smile that seemed like petals swaying in the breeze, she said:

“What a wonderful thing to hear!”

Her words held no mere polite formality. Just as the sublime song of spring had transformed ordinary trees into celestial bowers, so too it allowed me and that receptionist to share in an otherworldly, lyric delight.

Later that night, we headed back into the city to the Criterion Theatre at Piccadilly Circus to watch The Complete Works of William Shakespeare (Abridged). Stepping into a Pizza Hut before the performance, people were surging forward in rolling waves. The streets were filled with dancing, joyous shouts, bagpipers, balloons, and children—above all, children. Men, women, the young, and the elderly were moving in every direction without set purpose or fixed path, like flights of cranes drifting across an evening sky.

Above, moonlight bathed the ancient edifices and the stone thoroughfares in pale, immaculate lustre, while the festive electric illuminations hung below those beams like strings of coloured silk. The joy was so intoxicating that as we emerged from the Underground and mounted the steps of the station, a lover stood upon the landing, playing his violin in pure rapture. He was no mendicant; he was a benefactor, a giver of joy, scattering handfuls of the vital exhilaration he had gathered from the ecstasy of life.

Friends, that great city, that moonlit night, those cherry blossoms, those cold breezes, those musical instruments, and that vast sea of humanity—how can I convey the symphony of joy they struck upon my soul in unison?

That night, with my own eyes, I beheld the Resurrection of Christ. Human life stirring awake from the deathly cold of winter nights into sunlit mornings of spring lifted me too from my deep slumber. This may well be a world of poverty, unemployment, curses, and famine; yet human joy seemed greater than them all. Before the festive fragrance of human gladness, no chilling wind could hold its ground.

I felt that night as though I had looked upon the loveliest thing in my entire life. After that night in the metropolis of London, I have no hesitation in saying that I emerged stronger, fuller, and far more joyous.


Featured image: Photography by Dalia Nava via pexels.com

15-10-2026

Leave a Reply