ఎనభై నాలుగు సంవత్సరాల జీవితంలో నేను చూసిన ప్రపంచంలో అందరూ మంచివాళ్లే లేరు, చెడ్డవాళ్లు కూడా ఉన్నారు. కానీ నా అదృష్టవశాత్తూ ఏ మంచివాళ్లని కలిసానో వాళ్ల గురించే నా ‘యాది’లో రాశాను. చెడు గురించి పాఠాలు చెబితే ఏమీ పనిచేయదు, మనకు ఎదురైన మంచిని మాత్రమే నలుగురికీ పంచుదాం. ..
పుస్తక పరిచయం-29
పుస్తక పరిచయం ప్రసంగాల్లో భాగంగా మేఘసందేశ కావ్యం గురించి ఇది ఎనిమిదవ ప్రసంగం. ఇప్పటిదాకా 40 శ్లోకాలు, అంటే, కావ్యంలో మూడవవంతు పూర్తయింది. ఇవాళ 41-49 దాకా శ్లోకాల గురించి నా భావాలు పంచుకున్నాను. ఈ ప్రసంగం ఇక్కడ వినవచ్చు,
పుస్తక పరిచయం-27
పుస్తక పరిచయం ప్రసంగ పరంపరలో భాగంగా కాళిదాసు మేఘసందేశం మీద ఆరవ ప్రసంగం. ఈ రోజు పూర్వమేఘంలోని 33-39 శ్లోకాల దాకా చర్చించాను. కవి మేఘాన్ని ఉజ్జయినిలో తిరిగి చూడమన్న దృశ్యాల గురించి సంతోషంగా తలుచుకున్నాను. ఆ ప్రసంగం ఇక్కడ వినవచ్చు.
